గుజరాత్ అసెంబ్లీకి కొద్దీ రోజులలో ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ ప్రకటించనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసమే తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
శనివారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు కమిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ మీడియాకు వెల్లడించారు.శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశం భూపేంద్రపటేల్ నేతృత్వంలోని మంత్రివర్గం చివరి సమావేశంగా పరిగణిస్తున్నారు.
ప్రస్తుతం క్యాబినెట్ ఆమోదం తెలపిన యూసీసీ కమిటీకి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, ముగ్గురు లేదా నలుగురు సభ్యులు కమిటీలో ఉంటారని కేంద్ర మంత్రి పరోత్తమ్ రూపాలా తెలిపారు. ఇప్పటికే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి.