కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిత్యం ఏదో ఒక వివాదంకు నెలవుగా మారుతున్నది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. ఐతే ఇటీవల ఆయన రాజస్థాన్‌కు చెందిన మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే దివ్య మహిపాల్ మడెర్నాను ముద్దుపెట్టడంపై దుమారం రేగుతోంది.
దివ్యను తలపై రాహుల్ ముద్దుపెట్టిన ఫొటోను బీజేపీ నేత అరుణ్ యాదవ్ పోస్ట్ చేశారు. దీనికి బెస్ట్ క్యాప్షన్ చెప్పాలని నెటిజన్లను అడిగారు. ఆయన ట్వీట్‌తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ ట్వీట్‌పై దివ్య మడెర్నా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఏడు క్యాప్షన్స్ ఇచ్చి బీజేపీపై ఎదురు దాడికి దిగారు.
రాహుల్ గాంధీ తన సంరక్షకుడు, గురువు, అన్నయ్య, దయ కలిగిన నాయకుడు అని పేర్కొన్నారు. నిన్ను సిగ్గేస్తుందని.. మీకు కూడా కూతురు, భార్య, తల్లి ఉంటుంది కదా.. అని మండిపడ్డారు. వ్యక్తిత్వాన్ని కించపరచడం ఆపాలంటూ విరుచుకుపడ్డారు.భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో జరుగుతున్న సమయంలో ఓసియన్ (రాజస్థాన్) ఎమ్మెల్యే దివ్య మహిపాల్ మడెర్నా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో నడిచారు. ఆ సందర్భంగా దివ్య తలపై ముద్దు పెట్టాను. ప్రస్తుతం ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ మొదలుపెట్టిన భారత్ జోడోయాత్ర కేరళ, కర్నాటక,ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తి చేసుకొని, ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. అనతరం యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానాల మీదుగా.. జమ్మూకాశ్మీర్ వరకు ఉంటుంది.
భారత్‌జోడో యాత్రలో భాగంగా అన్న రాహుల్‌తో కలిసి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ నడిచారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో భర్త రాబర్ట్ వాద్రా, కొడుకు రోహిన్‌తో కలిసి ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. సెప్టెంబర్7న కన్యాకుమారిలో భారత్‌జోడో యాత్ర ప్రారంభమైన తర్వాత తొలిసారి రాహుల్‌తో ప్రియాంక కలిసి నడిచారు.