దేశవ్యాప్తంగా 45 సెంట్రల్ యూనివర్శిటీల్లో దాదాపు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 1 నాటికి మంజూరు చేసిన మొత్తం 18,956 పోస్టుల్లో సెంట్రల్ యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం మొత్తం 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ నివేదికలు పేర్కొన్నాయి.
వీటిలో మొత్తం మంజూరైన 2,553 పోస్టుల్లో ప్రొఫెసర్ల పోస్టులు 1,529, మొత్తం మంజూరైన 5,110పోస్టుల్లో 2,304 అసోసియేట్ ప్రొఫెసర్లు, మొత్తం మంజూరైన 1,293 పోస్టుల్లో 2,347 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
వెనకబడిన తరగతుల విభాగంలో, మూడు కేటగిరీలలో మొత్తం మంజూరైన పోస్టుల సంఖ్య 3,451 కాగా, అందులో 1,559 ఇప్పటికీ భర్తీ చేయలేదని పేర్కొన్నారు.
ఐఐటిలలో (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ) 11,170 మంది మంజూరైన ప్రొఫెసర్ పోస్టులలో 4,502 ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఐఐఎమ్లలో (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) 1,556 మంది 439 మంది టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.