ఆదిపురుష్ చిత్ర బృందానికి, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి విదితమే.
ఈ సినిమాకు చెందిన టీజర్ ఇటీవలే విడుదల కాగా, పలు వర్గాలు టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఆదిపురుష్ చిత్రబృందం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ ఓ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఆ సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా కోరింది.
తాజాగా ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు హీరో ప్రభాస్‌తో పాటు ఆదిపురుష్ చిత్ర బఅందానికి నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆదిపురుష్ టీజర్ విడుదలయినప్పటి నుండి విపరీతంగా ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది.
రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే ఓంరౌత్ ఆదిపురుష్ తెరకెక్కించారంటూ దర్శకుడిపై పలువురు రాజకీయ నేతలు మండిపడ్డారు. యానిమేటెడ్ చిత్రంలా ఉందని కొందరు ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను చూపించిన విధానం సరైందని కాదని.. పలు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.