రాబోయే ఏడాది కాలంలో భారతదేశంలో గేమింగ్ పరిశ్రమ 20-30 శాతం వృద్ధి చెందుతుందని, 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా వేస్తున్నారు. టీమ్‌లీజ్ డిజిటల్ తాజాగా విడుదల చేసిన “గేమింగ్: రేపటి ప్రభంజనం” పేరుతో విడుదల చేసిన నివేదికలో ప్రస్తుతం ఈ రంగం దాదాపు 50,000 మంది వ్యక్తులకు నేరుగా ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు.
వీరిలో 30శాతం మంది వర్క్‌ఫోర్స్ ప్రోగ్రామర్లు, డెవలపర్లుగా సేవలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈరంగంలో ప్రోగ్రామింగ్ (గేమ్ డెవలపర్లు, యూనిటీ డెవలపర్లు), టెస్టింగ్ (గేమ్స్ టెస్ట్ ఇంజనీరింగ్, క్వాలిటీ అండ్ అస్యూరెన్స్ లేదా క్యూఏ లీడ్), యానిమేషన్ (యానిమేటర్లు), డిజైన్ (మోషన్ గ్రాఫిక్ డిజైనర్లు, వర్చువల్ రియాలిటీ) వంటి డొమైన్లలో కొత్త ఉద్యోగాలను అందిస్తుంది.
విజువల్ ఎఫెక్ట్స్ లేదా వీఎఫ్ఎక్స్, కాన్సెప్ట్ ఆర్టిస్టులు, కంటెంట్ రైటర్లు, గేమింగ్ జర్నలిస్టులు, వెబ్ అనలిస్ట్‌ల రూపంలో వేలాది కొలువులు రానున్నాయి.వేతనాల కోణంలోనూ గేమింగ్ పరిశ్రమ మెరుగైన వృద్ధితో దూసుకెళ్తోంది. గేమింగ్ పరిశ్రమలో అత్యధిక చెల్లింపు ప్రొఫైల్‌లలో గేమ్ నిర్మాతలు (రూ.10 లక్షలు), గేమ్ డిజైనర్లు (రూ 6.5 లక్షలు), సాప్ట్nవేర్ ఇంజనీర్లు (రూ 5.5 లక్షలు), గేమ్ డెవలపర్లు (రూ 5.25 లక్షలు) , క్యూఎ టెస్టర్లు (రూ 5.11 లక్షలు) ఉన్నారు.
తరచూ నియంత్రణ మార్పుల కారణంగా అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పటికీ, గేమింగ్ పరిశ్రమ 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి లక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2026 నాటికి 2.5రెట్లు వృద్ధి చెందుతుందని అంచనా వేసినట్లు టీమ్‌లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ చెమ్మన్‌కోటిల్ పేర్కొన్నారు.
2026 నాటికి గేమింగ్ పరిశ్రమ మార్కెట్ విలువ రూ. 38,097 కోట్లకు చేరుతుందని, 480 మిలియన్ల బలమైన గేమింగ్ కమ్యూనిటీతో, చైనా తర్వాత భారతదేశం రెండవ అతిపెద్దదిగా ఉందని పేర్కొన్నారు.
గేమింగ్ పరిశ్రమలో పని చేయాలనుకునే అభ్యర్థులు సాప్ట్‌వేర్‌లో బీసీఏ, 3డీ, 2డీ యానిమేషన్, విఎఫ్ఎక్స్లో డిప్లొమా నుండి ఐటీలో ఎంటెక్, బీటెక్ వరకు అర్హతలకు ప్రాధాన్యం లభిస్తుంది. వెబ్-3, మెటావర్స్ కలయికతో గేమిఫికేషన్ కేవలం సాంప్రదాయ గేమింగ్ మార్గాలకు మాత్రమే పరిమితం కాలేదు.
అయితే ఈ-కామర్స్, ఫిన్‌టెక్, విద్య మొదలైన ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలకు విస్తరించింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో, ఈ రంగంలో బలమైన వృద్ధికి తోడ్పడింది అని లోలివాలా జోడించారు. ప్రస్తుతం, ఆదాయం పరంగా, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ మార్కెట్ ఇండెక్స్‌లో ఆరవ స్థానంలో ఉంది.
ఈ రంగం మార్చి 2023 చివరి నాటికి రూ.780 కోట్ల ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. గేమింగ్ పరిశ్రమలో 40శాతం కంటే ఎక్కువ మహిళల భాగస్వామ్యం ఉందని, ఈ రంగంలో ఎక్కువ మంది మహిళలు నాయకత్వ పాత్రలు పోషిస్తున్నారని టీమ్‌లీజ్ తెలిపింది.