Author: Editor's Desk, Tattva News

బుల్డోజర్ కూల్చివేతలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పందించారు. అయితే ఆ ఆదేశాలు ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న విషయాలకు సంబంధించినవి,. అవి హైడ్రాకు వర్తించవని స్పష్టం చేశారు. యూపీలో ఎవరైనా నేరాలకు పాల్పడితే ఆ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆస్తులను కూల్చివేస్తుందని తెలిపారు. ఆ కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశిందని హైడ్రా కమిషనర్ తెలిపారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని పేర్కొన్నారు. హైడ్రా నేరస్థులు, నిందితుల ఆస్తుల జోలికి వెళ్లడం లేదని ఏవీ రంగనాథ్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లో బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపునకు వర్తించవని తెలిపిందని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ లో చెరువులు, నాలాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా నగరంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. వీటిల్లో…

Read More

ఖైరతాబాద్‌ గణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్‌ బాద్‌ నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్‌ భవన్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ చేరుకున్నాడు. అనంతరం వెల్డింగ్‌ పనులు పూర్తయిన తర్వాత.. మహాగణపతికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు.  నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద లంబోధరుడిని నిమజ్జనం చేశారు. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్‌ జనసంద్రంగా మారిపోయింది. గతపతి బప్పా మోరియా నినాదాలతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు మారుమ్రోగాయి. భాగ్యనగరమే కాదు దేశవ్యాప్తంగా ఖైరతాబాద్‌ గణేషుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఉత్సవాలను ప్రారంభించి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి రికార్డు స్థాయిలో 70 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. శిల్పి చిన్న స్వామి రాజేందర్‌ ఆధ్వర్యంలో లంబోధరుడుని రూపొందించారు. 200 మంది కార్మికులు ఒకటిన్నర రోజులు శ్రమించి గణేషుడిని అలంకరించారు.  11 రోజులపాటు మహాగణపతిని లక్షలాది మంది…

Read More

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు ఏర్ప‌డి వంద రోజులు దాటింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు దేశంలో రాజ‌కీయ స్థిర‌త్వాన్ని తీసుకువ‌చ్చింద‌ని తెలిపారు. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేశామ‌ని, ప్ర‌జ‌లు వాటికి సాక్ష్యాలుగా నిలిచిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.  అమిత్ షాతో పాటు మంత్రులు అశ్వినీ వైష్ణ‌వ్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 100 రోజుల పాల‌న‌లో సాధించిన ప్ర‌గ‌తిపై రూపొందించిన ఓ బుక్‌లెట్‌ను అమిత్ షా ఆవిష్క‌రించారు.  ప‌దేళ్ల అభివృద్ధి, భ‌ద్ర‌త‌, సంక్షేమం త‌ర్వాత ప్ర‌జ‌లు మూడ‌వ సారి బీజేపీ మిత్ర కూట‌మిని మ‌రోసారి ఆశీర్వ‌దించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌డిచిన 60 ఏళ్ల‌లో ఇలా జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి అని చెప్పారు. ఇది దేశంలో రాజ‌కీయ స్థిర‌త్వాన్ని తీసుకువ‌చ్చింద‌ని, పాల‌సీల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేశామ‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీ తీసుకువ‌చ్చిన కొత్త విద్యా విధానంలో..…

Read More

ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్లే మంత్రి అతిశీని కొత్త ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ నివాసంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఆమె శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుత సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ రాజీనామా అనంతరం మంత్రి అతిషి సీఎం బాధ్యతలను చేపట్టనున్నారు. ఆమె పేరును కేజ్రీవాల్​ స్వయంగా ప్రతిపాదించారని సమాచారం. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో గతవారం బెయిల్​పై బయటకు వచ్చిన ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్​ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ నెల 26,27 తేదీల్లో దిల్లీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ వ్యవహారంలో అరవింద్​ కేజ్రీవాల్ తో పాటు ఆమ్​ ఆద్మీ పార్టీ గత…

Read More

కాలు కదపకుండా పరిపాలన సాగించడానికి తానేమి ఫామ్‌ హౌస్‌ సీఎంను కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 17 హైదరాబాద్ సంస్థానం భారతసమాఖ్యలో విలీనమైన రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు ప్రకటించారు. గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన రేవంత్‌ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యక్తిగత స్వార్థంతో తాను తరచూ ఢిల్లీకి వెళ్లడం లేదని, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఎన్నో అంశాలు ఉంటాయని, పన్నులుగా ఎన్నో లక్షల కోట్లు కడుతున్నామని, వాటిని తెచ్చుకోడానికి ఎన్నిసార్లైన ఢిల్లీ వెళ్తానని ప్రకటించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ, 76ఏళ్ల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, పెత్తందారి తనానికి వ్యతిరేకంగా దాశరధి స్ఫూర్తిగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సి ఉందని చెప్పారు. ఓ వైపు అక్షరయోధులు ఓ వైపు, సాయుధ యోధులు మరోవైపు నాటి రాచరికాన్ని ముట్టడించి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్క్రతమైందని,…

Read More

బాలాపూర్ గణేష్ లడ్డూకు వేలంలో మరోసారి రికార్డు ధర పలికింది. ఇవాళ వేలం పాటలో బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.30 లక్షలు పలికింది. కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేష్ లడ్డూను రూ.30,01000 దక్కించుకున్నాడు. గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.27 లక్షలు పలికిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో గణేశ్ లడ్డూ రూ.1.87 కోట్లు రికార్డు ధర పలికింది.  1994లో  కొలను మోహన్‌రెడ్డి  రూ.450, 1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500లు, 1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు, 1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు, 1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు, 1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి- రూ.65 వేలు, 2000 కొలన్ అంజిరెడ్డి- రూ.66 వేలు, 2001 జి. రఘనందన్ రెడ్డి- రూ.85 వేలు, 2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000లు, 2003లో చిగిరినాథ బాల్ రెడ్డి- రూ.1,55,000లకు దక్కించుకున్నారు. …

Read More

పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన కొలిక్కి వచ్చింది. కోల్‌కతాలో నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యుల డిమాండ్లు నెరవేర్చేందుకు దీదీ ప్రభుత్వం అంగీకరించింది. నాలుగుసార్లు రద్దు అయిన తర్వాత సోమవారం రాత్రి జూనియర్‌ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.  దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో వైద్యులు ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.  ఐదు డిమాండ్లలో మూడింటికి మమతా సర్కార్‌ అంగీకరించింది. ఈ మేరకు వారి డిమాండ్లు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వైద్యులతో సమావేశం ముగిసిన గంటల వ్యవధిలోనే కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, వైద్యశాఖకు చెందిన ఇద్దరు అధికారులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.  వారి స్థానంలో మంగళవారం కొత్త అధికారులను నియమించనున్నట్లు వెల్లడించింది. మిగిలిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కార్యాచరణ చేపట్టనుందని చర్చల ముగిసిన అనంతరం స్వయంగా…

Read More

అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లోని తన గోల్ఫ్‌ కోర్టులో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్​బీఐ పేర్కొంది. ట్రంప్‌నకు గోల్ఫ్‌ ఆడే అలవాటు ఉంది. అప్పుడప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్న భోజనానికి ముందు వరకు వెస్ట్‌ పామ్‌ బీచ్‌లోని తన గోల్ఫ్‌ కోర్టులో గడుపుతారు. ఎన్నికల ప్రచారం మగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ట్రంప్, ఆదివారం గోల్ఫ్ ఆడుతున్నారు. గోల్ఫ్‌ క్లబ్‌ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్‌ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి…

Read More

ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం సస్పెన్షన్‌ చేసింది. ముంబై నటి కాదంబరి జెత్వానిపై అక్రమంగా పెట్టి, అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేసిన కేసులో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు , విజయవాడ మాజీ సీపీ కాంతారాణా తాతా, విశాల్‌ గున్నిని సస్పెండ్‌ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో దూకుడుగా వ్యవహరించి, నాటి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేసి, చిత్రహింసలకు గురిచేసిన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడగానే బదిలీ చేసి, పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు. వైసీపీ హయాంలో…

Read More

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటి హయాంలోనే అనుకున్నట్లుగా ఒకే దేశం ఒకే ఎన్నికలు విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ విషయం ఈ ప్రక్రియకు సంబంధిత వర్గాలతో స్పష్టం కాగా, ఇందుకు సంబంధించి విధివిధానాలను సర్కారు రూపొందించుంటున్నట్లు వెల్లడైంది. “ప్రస్తుత హయాంలోనే ఈ ఎన్నికల వినూత్న ప్రక్రియ ఖచ్చితంగా అమలు అవుతుంది. ఇంతవరకూ ఆలోచనల్లో ఉన్న అంశం వాస్తవికతను సంతరించుకుంటుంది” అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలను జమిలి తరహా లో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే మోడీ పలుసార్లు వేదికలపై తెలిపారు. పైగా సాధ్యాసాధ్యాల ప రిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యం లో ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటు అయింది.పైగా ఈ కమిటీ ఇప్పటికే దేశంలో ఏకకాల ఎన్నికలు ఉత్తమమమనే విషయాన్ని నివేదిక ద్వారా కేంద్రానికి అందించింది. ఈ విధంగా తాను అనుకున్న సంవిధానానికి అనుమతి రావడంతో మోడీ దీనిని త్వరలోనే కార్యాచరణకు తీసుకువచ్చే వీలుంది. ఎన్‌డిఎ…

Read More