గుజరాత్ సీఎంగా బీజేపీ నాయకుడు భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ భూపేంద్ర పటేల్‌తో ప్రమాణం చేయించారు. గాంధీ నగర్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
భూపేంద్ర పటేల్‌తో పాటు మంత్రులుగా హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ, నరేష్ పటేల్, బచుభాయ్ ఖబద్, పర్షోత్తమ్ సోలంకి గుజరాత్ కేబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు.
ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగు లేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఏడోసారి అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. ఆరేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. మొత్తం 182 స్థానాలకి 156 స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం17 సీట్లు గెలుచుకోగా… ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదు స్థానాలను గెలుచుకుని రాష్ట్ర శాసనసభలో ఖాతా తెరిచింది.