తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకు పోవడంతో అప్పులు కూడా పుట్టని పరిస్థితులు నెలకొనడంతో, ప్రధాని జోక్యం చేసుకొని రాష్ట్రానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ రుణపరిమితిని పెంచేటట్లు చేయమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభ్యర్ధించారు. బుధవారం ఆయనతో సమావేశమై సుమారు 45 నిముషాలు చర్చించిన ముఖ్యమంత్రి ఆర్ధికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు.
ఏపీకి కొత్త అప్పులు ఇవ్వడం సాధ్యంకాదని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తేటతెల్లం చేసిన నేపథ్యంలో గతంలోని టిడిపి పాలనపై విమర్శలు గుప్పిస్తూ, వారి చేసిన పనుల కారణంగానే ప్రస్తుతం కేంద్రం తమపై రుణపరిమితి ఆంక్షలు విధిస్తున్నదని, కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోందని ఆరోపించారు.
అయితే, జగన్ అభ్యర్ధనలు విన్న ప్రధాని ఎటువంటి హామీ ఇచ్చినట్లు సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలపలేదు. ఈ సమావేశంలో విభజన సమస్యలు, పోలవరానికి నిధులు, రుణాలపై విధిస్తును ఆంక్షలను ప్రధానికి దృష్టికి సిఎం తీసుకువెళ్లారు.
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడిచినా అనేక అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయినా ఎటువంటి పురోగతి లేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. వివిధ పద్దుల కింద రాష్ట్రానికి కేంద్రం నుండి 32,625 కోట్ల రూపాయలు రావాల్సిఉందని, ఆ మొత్తానిు తక్షణం విడుదల చేయాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 2,937 కోట్లను ఇంకా చెల్లించలేదని, ఆ మొత్తానిు వెంటనే చెల్లించాలని కోరారు. అదే విధంగా పెరిగిన వ్యయంతో కలిపి రూ. 55,548 కోట్లను పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంగా పరిగణించాలని కోరారు. త్రాగునీరు సరఫరాను ప్రాజెక్టు నుంచి వేరుచేసి చూస్తునాురని, దీనిు ప్రాజెక్టులో భాగంగా చూడాలని కోరారు. పునరావాస పనులు పూర్తి చేసి, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిలువచేసేందకు తక్షణం రూ..10,485.38 కోట్లు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని అడ్హాక్గా మంజూరు చేయాలని కోరారు.
రాష్ట్రానికి 12 మెడికల్ కళాశాలలను కేటాయించాలని, కడపలో నిర్మించనున్న సీల్ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని కేటాయించాలని, విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సహకారాన్ని అందించాలని కోరారు.