Author: Editor's Desk, Tattva News

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుయిన మాజీ డిసిపి రాధాకిషన్ రావు మూడు రోజుల విచారణ శనివారం ముగిసింది. పశ్చిమమండలం డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ నేతృత్వంలోని బృందం రాధాకిషన్ రావు నుంచి మూడో రోజు కీలక విషయం రాబట్టినట్లు తెలిసింది. రాజకీయ నాయకులు వారితో ఉన్న సంబంధం గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ చేయాలని నంబర్లు ఎవరు ఇచ్చారు, వారి వివరాలు అడిగారు. ఇప్పటి వరకు ఎంత మంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసి విషయం విచారణలో అడిగినట్లు తెలిసింది. ఎన్నికల తర్వాత ట్యాపింగ్ పరికరాల ధ్వంసం గురించి ఆరా తీసినట్లు తెలిసింది. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు రాజకీయ నాయకులు, ముఖ్యంగా గత ప్రభుత్వం హయంలో చక్రం తిప్పిన ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ ఎమ్మెల్సీని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం…

Read More

దక్షిణాదిన, తూర్పు భారత దేశంలో బిజెపి కాస్త బలహీనంగా ఉంది. కర్ణాటకలో కాస్త మెరుగ్గా ఉంది. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్, పిటిఐ ఎడిటర్లతో మాటామంతీ జరుపుతూ బిజెపి ఆదిపత్యం, అజేయ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నప్పటికీ దక్షిణాదిన, తూర్పున బిజెపి బలహీనంగానే ఉందని తెలిపారు. తెలంగాణలో బిజెపి రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఒడిశాలో ప్రథమ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ లో కూడా బిజెపి నెంబర్ వన్ పార్టీ కాగలదని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. తమిళనాడులో బిజెపి వాటా రెండింతలు కాగలదని పేర్కొన్నారు. లోక్ సభ 543 సీట్లలో తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళల వాటా 204 సీట్లుగా ఉంది. ఈ రాష్ట్రాలలో బిజెపి 2014 నుంచి 2019 వరకు 50 సీట్లను కూడా దాటలేదు. 47 నియోజకవర్గాల్లో 29 మాత్రమే గెలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి 370 సీట్లు గెలవాలని లక్ష్యంగా…

Read More

పదేళ్లు కెసిఆర్ తెలంగాణను నాశనం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కెసిఆర్‌కు చర్లపల్లి జైలులో డబు ల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. కూతురు జైలుకు వెళ్లింది, కాలు విరిగిందని ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదని చెబుతూ మాజీ సిఎం కెసిఆర్ భాష సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జనజాతర సభలో రేవంత్ ప్రసంగిస్తూ కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇకపై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోనని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కెసిఆర్‌కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తాను జానారెడ్డిని కాదని, రేవంత్‌రెడ్డినంటూ సిఎం పేర్కొన్నారు. 5 గ్యారెంటీలను రాహుల్ అంకితం చేశారని, జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేయడం సంతోషకరమని చెప్పారు. బిఆర్‌ఎస్‌ను ఓడించినట్లే దేశంలో బిజెపిని ఓడించాలని సిఎం పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదని,…

Read More

ఓవైపు ఎన్నికలు దగ్గరపడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవటం నుంచి మొదలు నేతల వలసలపర్వం ప్రారంభమైంది. పార్టీలోని కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్, బీజేపీలలో చేరిపోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లే పరిస్థితి లేదంటూ వార్తలు వస్తున్నాయి.  దీంతో కేడర్ కూడా నిరాశలో కూరుకుపోతున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ ఇంత దారుణమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేందుకు అసలు కారణాలేంటీ అన్న ఆలోచనలో పరిస్థితి అధిష్ఠానం. అందుకు వాస్తు దోషంగా గుర్తించి టిఆర్ఎస్ భవన్  లో ప్రవేశం, నిష్క్రమణ గేటును మార్చారు. మరోవంక, తెలంగాణ సెంటిమెంట్‌తో ఏర్పాటైన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీ ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లి, ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ, రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వాన్ని రెండు సార్లు ఏర్పాటు చేయటంలోనూ అదే పేరు ఎంతగానో ఉపయోగపడింది. అయితే, టీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు నిర్ణయించుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని…

Read More

పశ్చిమబెంగాల్‌లో పుర్బా మేదిని పూర్ జిల్లా లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక భూపతి నగర్‌లో రెండేళ్ల క్రితం జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులను అదుపు లోకి తీసుకునేందుకు వెళ్లిన ఎన్‌ఐఎ అధికారుల వాహనంపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనం దెబ్బతింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , తొలుత దాడికి పాల్పడింది ఎన్‌ఐఎ అధికారులేనని పేర్కొన్నారు. 2022 డిసెంబర్ 3న ఓ ఇంట్లో పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందారు. మొదట పోలీస్‌లు ఈ కేసును దర్యాప్తు చేశారు. తరువాత ఎన్‌ఐఎకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని ఎన్‌ఐఎ అధికారులు శనివారం ఉదయం అరెస్ట్ చేసి తిరిగి కోల్‌కతాకు వెళ్తుండగా స్థానికులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఎన్‌ఐఎ అధికారుల వాహనంపై రాళ్లు రువ్వారని పోలీస్‌లు తెలిపారు. దీనిపై ఎన్‌ఐఎ అధికారులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఇటీవల రేషన్ స్కామ్…

Read More

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు టీడీపీలో చేరారు. పాలకొల్లు సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఆరు నెలల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదించి పార్టీకి దూరమయ్యారు. అంతటితో ఆగకుండా జగన్ ను నేరుగా టార్గెట్ చేసి నాలుగేళ్లపాటు నరసాపురం నియోజకవర్గంతో పాటు ఏపీకి దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల వేళ బీజేపీ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో ఓ దశలో రాజకీయాలకు గుడ్ బై చెప్పేయాలని భావించిన రఘురామకు చివరి నిమిషంలో ఆయన వైసీపీపై చేసిన పోరాటమే కలిసొచ్చింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు. పాలకొల్లులో చంద్రబాబు నాయుడు జరుపుతున్న ప్రజాగళం యాత్రలో రఘురామరాజు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. చంద్రబాబు బహిరంగ సభలోనే నేరుగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా రఘురామ నాలుగేళ్లుగా చేసిన…

Read More

ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దులో  శుక్రవారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు మావోలు మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో మూడు తుపాకులు సహా ఇతర సామాగ్రిని గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నాయి.  పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అడవుల్లో ఉన్నారన్న పక్కా సమాచారం తెలుసుకుని ప్రత్యేక పోలీసు బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ క్రమంలో అప్రమత్తమైన మావోయిస్టులు పోలీసులపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల ముగ్గురు మావోలు మరణించారు. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రిగుట్టలు- ఛత్తీస్‌గఢ్‌ పూజారి కాంకేర్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని పోలీసులతోపాటు సరిహాద్దు ప్రాంతాల్లోని సిబ్బందిని కూడా అధికారులు అప్రమత్తం చేశారు.  ముగ్గురు మావోలు మృత్యువాత చెందిన నేపథ్యంలో వారు మళ్లీ ఏదైనా ఎటాక్ చేసే…

Read More

“మన రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ హత్యా రాజకీయాలను స్వస్తి పలకాలన్న జగనన్నగారిని, అవినాశ్ రెడ్డి ఓడించాలి” అని పిలుపిస్తూ ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కడప పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్‌ షర్మిల ఏపీ న్యాయయాత్ర పేరిట శుక్రవారం కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం అమగంపల్లెలో బస్సుయాత్ర ప్రారంభించారు. ఏపీ అభివృద్ధి జరగాలంటే, ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఎంపీగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. “ఓవైపు ధర్మం వైపు కోసం పోరాడే నేను నిలబడ్డాను. అటువైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. న్యాయం అన్నది గెలవాలంటే ప్రజలు నిలబడాలి. మన రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. పోలవరం పూర్తి కావాలన్నా, స్టీల్ ప్లాంట్ పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలి.…

Read More

రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఐదు న్యాయ స్తంభాలపై ప్రధానంగా దృష్టిని సారిస్తూ పాంచ్ న్యాయ్(ఐదు న్యాయాలు) పేరిట కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. యువ(యువత), కిసాన్(రైతులు), నారీ(మహిళలు), శ్రామిక్(కార్మికులు), హిస్దేరీ(సమానత్వం) పేరిట పాంచ్ న్యాయ్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. వీటి కింద మొత్తం 25 గ్యారెంటీలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చింది. ఉపాధి, సంపద, సంక్షేమం వంటి మూడు ప్రధాన అంశాలను ఆధారం చేసుకుని మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లు కాగ్రెస్ పార్టీ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ప్రకటించారు. ఉపాధి అంటే ఉద్యోగాల కల్పన..సంపద అంటే ప్రజలకు పంచడానికి ముందు సంపదను సృష్టించడం..సంక్షేమం అంటే పేద బడుగు వర్గాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమని ఆయన తెలిపారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన న్యాయ పత్ర(మేనిఫెసో) విడుదల కార్యక్రమంలో ఖర్గేతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మేనిఫెస్టో రూపకల్పన కమిటీ చైర్మన్ పి…

Read More

యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) విధానం ద్వారా బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేసే సౌకర్యాన్ని త్వరలో తీసుకురానున్నామని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాం త దాస్ ప్రకటించారు. ఆర్‌బిఐ ఎంపిసి (ద్రవ్యపరపతి విధాన కమిటీ) సమీక్ష వివరాలను గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు. యుపిఐ సిస్ట మ్ ద్వారా కూడా బ్యాంకులో డబ్బులు డి పాజిట్ చేయవచ్చని, ఈ సదుపాయంతో ప్రాంతాలకు డబ్బు పంపే సమయం ఆదా అవుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం నగదు తీసుకుని మెషిన్‌లో వేయాలి, మొత్తం ప్రక్రియ పూర్తయితేనే డబ్బు ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ద్వారా నగదు డిపాజిట్ల కు ఆర్‌బిఐ అనుమతినిచ్చిందని శక్తికాంత తెలిపారు. ప్రస్తుతం కార్డు రహి త నగదును ఎటిఎం నుంచి విత్‌డ్రా ప్రస్తుతం చాలా మంది వినియోగదారులు ఏటిఎంలలో డబ్బును డిపాజిట్ చేసేందుకు నగదుతోపాటు డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ నగదు డిపాజిట్ యంత్రాలు బ్యాంకు ఉద్యోగుల…

Read More