ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై శనివారం ఆగంతకులు రాయితో దాడి చేసిన 24 గంటల సమయంలోనే అలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులపై రాళ్ల దాడి జరిగింది. అయితే ఈ ఘటనలలో రాళ్లు చంద్రబాబు, పవన్ లకు దూరంగా పడడంతో వాళ్లకు గాయాలు కాలేదు. చంద్రబాబు విశాఖ జిల్లా గాజువాక ప్రజాగళం సభలో మాట్లాడుతున్న సమయంలో ఆగంతకులు చంద్రబాబుపై రాళ్లు విసిరారు. ఈ రాళ్లు చంద్రబాబు సమీపంలో పడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి పరారయ్యారు. తనపై రాళ్లు విసరడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు వేసిన వారిని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాళ్లు వేసిన దుండగులను పట్టుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించగా, నిందితులు పరారయ్యారు. అనంతరం సభలో చంద్రబాబు మాట్లాడుతూ…”ప్రభుత్వం నీది.. ముఖ్యమంత్రి నువ్వు..…
Author: Editor's Desk, Tattva News
అమర్‌నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీన అష్టమి తిథి మధ్యాహ్నం 02.19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 అంటే రేపట్నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు. కాగా, అమర్‌నాథ్ యాత్రికులకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా అమర్‌నాథ్ యాత్ర టైమ్ టేబుల్ ను విడుదల చేసింది. ఈసారి భక్తులు సహజసిద్ధమైన శివ లింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. www.jksasb.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. హిమ రూపంలో ఉన్న పరమ శివుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హర హర మహదేవ…
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం జనం పోటెత్తుతుంటారు. ఎక్కడెక్కడి నుంచి రోజూ వేలాదిమంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వస్తుంటారు. ఇలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా టీటీడీ ఆధ్వర్యంలో కోట్ల మంది భక్తులు శ్రీవారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకుని వెళ్తున్నారు. మరోవైపు వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలోనూ రాముడు కొలువుదీరాడు. అయోధ్య గర్భాలయంలో కొలువైన బాలరాముడి దర్శనం కోసం కూడా భక్త జనం భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చేయాల్సిన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు టీటీడీ సాయం కోరింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం ఫిబ్రవరి నెలలో అయోధ్యను సందర్శించింది.…
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబైలో సల్మాన్ నివాసముండే బాంద్రా ప్రాంతం లోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ముందు ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్టు పోలీస్‌లు వెల్లడించారు. క్రై బ్రాంచితోపాటు స్థానిక పోలీస్‌లు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. దీనిపై సల్మాన్‌ఖాన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ముంబై పోలీస్ కమిషనర్‌తో షిండే మాట్లాడి ఖాన్‌కు భద్రత పెంచాలని సీఎం ఆదేశించారు. గత ఏడాది మార్చిలో సల్మాన్ ను బెదిరిస్తూ ఆయన ఆఫీస్‌కు ఈ మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పోలీస్‌లు, గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరు టార్గెట్…
‘సంకల్ప్ పత్ర’ పేరులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా ఈ మేనిఫెస్టోను రూపొందించింది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫేస్టో కమిటీ 15 లక్షల మంది నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు మోదీ సారథ్యంలో బీజేపీ అనుసరించబోయే విధానాలను వివరిస్తూ మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. సమృద్ధ్ భారత్, విశ్వబంధు, సురక్షిత భారత్, ప్రపంచ స్థాయి మౌలికవసతుల కల్పన, స్వచ్ఛ భారత్, ఈజ్ ఆఫ్ డూయింగ్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సాంకేతిక వికాసం, సంతులిత అభివృద్ధి వంటి అంశాలను చేర్చింది. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం…
విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు ఈ ఘటన చేసుకుంది. రాయి సీఎం జగన్ నుదిటి భాగంలో బలంగా తాకింది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయ్యింది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం రాయి తగిలి గాయం అయ్యింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత సీఎం జగన్ మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు. విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్రకు భారీగా జనం హాజరయ్యారు. విజయవాడ సిటీలో మూడున్నర…
ప్రధాని నరేంద్ర మోదీ లేనిపక్షంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి ఉండేది కాదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి బేషరతు మద్దతు ప్రకటించిన రాజ్ థాక్రే శనివారం విలేకరులతో మాట్లాడుతూ బిజెపి సారథ్యంలోని కూటమి సమన్వయం కోసం తమ పార్టీ నాయకుల జాబితాను తయారుచేస్తామని తెలిపారు. బిజెపి, శివసేన(ఏక్‌నాథ్ షిండే), ఎన్‌సిపి(అజిత్ పవార్)లతో కూడిన మహాయుతి అభ్యర్థుల తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. మహాయుతి తరఫున ప్రచారం చేయాలని తన పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులను ఆదేశించానని, ఎంఎన్‌ఎస్ నాయకులకు తగిన గౌరవం లభిస్తుందని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి మే 20 మధ్య జరిగే ఐదు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. అయోధ్య రామాలయ నిర్మాణం అంశం 1992…
ఎన్నికల బాండ్ల రూపంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు వంద కోట్లు ఇచ్చిన మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. జగదల్‌పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన పనుల విషయంలో మెఘా ఇంజినీరింగ్ కంపెనీకి 174 కోట్ల బిల్లులను క్లియర్ చేయడంలో సుమారు రూ.78 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఎన్‌ఐఎస్‌పీ, ఎన్‌ఎండీసీకి చెందిన ఎనిమిది మంది అధికారులు, మెకాన్‌కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.ఇంటిగ్రేటెడ్‌లోని ఇంటెక్‌వెల్, పంప్ హౌజ్, క్రాస్ కంట్రీ పైప్‌లైన్ పనులకు సంబంధించిన రూ. 315 కోట్ల ప్రాజెక్ట్‌లో లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై సీబీఐ ఆగస్టు 10, 2023న ప్రాథమిక విచారణ జరిపింది. ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ఆధారంగా లంచం ఆరోపణపై సాధారణ కేసు నమోదు చేయాలని మార్చి 18న సిఫార్సు చేశారు. మార్చి 21న ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం…
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇప్పటికే ఆగ్రహంతో రగులుతున్న ఇరాన్ తాజాగా హార్మూర్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎంఎన్‌సీ ఏరిస్ అనే వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకుంది. ఇందులో 17 మంది భారతీయులు ఉన్నట్టు అధికారిక వర్గాల సమాచారం. వీరిని విడిపించేందుకు ఇరాన్‌తో భారత్ సంప్రదింపులు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ కమాండోలు హెలికాప్టర్ సహాయంతో వాణిజ్య నౌకను వెంబడించి స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఇరాన్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఆ నౌకను ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు తరలిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాన్ని తీవ్రతరం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించగా వీరిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన సీనియర్ గార్డ్ జనరల్ కూడా ఉన్నారు. ఇది ఇజ్రాయెల్ పనేనంటూ…
బోర్న్‌విటా సహా ఇతర పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి తొలగించాలని ఈ కామర్స్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వంఆదేశించింది. బోర్న్‌విటాలో చక్కర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవలే ఎన్‌సీపీసీఆర్ నిర్ధారించిన విషయం తెలిసిందే. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ( సీపీసీఆర్) చట్టం-2005లోని సెక్షన్ 3 కింద ఏర్పాటైన బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్‌సీపీసీఆర్ (నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) ఇటీవలే సీఆర్‌పీసీ-2005 చట్టంలోని సెక్షన్ 14 కింద విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006లో ‘హెల్త్ డ్రింక్’ అని దేన్నీ నిర్వచించలేదని నిర్ధారణకు వచ్చినట్లు కేంద్రం ఏప్రిల్ 10 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బోర్న్‌విటా సహా కూల్‌డ్రింక్స్, బేవరేజెస్‌ను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి వెంటనే తొలగించాలని ఈ కామర్స్ సంస్థలను ఆదేశించింది. బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయని ఓ యూట్యూబర్ తన వీడియోలో…