Author: Editor's Desk, Tattva News

దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని చెబుతూ భారత్‌ అభివృద్ధి చెందితే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. తనకు అంత శక్తి వస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని.. వికసిత్‌ భారత్‌ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని మోదీ వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందిని.. మాల్కాజ్‌గిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు అబ్‌ కీ బార్‌.. 400 పార్‌ అంటున్నారని.. ఈ సారి పక్కాగా 400 సీట్లు సాధిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడిందన్న మోదీ… తెలంగాణను…

Read More

గవర్నర్‌ పదవికి డా. తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తున్నది.  చెన్నై సెంట్రల్‌ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019, సెప్టెంబర్‌ వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. 2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణకు గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలి మహిళగా నిలిచారు. ఆతర్వాత పుదుచ్చేరి ఇంచార్జ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు.  కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు.  వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ అయిన తమిళిసై…

Read More

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌తో మరోసారి పోటీకి సిద్ధమైన డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌ 5న జరగబోయే ఎన్నికలు అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నాయని అన్నారు. తాను మళ్లీ అధికారంలోకి రాకపోతే దేశంలో ‘రక్తపాతం’ మొదలవుతుందని బెదిరించారు. బైడెన్‌ విధానాలను విమర్శిస్తూ ఒహైయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  అలాగే మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని కూడా ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోనని తెలిపారు. 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని చెప్పారు. పరోక్షంగా బైడెన్‌ వాహన పరిశ్రమ విధానాలను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను గెలవకపోతే.. బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని కూడా చెప్పారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం…

Read More

వంద రోజులలో అమలు చేస్తామన్న గ్యారంటీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ `ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేరుతో వెబ్‌​సైట్ పోస్టర్​‌ను ఆవిష్కరించడం ద్వారా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సరికొత్త ప్రచారంకు శ్రీకారం చుట్టారు. ఇచ్చిన గ్యారంటీల అమలు జరిగే వరకు కాంగ్రెస్‌​ను వెంటాడుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు అమలు చేసే పత్తా లేకుండా పోయిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెబుతూ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ తల్లి బంధీ అయిందని, ఉద్యమాలతో మొదలైన బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని మంట గలిపిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచిందని ధ్వజమెత్తారు. అందుకే భారతీయ జనతా పార్టీ నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని చెప్పారు. మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారని, దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామన్నారని ఆయన…

Read More

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) చాంపియన్‌గా నిలిచింది. టైటిల్‌ ఫైట్‌లో నిలిచిన తొలిసారే టైటిల్‌ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. శ్రేయాంక పాటిల్‌ (4-12), సోఫీ మిలోనెక్స్‌(3-20)..ఢిల్లీ పతనాన్ని శాసించారు. షెఫాలీవర్మ(44), మెగ్‌ ల్యానింగ్‌ (23) ఆకట్టుకోగా, రోడ్రిగ్స్‌(0), కాప్సె (0), కాప్‌ (8), జొనాసెన్‌ (3), రాధాయాదవ్‌ (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో 115-2 స్కోరు చేసింది. ఎలీస్‌ పెర్రీ(35 నాటౌట్‌), డివైన్‌(32) రాణించారు. శిఖాపాండే, మణి ఒక్కో వికెట్‌ తీశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా మిలోనెక్స్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా దీప్తిశర్మ నిలిచారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ తమదైన రీతిలో దూకుడైన ఆటతీరు కొనసాగించింది. ఓపెనర్లు…

Read More

వైఎస్‌ఆర్ సిపి పాలన లోని ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ లీటర్ రూ. 109.87 వంతున ధర పలుకుతోంది. తరువాత స్థానంలో కేరళ ఉంది. లెఫ్ట్‌డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) పాలన లోని కేరళలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.107.54 వరకు ఉంటోంది. కాంగ్రెస్ పాలిత తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ. 107.39 వరకు ధర పలుకుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ విషయంలో దూరంగా లేవు. భోపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.106.45, పాట్నాలో (బీజేపీజెడీయు సంకీర్ణ ప్రభుత్వం) రూ.105.16, జైపూర్‌లో రూ.104.86, ముంబైలో రూ.104.19 వరకు పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పాలిత పశ్చిమబెంగాల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 103.93, ఒడిశా (భువనేశ్వర్)లో 101.04, తమిళనాడు(చెన్నై)లో రూ.100.73, ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్)లో రూ.100. 37 వరకు పెట్రోల్ ధరలు పలుకుతున్నాయని డేటా వివరించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో రూ. 82, సిల్వస్సా, డామన్‌లో రూ. 92.3892.49 వరకు పెట్రోల్ లీటరు…

Read More

ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం కాంగ్రెస్ పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో మోదీ పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీపై విమర్శలు చేశారు.  ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ రెండు సంకల్పాలు తీసుకోవాలన్న మోదీ కేంద్రంలో ఎన్డీయే సర్కారును ఏర్పాటు చేయటం, రెండోది ఏపీలోని అవినీతి ప్రభుత్వం గద్దెదించడం అని పేర్కొన్నారు. ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుబడిందన్న మోదీ ఏపీ అభివృద్ధి కావాలని అనుకుంటే ఎన్డీయే కూటమికి ఓటేయాలని కోరారు. పదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లతో కలిసి రాజకీయ వేదికను పంచుకొన్న ప్రధాని శనివారం ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత ప్రసంగించిన మొదటి…

Read More

అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్, బిజెపిలలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వీరిద్దరూ కాంగ్రెస్ అభ్యర్థులుగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో రంజిత్ రెడ్డి, దానం ఆ పార్టీలో చేరారు. చేవెళ్ల నుండి కాసాని జ్ఞానేశ్వర్ ను అభ్యర్థిగా బిఆర్ఎస్ ప్రకటించడంతో, తనకు మరోసారి పోటీచేసే అవకాశం ఇవ్వలేదనే అసంతృప్తితో రంజిత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుండి పోటీ చేయాలి అనుకొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేసినా, ప్రకటించకుండా పెండింగ్…

Read More

‘అధికారం అందించిన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తున్నా, 140 కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం.. మరోమారు అధికారం అందిస్తే రాత్రింబవళ్లు ఒక్కటి చేసి దేశం కోసం పనిచేస్తా’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేం ద్రంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన పార్టీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ మార్పునకు గ్యారెంటీ మోదీ అని, రెండు పర్యాయాలు పూర్తి మెజార్టీ ఇచ్చినందుకే దేశంలో అనేక మార్పులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. నేడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని, దీనంతటికీ కారణం ప్రజలు తనకు అఖండ మెజార్టీ ఇవ్వడం వల్లే సాధ్యమైందని ప్రధాని స్పష్టం చేశారు. మోదీ నోట వచ్చిందంటే అది అయ్యే తీరుతుందని చెబుతూ అది 370 ఆర్టికల్ అయినా, అయోధ్యలో రాంలాల ను తిరిగి ప్రతిష్ఠించుకోవడం వరకు అందరూ చూశారని గుర్తు చేశారు. దీంతో పాటు అనేక…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మరోవైపు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఆమెకు శనివారం రిమాండ్ విధించింది. కస్టడీని కూడా ఈడీ అనుమతించింది. ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను పొందుపరిచారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి, ప్రధాన సూత్రధారి అని చెబుతున్నారు.  మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. పీఆర్వో రాజేష్‌తో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే వీరి ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అనిల్ వ్యాపార లావాదేవీలపై కూడా ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ తెలిపింది. ఈ కేసులో మిగతా నిందితులు ఎవరనేది త్వరలోనే తెలియనుంది. కాగా, ఢిల్లీ మద్యం…

Read More