గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని , ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పేసరైన విధానమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ముష్కరులకు ఎలాంటి నియమాలు ఉండనప్పుడు, దాడులకు ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుంద మహారాష్ట్ర లోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ స్పష్టం చేశారు. ఉగ్రవాద ముప్పు, దేశ దౌత్య సంబంధాల వంటి అంశాలపై యువత అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఏయే దేశాలతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉందని అడగ్గా, పొరుగున ఉన్న పాకిస్థాన్ అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని దాయాదిని ఉద్దేశిస్తూ మరోసారి తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని చెబుతూ మనం మొదట్నుంచీ స్పష్టంగా ఉంటే అప్పుడు భారత విదేశాంగ విధానం భిన్నంగా ఉండేదని తెలిపారు. అయితే 2014 నుంచి మన విదేశీ విధానంలో 50 శాతం మార్పు వచ్చిందని,…
Author: Editor's Desk, Tattva News
బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది ఓ బాలిక. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం. కర్నూలు జిల్లా ఆలూరుకి చెందిన నిర్మల తల్లిదండ్రలు నిరుపేదల. ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహం చేయాలని భావించారు. ఈ విషయాన్ని గత ఆమె జిల్లా అధికారులకు నేరుగానే ఫిర్యాదు చేసింది. దీంతో ఈ బాలికకు జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఆ విధంగా చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. బైపీసీలో 440కి 421 మార్కులు…
‘‘ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. ఒకవైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం బరిలో దిగింది. మరోవైపు ఐఎన్డీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నయ్… ఆ కూటమి టీంను చిత్తుగా ఓడించి 400ల స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నరు…’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్థాయి నాయకులతో ‘బూత్ విజయ సంకల్ప్ అభియాన్’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు..దేశంలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ…
”మోదీస్ గ్యారెంటీ: డవలప్డ్ ఇండియా 2047” అనే థీమ్‌తో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ సిద్ధం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం విడుదల కానుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ మేనిఫెస్టో ప్రధానంగా అభివృద్ధిపై దృష్టి సారించనుంది. అభివృద్ధి భారతం లక్ష్యంగా మహిళలు, యువత, పేదలు, రైతుల అభ్యున్నతికి మేనిఫెస్టో భరోసా ఇవ్వనుంది. సాధించగలిగిన హామీలను మాత్రమే ఇవ్వడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశంగా చెప్పనుంది. కల్చరల్ నేషనలిజంపై దృష్టిసారిస్తూ 2047 నాటికి అభివృద్ధి భారతం సాధిస్తామనేది మోదీ ప్రధాన గ్యారెంటీగా ఉండనుంది. ”సబ్ కా సాథ్ సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ సబ్‌కా ప్రయాస్” అనే మంత్రంతో సంకల్ప్ పాత్ర (బీజేపీ మేనిఫెస్టో) ఉంటుంది.…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఆయన సోదరి, ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం జరిపిన పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. కడప లోక్ సభ నుండి పోటీచేస్తున్న ఆమె తన పులివెందులలో ప్రచారానికి వెళ్లిన సందర్భంగా ఆమెకు మద్దతుగా కలిసి ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వివేకా హంతకులకు మద్దతిస్తారా, రాజశేఖర్ రెడ్డి బిడ్డకు మద్దతిస్తారా అంటూ షర్మిల విసురుతున్న సవాళ్లపై వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. షర్మిల లింగాల మండలానికి రాగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. “అల్లరి చేసే వాళ్లు పులివెందుల రండి. పూల అంగళ్ళ వద్ద పంచాయితీ పెడదాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం” అని షర్మిల ఆవేశంగా మాట్లాడారు. లింగాల మండలంలో వైఎస్ షర్మిల ప్రచారం చేస్తుండగా.. వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని…
మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ లకు ప్రయాణం చేయవద్దని భారత పౌరులకు సూచించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ తమ సూచనలు పాటించాలని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏ క్షణమైనా దాడులు చేయొచ్చనే వార్తలు వస్తున్న క్రమంలో విదేశాంగ శాఖ ఈ అడ్వైజరీని జారీ చేసింది. అలాగే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు సమీపంలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని, తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. ఇరు దేశాల్లో నివసిస్తున్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని, అనవసర కదలికలను నియంత్రించాలని సూచించింది. కాగా, ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఇరాన్ అగ్రశ్రేణి ఆర్మీ జనరల్, మరో ఆరుగురు ఇరాన్ సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు. ఈ…
చారిత్రాత్మక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్‌ను హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చే ప్రక్రియ మొదలైంది. హెచ్‌ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏకు సంబంధించిన కార్యకలాపాలు అమీర్‌పేట, నానక్‌రాంగూడ, హుస్సేన్‌సాగర్ లుంబినీ పార్కు ప్రాంతాల నుంచి జరుగుతున్నాయి. వీటన్నింటినీ బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లోకి మార్చేందుకు హెచ్‌ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా పైగా ప్యాలెస్‌లో ఉన్న భవనాలు, అక్కడ ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను పరిశీలిస్తున్నారు. ఎలక్ట్రిక్ విభాగంతో పాటు ఐటీ, నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన ఉద్యోగులు అక్కడి భవనాల్లో ఉన్న వనరులను గుర్తించే పనిలో ఉన్నారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఒకే చోట నుంచి జరిగేలా అవసరమైన మౌలిక వసతులను కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రత్యేకంగా జీవోను…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గురువారం రోజున సీబీఐ అధికారులు అరెస్ట్ చేయగా, శుక్రవారం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి విచారించేందుకు కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరగా, వాదనలు విన్న న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంత ఈనెల 15వ తేదీ వరకు కవితను సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఇప్పటివరకు తీహార్ జైలులో ఉన్న కవితను అధికారులు సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. కవితను మూడు రోజుల పాటు ఇక్కడే విచారించనున్నారు. మరోవైపు కస్టడీ సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను, తన తరుఫు లాయర్లను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో కవిత కస్టడీపై కోర్టులో ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కవిత అరెస్ట్…
లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. పార్టీ టికెట్ లభించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బరిలో నిలిచిన వారిలో నేర చరిత్ర ఉన్న వారు కూడా ఉన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హతమార్చిన నిందితుడు బియంత్ సింగ్ కుమారుడు సరబ్ జిత్ సింగ్ ఖాల్సా (44) కూడా పోటీలో ఉన్నారు. పంజాబ్‌లో గల ఫరీద్ కోట (రిజర్వేడ్) నుంచి స్వతంత్ర పోటీకి దిగారు. గతంలో కూడా ఖాల్సా పోటీ చేశారు. 2009లో బఠిండా నుంచి 2014లో ఫతేగడ్ సాహిబ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఫరీద్ కోట్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2019లో బీఎస్పీ తరఫున ఖాల్సా పోటీ చేశారు. తనకు రూ. 3.5 కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో ఖాల్సా పేర్కొన్నారు. ఖాల్సా తల్లి బీమల్ కౌర్, నానమ్మ సుచా సింగ్ కూడా రోపర్, బఠిండ నుంచి లోక్ సభకు…
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ నజీరుద్దీన్‌ను పెండ్లి చేసుకొని గుంటూరు వాస్తవ్యురాలైన మహమ్మద్ కావ్య నజీరుద్దీన్‌కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటేయాలని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్నించారు. గురువారం హనుమకొండలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లా బిడ్డగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వర్ధన్నపేట ప్రజలకు సేవ చేశానని చెప్పారు. కడియం శ్రీహరి దళితులను అణచివేశారని, ఆయన కుట్రలకు తాను కూడా బలయ్యాయని ఆరోపించారు. తాను మూడోసారి గెలిస్తే మంత్రి రేసులో ఆయన మంత్రి పదవికి ఎక్కడ అడ్డొస్తానోనన్న భయంతో తన ఓటమికి కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మాల, మాదిగలకు దక్కకుండా చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో ఉండి ఎస్సీ నేతలను బయటకు పంపించే వరకు కుతంత్రాలు చేశారని దుయ్యబట్టారు. ఏ పార్టీలో ఉన్నా కడియం శ్రీహరి దళితులను ఎదగకుండా అణచివేశారని ఆరోపించారు. ఇప్పుడు వరంగల్ ప్రజలు.. గుంటూరు…