‘‘రాబోయే 25 సంవత్సరాలు 130 కోట్ల మంది భారతీయుల కు చాలా కీలకం’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశం లో ఆజాదీ కా అమృత్ కాల్ మొదలైందని చెబుతూ ఈ కాలంలో మనం భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దాలనేటటువంటి లక్ష్యాన్ని సాధించవలసి ఉందని గుర్తు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ రాబోయే కొన్ని నెలల్లో హిమాచల్ స్థాపన జరిగి 75 సంవత్సరాలు కూడా పూర్తి కానున్నాయని, అంటే భారతదేశం ఎప్పుడైతే స్వాతంత్ర్యం తాలూకు వంద సంవత్సరాల ను ఒక ఉత్సవం గా జరుపుకొంటుందో అదే కాలం లో హిమాచల్ సైతం తన ఆవిర్భావం అనంతరం వంద సంవత్సరాల ఘట్టాన్ని జరుపుకొంటుందన్నమాట అని తెలిపారు.
ఈ కారణంగానే రాబోయే 25 సంవత్సరాల లో ప్రతి రోజు మనకు చాలా ముఖ్యమైంది అని ప్రధాన మంత్రి వివరించారు. కవలం నాలుగు లోక్ సభ సీట్లు మాత్రమే ఉండడంతో ఇప్పటి వరకు అభివృద్ధిలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ రాష్ట్రం తమ డబల్ ఇంజిన్ ప్రభుత్వాలు చూపుతున్న శ్రద్ద కారణంగా విశేషమైన అభివృద్ధి జరుగుతున్నదని ప్రధాని గుర్తు చేశారు. ఇదివరకటి ప్రభుత్వాలు పని భారం, ఒత్తిడి తక్కువ గా ఉన్నటువంటి, మరి అలాగే రాజకీయ ప్రయోజనాలు అధికం గా ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే సేవల ను అందించేవి అని ప్రధాన మంత్రి ఎద్దేవా చేశారు.
‘‘డబల్ ఇంజిన్ ప్రభుత్వం పని చేసే సరళి మిగతా వాటి కంటే భిన్నమైంది. మా ప్రాధాన్యం ఏమిటి అంటే ప్రజల జీవనాన్ని సులభతరం గా ఎలా మార్చాలి అనేదే. అందుకనే మేం ఆదివాసి ప్రాంతాల మీద, ఇంకా కొండ ప్రాంతాల మీద గరిష్ఠ శ్రద్ధ ను తీసుకొంటున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.
గ్యాస్ కనెక్శన్ లు, తాగునీటి ని నల్లా ద్వారా సరఫరా చేయడం, ఆరోగ్య సేవ లు, ఆయుష్మాన్ భారత్, ఇంకా రహదారి సంధానం సమకూర్చడం వంటి చర్యల ను గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ కార్యాలు సుదూర ప్రాంతాల లో, కొండ ప్రాంతాలలో ప్రజా జీవనంలో పరివర్తన ను తీసుకువస్తున్నాయని తెలిపారు. ‘‘మేం పల్లె ప్రాంతాల్లో వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామంటే, అదే కాలంలో వైద్య కళాశాలలను జిల్లాలలో సైతం తెరుస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.
గడచిన 8 సంవత్సరాల లో జరిగిన అభివృద్ధి ని గురించి ప్రధాన మంత్రి స్పష్టంగా చెప్తూ, దేశవ్యాప్తంగా కొండ ప్రాంతాలలోను దుర్గమ ప్రాంతాలలోను ఆదివాసి ప్రాంతాల లోను శీఘ్ర అభివృద్ధి కి సంబంధించిన ఒక మహా యజ్ఞం సాగుతోందని మోదీ తెలిపారు. దీని యొక్క లాభాలు హిమాచల్ లోని చంబా కు మాత్రమే పరిమితం కావని, ఈ లాభాలను పంగీ-భార్ మౌర్, ఛోటా – బడా భంగాల్, గిరింపార్, కిన్నౌర్, ఇంకా లాహౌల్ –స్పీతీలు కూడా అందుకొంటున్నాయని తెలిపారు.
ఆకాంక్ష యుక్త జిల్లా ల అభివృద్ధి ర్యాంకింగులో చంబా రెండో స్థానాన్ని సంపాదించినందుకు ఛంబాకు ఆయన అభినందన లు తెలిపారు. ఆదివాసి సముదాయాల అభివృద్ధి విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, సిర్ మౌర్ పరిధి లోని గిరిపార్ ప్రాంతానికి చెందిన హటీ సముదాయానికి ఆదివాసి హోదాను ఇవ్వాలన్న మరొక ప్రముఖ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకొందని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ లోను, కేంద్రం లోను మునుపటి ప్రభుత్వాలు సుదూర గ్రామాలను, ఆదివాసి గ్రామాల ను ఒక్క ఎన్నికల కాల లో మాత్రమే పట్టించుకొనేవి. అయితే ఇప్పటి డబల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రజలకు నిరంతరాయంగా సేవ చేయడం కోసం శ్రమిస్తోంది అని ప్రధాని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా లో రెండు జల విద్యుత్తు పథకాలు రెండిటికి ప్రధానిశంకుస్థాపన చేయడం తో పాటు గా ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై) – III ను ప్రారంభించారు.
అంతకు ముందు, ఉనాలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపనతోపాటు ఉనా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఐఐఐటీ)ని జాతికి అంకితం చేశారు. ఉనాలోని అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే కొత్త ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ రైలును జెండా ఊపి ప్రారంభించారు.