రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కోదండరాం, అమీ ర్ అలీఖాన్‌ల నియామకాలపై ప్రభుత్వం ఇ చ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని న్యాయస్థానం సూచించింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం తెలిపింది. ఎంఎల్‌సిల నియామకంపై ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నేరుగా తిరస్కరించకుండా తిరిగి పంపించాల్సిందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎంఎల్‌సిలుగా నియమించడంపై బిఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటా ఎంఎల్‌సిలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్ తమిళిసై సౌం దర రాజన్ అంగీకరించారు. వీరిద్దరి పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. అయితే అంతకుముందు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2023…
Author: Editor's Desk, Tattva News
ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో దాదాపు 98 మిలియన్ల మందికి టైప్-2 డయాబెటిస్ ఉండవచ్చు. డయాబెటిస్ నిర్వహణను మెరుగు పరచడంలో సహాయపడే మూడు ఆహారాలు గురించి ఈ సందర్భంగా నిపుణులు సూచిస్తున్నారు. బాదం, ఆకుకూరలు, పెరుగు తీసుకోవాలని చెబుతున్నారు. ఒక గుప్పెడు బాదంపప్పులను తీసుకోవడం వల్ల ప్రమాదకరంగా లేని టైప్-2 మధుమేహం ఉన్న వ్యక్తులకు స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర నియంత్రణకు ప్రయోజనం చేకూరుతుంది. భోజనంలో బాదంపప్పును చేర్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అలాగే మనలో చాలా మంది మన ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం ప్రాముఖ్యతను గుర్తించినప్పటికీ, ఆకు కూరలను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒకరి ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చగలిగే ఆకు కూరలలో బచ్చలికూర, క్యాబేజీ, మునగ ఆకులు,…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరే శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. డియర్‌నెస్ అలెవ్సన్, డియర్‌నెస్ రిలీఫ్ 4 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర కేబినేట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులుక డీఏ 4 శాతం పెంచుతూ 50 శాతానికి చేర్చినట్లు వెల్లడించారు. పెంచిన డీఈ 4 శాతం జనవరి1 , 2024 నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. వచ్చే నెల శాలరీలో ఎరియర్స్ కలిపి చెల్లించనుంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. వచ్చే నెల నుంచి జీతాలు, పెన్షన్ భారీగా పెరగనున్నాయి. మరోవైపు.. డీఏ పెంపుతో పాటు గ్యాట్యూటీ, ఇతర అలెవన్సులు సైతం పెంచుతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై కేంద్ర మంత్రి…
సందేశ్‌ఖాలీ కేసులో నిందితుడు, టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ ను ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు సీబీఐకి బుధవారం సాయంత్రం అప్పగించారు. దీంతో బెంగాల్ ప్రభుత్వానికి, సీబీఐకి మధ్య రెండు రోజులుగా తలెత్తిన ప్రతిష్టంభనకు తెరపడింది. బుధవారం సాయంత్రం 4.30 గంటల్లోగా సీబీఐకి షాజహాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించాలంటూ కల్‌కతా హైకోర్టు బెంగాల్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో తాజా పరిణామం చోటుచేసుకుంది. సందేశ్‌ఖాలీలొ భూ ఆక్రమణలు, మహిళలపై అత్యాచారాలు, ఈడీ అధికారులపై దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు మంగళవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా… తక్షణమే విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. దీంతో కేసు బాధ్యతలు చేపట్టిన సీబీఐ మంగళవారం సాయంత్రమే కేసు నమోదు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. కానీ, షేక్ షాజహాన్‌ను అప్పగించేందుకు…
ఉద్యోగ వంచనకు గురై రష్యన్ సైన్యంలో చేరవలసి వచ్చిన 30 ఏళ్ల హైదరాబాదీ ఉక్రెయిన్‌తో రష్యా ప్రస్తుతం సాగిస్తున్న పోరులో హతుడయ్యాడు. ఆ యువకుని మహమ్మద్ అస్ఫాన్‌గా గుర్తించారు. అతనిని రష్యా నుంచి తిరిగి తీసుకురావడంలో సాయం చేయవలసిందిగా ఎఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీని కోరారు. అయితే, మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని ఒవైసీ సంప్రదించినప్పుడు అస్ఫాన్ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆ యువకునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతరులు పలువురితో పాటు అస్ఫాన్‌ను మోసపూరిత ఏజెంట్లు తప్పుదోవ పట్టించి, యుద్ధంలో రష్యా సైన్యానికి సాయంగా ‘హెల్పర్లు’గా రిక్రూట్ చేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో ప్రస్తుతం సాగుతున్న పోరులో రష్యన్ సైన్యంలో ‘హెల్పర్’గా పని చేస్తున్న గుజరాత్‌కు చెందిన 23 ఏళ్ల వ్యక్తి రష్యాలో మరణించిన కొన్ని వారాల తరువాత తాజా మృతి వార్త వచ్చింది. సూరత్‌కు చెందిన హామిల్ మంగుకియాగా గుర్తించిన ఆ వ్యక్తి ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్…
లోక్‌సభ ఎన్నికల వేళ నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిశాలో బిజూ జనతాదళ్ తో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? ఇరుపార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయా? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు ఉండగా, 2019 ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, ఒక సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈసారి కూడా బీజేడీ, బీజేపీ మధ్య నువ్వా-నేనా అనే రీతిలో పోటీ ఉంటుందని, బీజేడీ 11, బేజీపీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు ఒడిశాలో పర్యటన సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను బలంగా చెప్పారు. వికసిత్ భారత్, ఆత్మ నిర్బర్ భారత్‌కు గేట్‌వేగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఒడిశాలో గత పదేళ్లుగా కేంద్ర భారీగా పెట్టుబడులు పెడుతోందని చెబుతూ రాష్ట్రంలోని ఒక్క పెట్రో కెమికల్…
సాంకేతికతను వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 370 స్థానాలను గెలుచుకోవాలనే తపనతో ఉన్న బీజేపీ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ సాధారణంగా ప్రభావం చూపించిన రాష్ట్రాల్లో ఈ సారి ఎలాగైనా పట్టు సాధించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ఎక్కడ ప్రసంగించినా కొన్ని రాష్ట్రాల మాతృ భాషలోకి ఆయన ప్రసంగాన్ని అనువాదించడానికి బీజేపీ ఏర్పాట్లు చేసింది. మోదీ ప్రసంగాలను కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఒడియా, పంజాబీ, మరాఠీ భాషల్లోకి అనువదించడం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని 129 లోక్‌సభ స్థానాల్లో (పుదుచ్చేరితో కలిపి 130) బీజేపీ కేవలం 29 మాత్రమే గెలుచుకుంది. వీటిలో ఎక్కువ కర్ణాటక నుంచి వచ్చాయి. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో…
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ప్రసంగాన్ని అడ్డుకున్నారన్న కారణంపై ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల నుంచి నిరవధికంగా ఏడుగురు బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. సస్పెన్షన్‌కు గురైన ఏడుగురు బిజెపి ఎమ్మెల్యేలు మోహన్ సింగ్ బిష్త్, అజయ్ మహావర్, ఓపి శర్మ, అభయ్ వర్మ, అనిల్ బాజ్‌పాయి, జితేంద్ర మహాజన్, విజేందర్ గుప్తా తమ సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ రిట్ పిటిషన్లను అనుమతిస్తున్నట్లు జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తెలిపారు. సభా హక్కుల కమిటీ ఎదుట జరుగుతున్న విచారణ పూర్తయ్యేవరకు తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని బిజెపి ఎమ్మెల్యేలు సవాలు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని వారు వాదించారు. కాగా..ఎమ్మెల్యేల సస్పెన్షన్ సభలో అసమ్మతిని అణచివేత ప్రయత్నంగా భావించరాదని, ఇది ప్రతిపక్ష సభ్యుల దుష్ప్రవర్తన కట్టడికి తీసుకున్న స్వీయ క్రమశిక్షణా…
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు అమర్చినట్లు అనుమానిస్తున్న నిందితుడి ఆచూకీ తెలియచేసిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) బుధవారం ప్రకటించింది. తలపై క్యాప్, ముఖానికి మాస్కు, కూలింగ్ గ్లాసెస్ ధరించి కేఫ్‌లోకి ప్రవేశిస్తున్న అనుమానితుడి ఫోటోను తన అధికారిక ఎక్స్(ఇదివరకటి ట్విట్టర్) హ్యాండిల్‌లో ఎన్‌ఐఎ పోస్టు చేసింద ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అందచేయడానికి ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ అడ్రస్‌లను ఎన్‌ఐఎ షేర్ చేసింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎన్‌ఐఎ హామీ ఇచ్చింది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును ఈ వారం మొదట్లో ఎన్‌ఐఎకు అప్పగించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగాల్‌లోని కోల్‌కతాలో నిర్మించిన దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రో టన్నెల్‌ను బుధవారం ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. విద్యార్థులు, మెట్రో సిబ్బందితో ప్రధాని మోదీ కాసేపు సంభాషించారు. ప్రధాని మోదీతో మెట్రోలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రయాణించారు. బంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మెట్రో టెన్నెల్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆగ్రా మెట్రో, మీరట్ మెట్రో, పుణే మెట్రో సహా దేశవ్యాప్తంగా పలు మెట్రో సేవలను ప్రధాని మోడీ కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఇదే వేదికపై కోల్‌కతాలో దాదాపు రూ. 15,400 కోట్ల విలువైన బహుళ కనెక్టవిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్‌కతా నగరంలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు ప్రారంభంతో…