గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని , ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పేసరైన విధానమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ముష్కరులకు ఎలాంటి నియమాలు ఉండనప్పుడు, దాడులకు ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుంద మహారాష్ట్ర లోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ స్పష్టం చేశారు.
ఉగ్రవాద ముప్పు, దేశ దౌత్య సంబంధాల వంటి అంశాలపై యువత అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఏయే దేశాలతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉందని అడగ్గా, పొరుగున ఉన్న పాకిస్థాన్ అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని దాయాదిని ఉద్దేశిస్తూ మరోసారి తేల్చి చెప్పారు.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని చెబుతూ మనం మొదట్నుంచీ స్పష్టంగా ఉంటే అప్పుడు భారత విదేశాంగ విధానం భిన్నంగా ఉండేదని తెలిపారు. అయితే 2014 నుంచి మన విదేశీ విధానంలో 50 శాతం మార్పు వచ్చిందని, అది కూడా ఉగ్రవాదంపై మనం స్పందించే తీరుల్లోనే అని తెలిపారు.
ముంబై దాడుల తరువాత ఉగ్రవాదంపై భారత్ స్పందించాలని అందరూ అనుకున్నారని చెప్పారు. అయితే, ఆ సమయంలో పాకిస్థాన్‌పై దాడి చేయడం కంటే చేయకపోవడం వల్లే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఒకవేళ 26/11 ముంబై పేలుళ్ల వంటి ఘటన ఇప్పుడు జరిగితే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకపోతే, తర్వాతి దాడులను మనం ఎలా నిరోధించగలం? అని జైశంకర్ ప్రశ్నించారు.
సరిహద్దులకు ఆవల మనం ఉన్నాం కదా… మనల్ని ఎవరూ టచ్ చేస్తారని ముష్కరులు అనుకుంటున్నారని చెప్పారు. అయితే, అది నిజం కాదని మనం రుజువు చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ఎలాంటి రూల్స్ పెట్టుకుని దాడులు చేయరు. అలాంటప్పుడు వారి చర్యలకు ప్రతిచర్ ఎయలు కూడాలాంటి నియమాలకు లోబడి ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి తెచ్చి చెప్పారు.