సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశం బెంగళూరు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఇన్వెస్ట్ కర్ణాటక 2022 సమ్మిట్లో ప్రధానివీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటూ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
గ్లోబల్ క్రైసెస్ సమయంలో కూడా ఆర్థిక వేత్తలు, నిపుణులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రశంసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. పెట్టుబడి దారులను రెడ్ టాపిజం నుంచి విముక్తి చేశామని చెప్పారు. అలాగే వారికి రెడ్ కార్పెట్ అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు.
తంలో మూసివేయబడిన ప్రైవేటు పెట్టుబడులను కూడా ప్రోత్సహించామని పేర్కొంటూ స్పేస్, డిఫెన్స్, డ్రోన్స్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించామని చెప్పారు. కరోనా తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రాథమిక అంశాలపై పనిచేస్తున్నామని తెలిపారు. అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు, నిపుణులు భారతదేశాన్ని మాత్రం ఆర్థిక సంక్షోభం నుంచి శరవేగంగా బయటపడుతుందని చెప్పినట్లు గుర్తు చేశారు.
వివిధ దేశాలతో కేంద్రం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని ప్రధాని తెలిపారు. కర్ణాటకలో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ పోటీతత్వం.. సహకారాత్మక సమాఖ్య వాదానికి ఇది సరైన ఉదాహరణగా పేర్కొన్నారు. తయారీ, ఉత్పాదకత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు-నియంత్రణపై ఆధారపడి ఉంటుందని ప్రధాని తెలిపారు.
మరోవైపు బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఇన్వెస్ట్ కర్ణాటక 2022 సమ్మిట్ జరగనుంది. నవంబర్ 4 వరకు బెంగళూలరులో కార్యక్రమం జరగనుంది. పెట్టుబడిదారులను ఆక్షర్షించడంతో పాటు, అభివృద్ధి చేపట్టే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.