ప్రపంచంలో తిరుగులేని నాయకుడు తానేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో 77 శాతం రేటింగ్‌తో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 56 శాతం రేటింగ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ద్వితీయ, ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41శాతం రేటింగ్‌తో తృతీయ స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత స్థానాల్లో కెనడా ప్రధాని ట్రుడో, బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని కిషిండా నిలిచారు. ”మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్” ఈ సర్వే నిర్వహించి, 22 దేశాల అధినేతల రేటింగ్స్‌తో ఫలితాలు విడుదల చేసింది.
గత సర్వే నివేదికల్లో కూడా మోదీ అత్యంత ప్రజాదరణ గల నేతగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 75 శాతం రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తాజా సర్వేలో మోదీ రేటింగ్ మరో 2 శాతం పెరగడం గమనార్హం.
కొందరు కుట్రపూరిత చరిత్రనే బోధించారు
కాగా, స్వాతంత్య్రం తర్వాత కూడా కొందరు కుట్రపూరిత చరిత్రను బోధించారని ప్రధాని మోదీ మండిపడ్డాయిరు. దేశం వలసవాదాన్ని విడిచిపెట్టి వారసత్వంతో గర్వంగా ఉందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన లచిత్ బర్ఫుకాన్ 400 జయంతి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. లచిత్ బర్ఫుకాన్ 400వ జయంతి సందర్భంగా ఆ పరాక్రమశాలికి నమస్కరిస్తున్నామని అన్నారు.
అస్సాం సంస్కృతిని పరిరక్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రధాని తెలిపారు. అంతకుముందు అసోం సీఎంతో కలిసి ఎగ్జిబిషన్ ను సందర్శించారు. సాంస్కృతిక వేడుకలు జరుపుకోవటమే కాదు చారిత్రక నాయకులను స్మరించుకుంటున్నామని మోదీ చెప్పారు.