చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వయోభారం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు భూపతిరాజా వెల్లడించారు. ఆయన
ఆయన వయసు 86 సంవత్సరాలు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పనిచేసారు. బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, సోగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి హిట్ సినిమాలకు కథ అందించారు. గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన ‘బంట్రోతు భార్య’ సినిమాకు కూడా ఆయనే కథ అందించారు.
తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్‌కు దాదాపు 40 కథల వరకు అందించారు. బాలమురుగన్ మృతి పట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బాలమురుగన్ మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలుగు, తమిళ సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
బాల మురుగన్ తనయుడు భూపతి రాజా కూడా తండ్రిలాగానే సినీ రంగంలో రైటర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథను అందించారు.