దేశంలో 2029 నుంచి లోక్‌సభతోపాటే అన్ని రాష్ర్టాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సిఫారసు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ మేరకు రాజ్యాంగంలో ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే కొత్త అధ్యాయాన్ని చేర్చేందుకు ప్రతిపాదనలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. 2029లో మే, జూన్ మధ్య కాలంలో ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయని సంబంధిత వర్గా లు బుధవారం తెలిపాయి. లా కమిషన్‌తో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా రాజ్యాంగాన్ని, ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను మార్చటం ద్వారా జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చో అనే దానిపై నివేదికను రూపొందిస్తున్నది. ఈ ఏడాది మేలో లోక్‌సభతో పాటు ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు…
Author: Editor's Desk, Tattva News
రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్‌ను సంక్షోభంలోకి నెట్టాయి. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మెజార్టీ కోల్పోయిందని, విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుత సర్కార్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం పంపిన పరిశీలకులతో చర్చల అనంతరం తన రాజీనామాను విక్రమాదిత్య వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ సర్కార్ బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.‘జై శ్రీరామ్..బన్‌గయా కామ్..’అంటూ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు సభలో అడుగుపెట్టారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఈ 9మంది ఎమ్మెల్యేలు హర్యానాలోని పంచకులకు వెళ్లిపోయారు. అక్కడ వారికి బీజేపీ సర్కార్ కట్టుదిట్టమైన భద్రత కల్పించటం గమనార్హం. బుధవారం బడ్జెట్ సమావేశాల్లో…
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న పరిస్థితులు త్వరలో తెలంగాణలో కనిపించవచ్చని రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ జోస్యం చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉందని, అధికార కాంగ్రెస్‌పై సొంత ఎమ్మెల్యేలు తిరగబడ్డారని, అసహనంతోనే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపికి ఓటేశారని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలోనూ రావచ్చని, రాష్ట్రంలో తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ కనిపిస్తుందని, చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డి పరిస్థితి దారుణంగా మారుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్నికల బరిలో గెలిచే గుర్రాలనే బరిలోకి దింపుతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వాళ్లు తమ భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. దురుసు మాటలు ఆపి హామీల సంగతి ఆలోచించాలని సూచించారు.…
తమిళనాడులోని కులశేఖరపట్నంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన రెండు ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశంసిస్తూ తమిళనాడుకు చెందిన డిఎంకె మంత్రి ఒకరు వార్తాపత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటన(యాడ్) ప్రకంపనలు సృష్టించింది. ఆ ప్రకటనలో చైనా పతాకాన్ని రాకెట్‌పై ప్రముఖంగా ముద్రించడంతో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. తమిళనాడు పశు సంవర్థక శాఖ మంతిర అనితా రాధాకృష్ణన్ తన వ్యక్తిగత హోదాలో ఈ ప్రకటన ఇచ్చారు. ఈ వివాదాస్పద ప్రకటనపై మంత్రి స్పందించనప్పటికీ ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్ నిర్మాణం కానున్న తూత్తుకుడి నియోజకవర్గం ఎంపి కనిమోళి మాత్రం తన పార్టీని సమర్థించారు. జరిగిన తప్పును ఆమె అంగీకరించినప్పటికీ ఆ ప్రకటన తయారుచేసిన డిజైనర్ చేసిన పొరపాటని ఆమె చెప్పారు. తమ పార్టీపైన ఇంత తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయవలసిన అవసరం లేదని ఆమె తెలిపారు. ఆ ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఫోటోలు…
కేంద్ర మంత్రి, అమేథి ఎంపి స్మృతి ఇరానీ బుధవారం నెహ్రూ, గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. వారు 50 ఏళ్లకు పైగా అమేథిని అభివృద్ధి చేయలేదని, స్థానిక ప్రజలు నిరుపేదలుగా, నిస్సహాయులుగా ఉండిపోయి, చేతులు జోడించి తమను వేడుకోవాలన్నది వారి ధ్యేయమని స్మృతి ఇరానీ ఆరోపించారు. అమేథి సమీపంలోని పాండేగంజ్ గ్రామంలో ఒక కార్యక్రమంలో స్మృతి ఇరానీ ప్రసంగిస్తూ, ‘ఎంపిని కలుసుకోవడానికి ఇక్కడి ప్రజలు ఢిల్లీకి వెళుతుండే రోజులను కూడా అమేథి చూసింది. ఆ సమయంలో ఎంపిలు విదేశాలకు వెళ్లడమో లేక వారి భద్రత సిబ్బంది ప్రజలను లోనికి అనుమతించకపోడమో జరిగేది’ అని చెప్పారు. ‘స్థానిక ప్రజలు నిరుపేదలుగా, నిస్సహాయులుగా ఉండిపోయి, చేతులు జోడించి తమను వేడుకొనేలా చేయడానికే నామ్‌దార్‌లు (గాంధీ కుటుంబం) 50 ఏళ్ల పాటు అమేథిని అభివృద్ధి చేయలేదు’ అనిఆమె ఆక్షేపించారు. ‘వారి ఆలోచన ధోరణి కారణంగా అమేథిలోని లక్షా ఎనిమిది వేల కుటుంబాలకు ఇళ్లు లేవు.…
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫిబ్రవరి 29న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అఖిలేష్ యాదవ్‌ను ఈ కేసులో సాక్షిగా సీబీఐ గురువారం ప్రశ్నించనున్నది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలైన షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్‌పూర్, హమీర్‌పూర్, సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012-2016 మధ్య ప్రభుత్వ అధికారులు నియమాలు, నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ సైట్‌లను కొందరికి అక్రమంగా కేటాయించినట్లు సీబీఐ ఆరోపించింది. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. 2012- 2013 జూన్ మధ్య మైనింగ్ శాఖ నిర్వహించిన అఖిలేష్ యాదవ్‌ను సాక్షిగా విచారణకు రావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది. కాగా, ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి ప్రయత్నాలు…
మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ వోటింగ్ ప్రధాన పార్టీల అంచనాలను తలకిందులు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో 10, కర్ణాటకలో 4, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం పోలింగ్ నిర్వహించారు. కర్ణాటకలో బీజేపీ-జేడీఎ్‌సకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఓడిపోయారు. హిమాచల్‌లో అధికార కాంగ్రె్‌సకు చుక్కెదురైంది. క్రాస్ ఓటింగ్‌తో ఆ పార్టీ ప్రముఖ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ ఓటమి చవిచూశారు. ఉత్తరప్రదేశ్‌లోనూ పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఎస్పీ ఎమ్మెల్యేల కారస్ ఓటింగ్‌తో బీజేపీ అదనంగా మరో స్థానం గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్.మురుగన్ సహా 41 మంది అభ్యర్థులు ఈ నెల 20న వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మిగిలిన స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరిగింది. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ మూడు స్థానాలను…
భారత్ తొలి మానవ సహిత రోదసి యాత్ర ‘గగన్‌యాన్’ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడ్ మంగళవారం ప్రకటించారు. నలుగురు వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా అని ప్రధాని తిరువనంతపురం సమీపంలోని తుంబాలో విక్రమ్ సారాభాయ్ రోదసి కేంద్రం (విఎస్‌ఎస్‌సి)లో వెల్లడించారు. ప్రధాని మోదీ వారికి ‘వ్యోమగామి వింగ్స్’ అందజేస్తూ, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను పరిపూర్తి చేసే నాలుగు శక్తులు అని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల అనంతరం ఒక భారతీయుడు రోదసిలోకి ప్రవేశించబోతున్నట్లు ప్రధాని చెప్పారు. ‘ఈ పర్యాయం కౌంట్‌డౌన్, సమయం, చివరకు రాకెట్ కూడా మనదే’ అని ప్రధాని తెలిపారు. గగన్‌యాన్ మానవ సహిత రోదసి యాత్రలో ఉపయోగిస్తున్న విడి భాగాలలో చాలా వరకు భారత్‌లో తయారైనందుకు తాను గర్విస్తున్నానని, ఆనందిస్తున్నానని ప్రధాని తెలియజేశారు. భారత…
గత నాలుగు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పన ఎట్టకేలకు పూర్తయిందని, వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా సీఏఏను కేంద్రం అమలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. పౌరసత్వ నమోదు కోసం ఆన్‌లైన్ పోర్టల్ కూడా సిద్ధమైందని, కేంద్ర హోంశాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ట్రయల్ రన్స్ నిర్వహించిందని తెలిపాయి. దీర్ఘకాలిక వీసా కోసం హోంశాఖ వద్దకు వచ్చిన దరఖాస్తులకు అధిక శాతం పాకిస్థానీయుల నుంచే వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాంగ్‌టర్మ్ వీసాలను మంజూరు చేసే అధికారాన్ని కేంద్రం ఇప్పటికే తొమ్మిది రాష్ర్టాల్లోని 30 జిల్లాల మేజిస్ట్రేట్‌లకు అప్పగించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019, డిసెంబర్‌లో కేంద్రం తీసుకొచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్…
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లు ఉండగా అందులో 78 స్థానాలను బీజేపీ గెలుచుకోనుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్, సమాజ్‌వాదీ ప్రధాన పార్టీలుగా ఉన్న ఇండియా కూటమికి కేవలం 2 సీట్లకే పరిమితం కానుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చూస్తే పూర్వాంచల్‌లో 29 సీట్లు ఉండగా బీజేపీ 28, ఎస్పీ-1 సీటు గెలుస్తుందని పేర్కొంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే, కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్న ఇండియా కూటమి, ఇతర పార్టీలు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిసారించాయి. ముఖ్యంగా దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై అన్ని పార్టీలు శ్రద్ధ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ వెలువడింది. ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలవనుందనే అంచనాలను వెలువరించింది. యూపీ వ్యాప్తంగా కేంద్రంలోని అధికార…