Author: Editor's Desk, Tattva News

ఎన్నికల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కీలక హామీ ఇచ్చారు. ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ప్రకటించారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని.. ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థను తొలగించబోమని బాబు తేల్చి చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారని సీఎం జగన్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని వాలంటీర్లకు సూచించారు. వలంటీర్లలో సమర్ధత, శక్తి ఉన్నాయని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా వారి భవిష్యత్తును నిర్మిస్తామని తెలిపారు. వలంటీర్ల జీవితాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ వ్యవస్థను ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలని…

Read More

బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్  షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్ర 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. అన్ని పార్టీల నేతలు పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు మహిళల గౌరవాన్ని కించపరచరాదంటూ ఈసీ ఇచ్చిన సూచనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూడా ఈసీ కోరింది. 12వ తేదీ సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని అడిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న హేమమాలిని 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి మధుర నుంచే పోటీలో ఉన్నారు. సూర్జేవాలా చేశారన్న వ్యాఖ్యలపై హేమా మాలిని స్పందించారు. ‘‘పేరు ప్రఖ్యాతులున్న వారిని కాంగ్రెస్ లక్ష్యం చేసుకుంటోంది. పేరుప్రఖ్యాతులున్న వారిని తక్కువ చేయడం వల్ల వారికేమి మేలు జరుగదు. వారు మహిళలను ఎలా గౌరవించాలో ప్రధాని…

Read More

శ్రీరాముడిని కొలిచేవారిని కాంగ్రెస్‌ బహిష్కరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. ప్రజలంతా ఆరాధించే ‘శక్తి’ని కూకటివేళ్లతో పెకలిస్తానంటోందని విమర్శించారు. మనసులో ఇంత విషం ఎందుకు పెట్టుకుందో తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.  మంగళవారం ఆయన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌, యూపీలోని ఫిలిబిత్‌ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కాంగ్రెస్‌ అనేక అడ్డంకులు సృష్టించిందని.. తీరా ప్రజలు సొంత సొమ్ముతో దానిని నిర్మించాక ఆలయ ప్రతిష్ఠకు ఆహ్వానిస్తే తిరస్కరించి శ్రీరాముడిని అవమానించిందని మండిపడ్డారు.  పైగా రామ్‌లల్లా ప్రతిష్ఠాపనకు హాజరైన వారిని ఆరేళ్లు పార్టీ నుంచి బహిష్కరించిందని పేర్కొంటూ ఇదేం పార్టీ అని ప్రశ్నించారు. బుజ్జగింపు రాజకీయాల బురదలో కాంగ్రెస్‌ కూరుకుపోయిందని మండిపడ్డారు. ‘యావద్దేశం శక్తిని ఆరాధిస్తోంది. దాని ముందు అందరూ తలొంచుతారు. అలాంటి శక్తిని కూడా కాంగ్రెస్‌ అవమానించింది. దానిని కూకటివేళ్లతో పెకిలిస్తామని అంటున్నారు. శక్తి ఉపాసకులెవరూ ఈ అవమానానికి ఇండీ కూటమిని క్షమించరు’…

Read More

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని, ఆ పార్టీకి పరాభావం తప్పదని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సిఎం రేవంత్ రెడ్డికి బిజెపితో ఎలాంటి అపాయం లేదని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచే ముప్పు ఉందని హెచ్చరించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఇతర పార్టీల నుంచి పలువురు బిజెపిలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ పార్టీ కండువా కప్పి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని బిజెపి వాళ్ళు చూస్తున్నారని సీఎం రేవం త్ రెడ్డి కొండగల్ లో చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాము ఎలాంటి డిస్ట్రబ్ చేయమని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత తెలంగాణలో బిజెపి ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో భారీ మెజార్టీతో మోదీ ప్రభుత్వం…

Read More

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అరెస్ట్ వ్యవహారంలో ఊరట దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం సరైందేనని పేర్కొంది. తనను ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తాజాగా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.  అరెస్ట్ చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలు ఈడీ అధికారుల వద్ద ఉన్నాయని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ అరెస్ట్, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించడం చట్టవిరుద్ధమేమీ కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే తన అరెస్టును సవాల్‌ చేస్తూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం…

Read More

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. కవితకు విధించిన రిమాండ్‌ 14రోజులు పొడిగించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, జైల్లో సిబిఐ అధికారులు ప్రశ్నించారని, తాను చెప్పాల్సింది ఇప్పటికే కోర్టులో చెప్పానని కవిత పేర్కొన్నారు. తాజా విచారణ సందర్భంగా నాలుగు పేజీల లేఖను కవిత విడుదల చేశారు. లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. తనకు ఎలాంటి ఆర్దిక ప్రయోజనాలు దక్కలేదని, రెండేళ్లుగా కేసు విచారణ ఎటూ తేలడం లేదని, మీడియా ట్రయల్ ఎక్కువగా జరుగుతోందని, సిబిఐ, ఈడీ విచారణ కంటే మీడియా ట్రయల్ ఎక్కువగా జరుగుతోందని ఆమె విమర్శించారు. తన మొబైల్ నంబర్ అన్ని మీడియా ఛానల్స‌్లో ప్రసారం చేసి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని ఆరోపించారు. బీజేపీలో చేరితో ఎలాంటి కేసుల విచారణైనా ఆగిపోతుందని, ఈడీ,సీబీఐ నమోదు చేసిన కేసులు 98శాతం ప్రతిపక్షాలకు చెందిన వారిపైనే ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.…

Read More

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నేత పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో దుమారం చెలరేగింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు ఈసారి ఎన్డీయే పొత్తులో భాగంగా టికెట్ లభించలేదు. దీంతో ఆయన సోమవారం పార్టీకి రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీపైనా తీవ్ర విమర్శలకు దిగారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు.  2019 ఎన్నికల్లోజనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో కూడా టిక్కెట్‌ వస్తుందని భావించారు. అయితే ఎన్నికల పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును బిజెపికి కేటాయించాల్సి వచ్చింది. బిజెపి అభ్యర్థిగా ఇక్కడి నుండి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి  పోటీ చేస్తున్నారు.ఈ సందర్భంగా మహేష్ ను నచ్చచెప్పేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. స్వయంగా సుజనా చౌదరి నచ్చచెప్పే ప్రయత్నం…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్, సిట్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని ఏపీ‌ నుంచి బయటికి పంపింది. ఆయనను అసోంలో ఎన్నికల పోలీసు అబ్జర్వర్‌గా నియమించింది. ఇప్పటికే ఆరుగురు ఐపీఎస్‌లు, ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా కొల్లిని రాష్ట్రం నుంచి దూరంగా… ఈశాన్య రాష్ట్రానికి పంపించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఎన్నికల వరకు ఎన్నికల్లో సాధారణ పరిశీలకులు, వ్య య పరిశీలకులు మాత్రమే ఉండేవారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఈసీ పోలీస్ అబ్జర్వర్‌లను కూడా నియమిస్తోంది. రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులను ఇతర రాష్ట్రాలకు పరిశీలకులుగా పంపించారు. కొల్లి రఘురామిరెడ్డిని అసోంలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలీసు పరిశీలకుడిగా నియమించారు. ఆయన.. గువాహటి కేంద్రంగా ఉండి విధులు నిర్వహిస్తారు. రఘురామిరెడ్డి రాజధాని భూములపై వేసిన ‘సిట్‌’కు ఆయనే అధిపతి. ‘స్కిల్‌’ కేసులో…

Read More

లోక్ సభ ఎన్నికలకు ముందు యూట్యూబ్ లో ఆరోపణలు చేసే ప్రతి వ్యక్తిని కటకటాల వెనక్కి నెడుతూ పోతే ఎంత మందిని జైళ్లో పెట్టాల్సి వస్తుందో ఊహించండి అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో సత్తాయ్ అనే యూట్యూబ్ ఛానెల్ హోస్ట్ దురై మురుగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. దురైమురుగన్ బెయిల్ పిటిషన్ పై న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓకా, ఉజ్జల్ భుయాన్ లతో కూడిని ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం యూట్యూబర్ కు మంజూరయిన బెయిల్ ను పునరుద్ధరించింది. అదే సందర్భంలో రాష్ట్రం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశించి న్యాయమూర్తి ఓకా కీలక సవాలును లేవనెత్తారు. ఎన్నికలకు ముందు, మేము యూట్యూబ్ లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే, ఎంత మందికి జైలు శిక్ష పడుతుందో ఊహించండి అన్నారు. గతంలో…

Read More

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కంగనా రనౌత్ తన దైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు కంగనపై విమర్శలు చేస్తుండగా.. ఆమె కూడా అదే రేంజ్‌లో హస్తం నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నారు.  కంగనా రనౌత్ గో మాంసం తింటారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా వాటిని ఆమె ఖండించారు. తాను హిందువునని, గోమాంసం గానీ, ఇతర మాంసం కానీ ముట్టనని పేర్కొ్న్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా నెటిజన్లు మాత్రం కంగనను వదిలిపెట్టడం లేదు. ఆమె గతంలో చేసిన ఓ ట్వీట్‌ను బయటకు లాగి వైరల్ చేస్తున్నారు. కంగ‌నా ర‌నౌత్ ఆవు మాంసాన్ని తిన్నట్లు కాంగ్రెస్ నేత విజ‌య్ వాడెట్టివార్ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ నెల 5 వ తేదీన మహారాష్ట్రలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన విజయ్ వాడెట్టివార్ అవినీతి నాయకులందరికీ బీజేపీ స్వాగతం…

Read More