బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని యోగ గురువు బాబా రామ్‌దేవ్ ఆరోపించారు. సినిమా హీరోల మత్తుమందు సంబంధాల గురించి అందరికీ తెలిసిందే అంటూ పూర్తి నిజాలు ఆ దేవుడికే తెలుసు అని ఆయన పేర్కొన్నారు. ముంబై కేంద్రంగా తారల డ్రగ్స్ వ్యవహారాలపై, మత్తుమందుల పార్టీలపై ఆయన స్పందించి తమ వ్యాఖ్యలతో వివాదానికి దారితీశారు.
పేరు మోసిన నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సంబంధిత ఘటన గురించి అందరికి తెలిసిందే అని గుర్తు చేశారు. డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఆరంభిస్తూ చిత్ర పరిశ్రమ ఒక్కటే కాదు, రాజకీయాలలో కూడా డ్రగ్స్ దందాలు విస్తరించుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మొరాదాబాద్‌లో జరిగిన ఆర్యవీర్, వీరాంగణ సదస్సులో ఆయన మాటలు వైరల్ అయ్యాయి. షారూక్ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్లాడు. హీరోయిన్ల విషయం అయితే తనకు తెలియదని, అది ఆ భగవంతుడికే తెలుసునని వ్యాఖ్యానించారు.
మత్తుమందు అలవాటు నుంచి భారతదేశం దూరం కావాలని కోరుతూ దీని కోసం తాము ఉద్యమిస్తామని రామ్‌దేవ్ ప్రకటించారు. మాదకద్రవ్యాల విముక్తి మేరకు అంతా ప్రతిన వహించాలని పిలుపు నిచ్చారు. రాజకీయాలకు లిక్కర్ పనిలో పనిగా మత్తు మందు కూడా విస్తరించుకుందని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు సరఫరా చేస్తారని, మత్తు మందు కూడా దీనికి తోడవుతోందని అంటూ ఇది ప్రమాదకరమైన విషయం అని హెచ్చరించారు
.