ఐదేళ్లు కంటే ఎక్కువ కాలంపాటు ఎంపిలు, ఎమ్మెల్యేలపై ఎన్ని క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సర్వోనుత న్యాయస్థానం హైకోర్టులను ప్రశ్నించింది. పెండింగ్ కేసుల సంఖ్యతోపాటు ట్రయల్స్‌ను త్వరితగతిన ముగించేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన అఫిడవిట్లను నాలుగు వారాల్లో దాఖలు చేయాలని దేశంలోని అన్ని హైకోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఐదేళ్లకుపైబడి పెండింగ్‌లో ఉను అన్ని కేసులలో సంబంధిత హైకోర్టుల నుంచి నివేదికను కోరాలని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజరు హన్సారియా అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది.
768 మంది పార్లమెంట్ సభ్యుల్లో దాదాపు 400 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని న్యాయవాది హన్సారియా ధర్మాసనానికి తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోనిసెక్షన్ 8కి ఈ రిట్ పిటిషన్ సవాలుగా ఉందని, నిర్దిష్ట నేరాలకు శిక్ష అనుభవించిన వ్యక్తులను కొన్ని సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించవచ్చని తెలిపారు.
బిల్కిస్ బానో కేసులోలాగా, జీవిత ఖైదు పడిన నిందితులు ఇప్పుడు బయట ఉన్నారని, సెక్షన్ 8లో పేర్కొన్న సమయం తరువాత వారు ప్రజాప్రతినిధులుగా ఎనిుకయ్యేందుకూ అవకాశముంటుందని పేర్కొన్నారు. అమికస్ క్యూరీ ఆందోళనను వివరంగా వినాలని ధర్మాసనం నిర్ణయించింది.