మహిళలు దుస్తువులు ధరించకపోయిన బాగుంటారనే అనే వ్యాఖ్యలపై యోగ గురు రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పారు. రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర మహిళా కమిషన్ రాందేవ్‌కు నోటీసులు జారీ చేసింది.
దానితో బాబా రాందేవ్ క్షమాపణలు కోరినట్లు మహారాష్ట్ర కమిషన్ ఛైర్పర్సన్ రూపాలి చకాల్కర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. క్షమాపణలు కోరుతూ రాందేవ్ బాబా పంపిన లేఖను కూడా ఆమె తన పోస్టుకు జతచేశారు. మహిళల సాధికారత కోసం, వారి గౌరవం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని బాబా రాందేవ్ తన లేఖలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాలను ప్రోత్సహించానని, మహిళా సాధికారక కోసం తాను ఎల్లప్పుడు కృషి చేశానని చెప్పారు. మహిళలను అగౌరవంగా చూడలేదని చెబుతూ సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని థానేలో మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరానికి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, పలువురు మహిళలు, రామ్‌దేవ్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్దేవా బాబా ప్రసంగించారు.
యోగా చేసిన అనంతరం మహిళలు యోగా దుస్తువులు మార్చుకునేందుకు సమయ దొరకకపోవడంతో చీరలు ధరించలేదని పేర్కొంటూ మహిళలు చీరల్లో, సల్వార్ సూట్లలో అందంగా ఉంటారని మెచ్చుకున్నారు. అయితే మహిళలు దుస్తువులు ధరించకపోతే ఇంకా బాగు ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్నవారు అసహనానికి గురయ్యారు. సోషల్ మీడియాలో రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.