ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రా బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ పోస్టర్లతో కూడిన ఓ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ పోస్టర్లలో ఆయన కూడా ఉన్నారు. దీంతో వాద్రా ప్లాన్స్ ఏమిటంటూ బీజేపీ నుంచి మరికొందరిని నుంచి వరుస కామెంట్లు వచ్చాయి.
”భారత్ జోడా యాత్రలో వాద్రా కలవడం ఫన్నీగా ఉంది. ఇప్పుడు ఆయన అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడగలనని అనుకుంటున్నారా?” అని బీజేపీ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
వాద్రా ట్వీట్‌కు జోడించిన పోస్టర్లలో ప్రియాంక, రాహుల్ గాంధీ, ఆ పక్కనే రాబర్ట్ వాద్రా ఉన్నారు. వారిపైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో పాటు, స్పానర్స్ జేడీ అభిజిత్ ఫోటో కూడా ఉంది. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ విభాగం నేతగా అభిజిత్ ఉన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అవినీతి, ఆశ్రితపక్షపాతం జరిగిందని, వాటి లబ్ధిదారుల్లో రాబర్ట్ వాద్రా ఒకరని ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సంబంధాల కారణంగా తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఆ ఆరోపణలను వాద్రా కొట్టివేస్తూ వచ్చారు. కాంగ్రెస్ సైతం ఏళ్ల తరబడి ఆయన స్వతంత్రుడని, కాంగ్రెస్ హయాంలో ఆయన అనేక విధాల లబ్ధి పొందారంటూ చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ కక్షతో చేస్తున్నవేనని చెబుతోంది.
ఈ నేపథ్యంలో వాద్రా ట్వీట్లో పొలిటికల్ పోస్టర్లు, కాంగ్రెస్ ఎన్నికల గుర్తు హస్తం వంటివి చోటుచేసుకోవడంపై పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారా? అని ఒక ట్విట్టరాటీ ప్రశ్నించగా, వాద్రా మాత్రం స్పందించలేదు.. ”అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున గాంధీల కుటుంభంతో పార్టీ విస్తరణ మునుగిపోతున్న నౌకలా మారింది. ఇదేమీ దేశ ఐక్యత కోసం చేపట్టిన ప్రయత్నం కాదు. రాహుల్‌ను నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం. ఆయనను ఎన్నిసార్లు నాయకుడిగా నిలబట్టే ప్రయత్నం జరగలేదు?” అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
దేశ ఐక్యత విషయంలో ఆయన రికార్డు చాలా బలహీనంగా ఉందని, ఇప్పుడు ఐక్యత అంటూ టూర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాత్ర వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదనే విషయం యావద్దేశానికి తెలుసునని చెప్పారు. కాగా, కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ శతబ్దంలోనే పెద్ద కామెడీ అని బీజీపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఓ ట్వీట్లో ఎద్దేవా చేశారు.