పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. జర్మనీలోని మ్యునిచ్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమావేశాలకు వెళ్లిన పంజాబ్ సీఎంను ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో దించేసినట్లు తెలుస్తోంది. లుఫ్తాన్సా విమానం ఎక్కేందుకు వచ్చిన సీఎం భగవంత్‌ను అధికారులు విమానం నుంచి గెంటివేసినట్లు తెలుస్తోంది.
పూర్తిగా మద్యం సేవించి మత్తులో వచ్చిన సీఎం మాన్ విమానాశ్రయంలో నడవలేకపోయారని ఆరోపణలు వచ్చాయి. శనివారం ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. సోయి లేకుండా తాగి ఉన్న సీఎం భగవంత్ మాన్‌ను లుఫ్తాన్సా విమాన అధికారులు దించి వేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
దీని వల్లే ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశాలకు మాన్ రాలేకపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పంజాబ్ సీఎం తాగి ఉండడం వల్లే విమానం 4 గంటలు ఆలస్యంగా బయలుదేరినట్లు కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి.
పెట్టుబడులు ఆకర్షించేందుకు జర్మనీ వెళ్లిన పంజాబ్ సీఎంకు అక్కడ చేదు అనుభవం ఎదురవ్వడం వల్లే ఫుల్‌గా తాగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పంజాబ్‌లో బీఎండబ్ల్యూ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థకు చెందిన ఇండియా యూనిట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.