Author: Editor's Desk, Tattva News

ఏపీ ఎన్నికల వేళ జనసేన పార్టీకి అండగా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి తోడుగా అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి నిలబడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా బరిలో ఉన్న జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని ఇప్పటికే వారాహి విజయభేరి యాత్రల పేరిట ప్రచారం సైతం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తమ్ముడి పార్టీకి మద్దతుగా నిలిచారు మెగాస్టార్ చిరు. అందులో భాగంగానే జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం అందజేశారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కళ్యాణ్‌కు అందించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ సమయంలోనే విరాళం చెక్కును చిరంజీవి పవన్ కళ్యాణ్‌కు అందించారు. సోమవారం నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి విశ్వంభర షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా…

Read More

అనంతపురం జిల్లాకు చెందిన నేత మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమారుడు ఆశోక్ వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసారు. ఈ మధ్యే శమంతకమణి కూతురు యామినీబాల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయగా, సోమవారం తన కుమారుడు అశోక్‌తో పాటు వైసీపీకి రాజీనామా చేశారు.  కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక, 1989- 1991 వరకు మంత్రిగా సేవలు అందించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇక, 2014లో తన కూతురు యామినీబాలకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. కానీ, 2019 నాటికి రాజకీయాలు మారిపోయాయి. సింగనమల నియోజకవర్గ టికెట్‌ మరోసారి వారికి దక్కకుండా పోవడంతో ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో శమంతకమణి, యామినీబాల, అశోక్‌ వైసీపీలో చేరారు. కాగా, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి శింగనమల…

Read More

లిక్కర్‌ కేసుకు సంబంధించి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్‌ కోరుతూ కవిత వేసిన పిటిషన్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉండటంతో ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత కోరారు.  ఈడీ, కవిత తరపు న్యాయవాదులు వాడీవేడిగా వాదనలు వినిపించారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో… తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది.  ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు… కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఏప్రిల్‌ 4న తీర్పును రిజర్వ్‌ చేసింది. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఇక ఈనెల 20న కవిత రెగ్యులర్‌ బెయిల్‌…

Read More

‘ఫోన్‌ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడిని నేనే. నా ఫోన్‌, నా కుటుంబసభ్యులు, డ్రైవర్‌, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్‌ ట్యాప్‌ చేశారు. దాని వల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నా’ అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌లో ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ తన క్యాబినెట్‌ లోని 17 మంది మంత్రులను కూడా నమ్మలేదని, వాళ్ల ఫోన్లు, భార్య భర్తల సంభాషణలు కూడా విన్నారని ఆరోపించారు. ట్యాపింగ్‌ వల్ల కాపురాలు కూలిపోయాయని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యేలను కాదని ఓడిన ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవాలు జరిపించిందని, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్‌ పీడ విరగడ కావాలని ప్రజలు కాంగ్రె్‌సకు ఓటేశారని, అయితే వారు కూడా కేసీఆర్‌ పాలననే కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల పాలు చేశారని చెబుతున్న కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు…

Read More

బీఆర్ఎస్ నేత, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే పోలీసులు జడ్జి నివాసంలో హాజరుపరిచారు. ఈనెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రహేల్‌ను చెంచల గూడా జైలుకు తరలించారు. గతేడాది ప్రజాభవన్‌ వద్ద జరిగిన ప్రమాదంలో రాహిల్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. యాక్సిడెంట్‌ అనంతరం దుబాయ్‌ పారిపోవడంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేశారు. దుబాయ్ నుంచి తిరిగి ఇండియాకు వస్తుంటే పోలీసులు ఎయిర్‌పోర్టులో అదుపులో తీసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి రాహిల్‌ మద్యం సేవించి అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్‌ వద్ద ట్రాఫిక్‌ డివైడర్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్‌తో కలిసి దుబాయ్ పారిపోయాడు. ఈ…

Read More

మైతేయ్, కుకీ తెగల మధ్య పోరుతో అట్టుడికిన మణిపూర్‌లో రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు ఈనెల 19న పోలింగ్ ప్రారంభం కానున్నా ఇప్పటికీ ఇంకా ఎలాంటి ప్రచారాల హడావిడి లేకుండా మౌనంగా ఉంది. రెండు నియోజక వర్గాల్లో ఒక నియోజకవర్గంలో సగ భాగానికి ఈనెల 19న పోలింగ్ జరగనుండగా, మిగతా సగభాగానికి 26 న పోలింగ్ జరగనుంది. అంటే దాదాపుగా పోలింగ్‌కు ఇంకా రెండు వారాలే ఉంది. ఇప్పటివరకు ఎక్కడా ర్యాలీలు, సభలు లేవు సరికదా, కనీసం పోస్టర్లు కూడా కనిపించడం లేదు. ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులే కనిపిస్తున్నాయి. భారీ ప్రచారంతో మళ్లీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని, శాంతిభద్రతలు తప్పుతాయని భయం పొంచి ఉందని, అందుకే ఏ పార్టీ రిస్కు తీసుకోవడానికి సిద్ధంగా లేదని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏదైనా ప్రచారం భారీగా చేస్తే ప్రజల…

Read More

ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాలు ముమ్మరం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తుంటే, ఎన్డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జనసేన ప్రచారంలో వేగం పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు  నాయుడు ప్రజాగళం సభలు నిర్వహిస్తుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వారాహి విజయ భేరీ యాత్ర చేపట్టారు. ప్రజాగళం ప్రారంభ సభ బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రచారం చేసినా ఆ తర్వాత మూడు పార్టీలు ఎవరి దారిలో వాళ్లు ప్రచారం చేస్తున్నారు. అయితే  ఇప్పుడు ఉమ్మడి ప్రచారానికి రంగం సిద్ధం చేశాయి. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి.  ప్రజాగళం  మూడో విడతలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి గోదావరి…

Read More

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తరచూ అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం నోటీసు జారీ చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏప్రిల్ 5న జగన్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తూ ఈసీకి లేఖ రాశారు. వైఎస్‌ఆర్‌సిపి ‘మేమంత సిద్ధం’ సమావేశంలో చేసిన దురుద్దేశపూరిత వ్యాఖ్యలపై 48 గంటల్లోగా తన స్టాండ్‌ను సమర్పించాలని జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసు పంపింది. లేని పక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై తదుపరి చర్య కోసం సీఈసీకి నివేదిక పంపిస్తారు. ఏప్రిల్ 2, 3, 4 వ తేదీల్లో మదనపల్లె, పూతల పట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ పలు అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హంతకుడు అని, ఆయనకు ప్రజలను…

Read More

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్షా రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. స్మగుల్డ్‌ గూడ్స్‌కు సంబంధించిన కేసులో చెన్నై కస్టమ్స్‌ అధికారులు హర్షకు నోటీసులు ఇచ్చారు. పొంగులేటి కుమారుడు హర్ష పటెక్‌ ఫిలిప్‌, బ్రిగెట్‌ బ్రాండ్‌లకు చెందిన రెండు లగ్జరీ వాచ్‌లను ఇటీవల ఆర్డర్ చేశాడు.  భారత్‌లో దొరకని ఈ బ్రాండ్‌లు తెప్పించుకునేందుకు నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తి సహాయంతో ముబిన్‌ అనే స్మగ్లర్‌ను ఆశ్రయించాడు. హర్ష కోసం ముబిన్‌ ఆ రెండు వాచ్‌లను సింగపూర్‌ నుంచి తెప్పించాడు. ఈ వాచ్‌ల విలువ ఒక్కోటి రూ.1.73 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వాచ్‌ల కోసం హవాలా రూపంలో డబ్బు చెల్లించినట్లు సమాచారం.  ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నై వచ్చిన ఓ భారతీయుడి నుంచి రూ.1.73 కోట్ల విలువైన లగ్జరీ వాచీ లను ఎయిర్ పోర్టులో కస్టమ్స్(Customs) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రిప్టోకరెన్సీ, హవాలా లావాదేవీలను ఉపయోగించి నవీన్…

Read More

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్‌నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిల్లా, మంత్రులు అతిశ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌తోపాటు ఆ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.  ఆమ్ ఆద్మీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం కోసమే బీజేపీ ఈ తరహా కుట్ర పన్నిందని మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. అందులో భాగంగానే డిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరాహార దీక్షలో పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి గోపాల్ రాయ్ పిలుపు నిచ్చారు.  మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా దేశ విదేశాల్లో ఆప్ నేతలు ఈ తరహా…

Read More