అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీని రైతు భరోసా పేరుతో విడుదల చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని రైతులకు భరోసా లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను అదోగతి పాలు చేసి, రైతుల జీవితాలను దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నేను రైతు బిడ్డను, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని సిఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో రైతులు పంటలకు నీళ్లు లేక, పొట్టదశకు వచ్చిన పంటల గింజలు తాలు అయ్యే పరిస్థితి వచ్చిందని, కొన్ని ప్రాంతాల్లో పొట్టకు రాకముందే పొలాలు ఎండిపోయి పశువులు మేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 50లక్షల ఎకరాల్లో వరి సాగైందని సగం పంటలకు నీటి సరఫరా కావడంలేదని చెబుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే…
Author: Editor's Desk, Tattva News
కేంద్రంలో బిజెపినే మరలా అధికారంలోకి వస్తుందనే అంచనాతో తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం సీట్ల కేటాయింపులో తాము రాజీపడ్డామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యమని, వైసిపి విముక్త రాష్ట్రం కోసం జనసేన, బిజెపితో కలిశామని తెలిపారు. ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం రిజిస్ట్రేషన్ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ప్రారంభించిన సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా కోసం 2018లో ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చానని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా హోదా కావాలని, విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించొద్దని అడుగుతున్నామని వెల్లడించారు. తాను ఎన్‌డిఎలో కొనసాగి ఉంటే రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన హయాంలో పోలవరం నిర్మాణం 72 శాతం పూర్తయిందని గుర్తు చేశారు.…
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారం విడుదల చేసింది. ఈ 72 మందిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించగా, ఇప్పటి వరకు మొత్తం 15 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక, ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థులు విషయానికొస్తే ఆదిలాబాద్ నుంచి గోడెం నగేశ్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి శానంపూడి సైది రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణను అభ్యర్థులుగా ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. కాగా, సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో…
రామజన్మభూమిలో భవ్యమైన మందిరంలో జనవరి 22న ప్రాణప్రతిష్ట జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున అయోధ్యకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం దర్శన సమయాన్ని కూడా పొడిగించింది శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకూ దర్శనాలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. రాత్రి 10 గంటలకు శయన హారతితో దర్శనాలు ముగుస్తాయని పేర్కొంది. అంతేకాదు, రోజుకు సగటున లక్ష నుంచి 1.5 లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ‘‘శ్రీ రామ జన్మభూమి మందిరంలో దర్శనం తర్వాత ప్రవేశం నుంచి నిష్క్రమణ వరకు మొత్తం ప్రక్రియ చాలా సులభం.. సౌకర్యవంతంగా ఉంటుంది. సాధారణంగా 60 నుంచి 75 నిమిషాల్లోపు దర్శనం పూర్తవుతుంది.. భక్తులు తమ సౌకర్యార్థం, సమయాన్ని ఆదా చేసుకునేందుకు తమ మొబైల్ ఫోన్లు, పాదరక్షలు, పర్సులు మొదలైన…
లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. ఆమె సోదరుడు బాబున్ బెనర్జీ బీజేపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన కుటుంబంతో బాబున్ బెనర్జీకి ఎలాంటి సంబంధాలు లేవని, ఆయనతో బంధం తెంచుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే కుటుంబ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని దీదీ తేల్చి చెప్పారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తృణముల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే 42 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్‌ను మమతా బెనర్జీ విడుదల చేశారు. అయితే టీఎంసీ విడుదల చేసిన జాబితాపై బాబున్ బెనర్జీ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే దీదీ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల టీఎంసీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై బాబున్ బెనర్జీ…
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఎన్నికల కమిషన్‌కు మంగళవారం పంపింది. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఇసిఐ ధ్రువీకరించింది. ‘ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఫిబ్రవరి 15, మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం… ఎస్‌బిఐ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ సమాచారం మంగళవారం అందింది’ అని ఇసిఐ వెల్లడించింది. మార్చి 12వ తేదీ వ్యాపార వేళలు ముగిసేలోగా ఎన్నికల బాండ్ల వివరాలను ఇసికి పంపాలంటూ సుప్రీం కోర్టు ఎస్‌బిఐని ఆదేశించింది. ఈ వివరాలన్నింటినీ మార్చి 15వ తేదీ సాయంత్రం 5గంటల కల్లా ఎన్నికల కమిషన్ తన అధికార వెబ్‌సైట్‌లో ప్రచురించాల్సి వుంది. 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుండి 30 విడతల్లో రూ.16,518 కోట్ల విలువ చేసే బాండ్లను ఎస్‌బిఐ జారీ చేసింది. అజ్ఞాతంగా రాజకీయ నిధులను సమకూర్చుకోవడానికి అనుమతిస్తున్న ఈ ఎన్నికల బాండ్ల పథకం…
అనూహ్య పరిణామాల మధ్య హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ మంగళవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన మంత్రివర్గ సహచరులు తమ పదవులకు మంగళవారం ఉదయం రానీజామా చేయగా కొద్ది గంటలకే కొత్త ముఖ్యమంత్రిగా సైనీని బిజెపి అధిష్టాన వర్గం ఎంపిక చేసింది. ముఖ్యమంతిరగా సైనీతోపాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో బిజెపి నాయకులు కన్వర్ పాల్, మూల్ చంద్ శర్మ, జై ప్రకాశ్ దళాల్, బన్వరీలాల్, స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ ఇసంగ్ చౌతాలా ఉన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రిగా సైనీతో ప్రయాణం చేయించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్‌కు ప్రణామం చేసిన సైనీ ఆయన ఆశీస్సులు కోరారు. అంతకుముందు ఓబిసి నాయకుడైన సైనీని(54) హర్యానా నూతన ముఖ్యమంత్రిగా బిజెపి నాయకత్వం ప్రకటించింది. బిజెపి రాష్ట్ర…
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. సెకండ్ లిస్టులో 43 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. తొలి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులనే ప్రకటించింది. ఈసారి మాత్రం రెండు రాష్ట్రాల ప్రస్తావన లేదు. ఇక మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌కు కంచుకోట అయిన చింద్వారా నుంచి ఆయన కుమారుడు నకుల్‌నాథ్ పేరును ప్రకటించారు. మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించి 43 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అభ్యర్థులను వెల్లడించింది. తొలి జాబితాలో 39 మందిని ప్రకటించగా, రెండో జాబితాలో మాత్రం 43 మందిని ప్రకటించింది. 43 మందిలో జనరల్ కేటగిరీకి చెందినవారు 10 మంది కాగా.. 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, ఒకరు ముస్లిం మైనారిటీకి చెందినవారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.. రాజస్ఠాన్…
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో ఖర్గే పోటీ చేయకుండా ఆ పార్టీని ముందుండి నడిపించాలని, ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ బిజెపితో తలపడేలా పార్టీని అన్నివిధాలా సన్నద్ధం చేసి ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించేందుకు ఖర్గే కృషి చేయాలని సీనియర్ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతల అభిప్రాయం మేరకు ఆయన లోక్‌సభ ఎలక్షన్స్‌లో పోటీకి దిగడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా కర్ణాటక గుల్బార్గా నియోజకవరగం నుంచి ఖర్గే పోటీ చేయాలని ఆ పార్టీ వర్గాలు భావించాయి. ఆయన పేరును కర్ణాటక సీనియర్ నేతలంతా గతవారం ఏకగ్రీవంగా ఆమోదించారు. కానీ ఖర్గే మాత్రం ఆయన అల్లుడు రాధాకృష్ణను ఆ స్థానం నుంచి నిలబెట్టే అవకాశం ఉంది. ఆయన పేరును నామినేట్ చేసే అవకాశమున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. కాగా,…
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసకునేందుకు కల్పించిన గడువును మరోసారి పొడిగించింది. ప్రస్తుత గడువు మార్చి 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు గడువును పెంచిన విషయం తెలిసిందే. తొలుత 2023 మార్చి15గా ఉన్న గడువును డిసెంబర్ 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్ అప్‌డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు…