Author: Editor's Desk, Tattva News

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్‌ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారన్న సర్వోన్నత న్యాయస్థానం ఆప్‌ కౌన్సిలర్‌ కుల్దీప్‌ కుమార్‌ను చండీగఢ్‌ మేయర్‌గా ప్రకటించింది. మేయర్ఎ న్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ డీవీ చంద్రచూడ్‌ నేతృత్వంలోని జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారిపై తీవ్రంగా విరుచుకుపడింది. ఉద్దేశపూర్వకంగానే అనిల్ మసీహ్‌ 8 బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది. అంతకముందు మేయర్‌ ఎన్నికల ఓట్లను రీకౌంటింగ్‌ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రిటర్నింగ్‌ అధికారి చెల్లని ఓట్లుగా ప్రకటించి పక్కకు పెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎనిమిది బ్యాలెట్‌ పేపర్లను కూడా లెక్కించాలని ఆదేశించింది. ఈ మేరకు చెల్లుబాటు కాని ఎనిమిది బ్యాలెట్‌ పత్రాలను సుప్రీంకోర్టు…

Read More

* పీపుల్స్‌ పల్స్‌ -సౌత్‌ ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ సర్వే సౌత్‌ ఫస్ట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ రీసర్చ్‌ సంస్థ ట్రాకర్‌ పోల్‌ సర్వే నిర్వహించింది పీపుల్స్‌ పల్స్‌ -సౌత్‌ ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం తెలంగాణలోని మొత్తం 17 లోక్‌ సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సగానికి పైగా స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తిని ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్‌ఎస్‌ లోక్‌ సభ ఎన్నికల్లో కూడా రెండో స్థానానికే పరిమితం కానుంది.  బీజేపీ అయోధ్య రామమందిరంపై, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పైనే ఆశలు పెట్టుకుంది. అయితే, రామమందిరం ప్రభావం తెలంగాణలో బీజేపీ ఉహిస్తున్నంతగా లేదు! ఫలితంగా ఆ పార్టీకి 2019లో వచ్చిన నాలుగు సీట్ల కంటే మెరుగైన ఫలితాలు రావడం కష్టతరంగా మారింది. పీపుల్స్‌ పల్స్‌ -సౌత్‌ ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్‌ 8-10…

Read More

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ దాదాపు కసరత్తు పూర్తిచేసినట్టు సమాచారం. దేశంలోని సార్వత్రిక, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. ఏర్పాట్లను సమీక్షిస్తోన్న విషయం తెలిసిందే. వివిధ రాజకీయ పక్షాలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఈసీ అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూ కశ్మీర్‌‌లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇందుకోసం మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కశ్మీర్‌లో భద్రతా…

Read More

మూసీ నది ప్రక్షాళనను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని, నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక చేయాలని సిఎం సూచించారు.  అధికారులు పని విభజన చేసుకొని మూసీ పరీవాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూసీలో మురుగు నీటిని ముం దుగా శుద్ధి చేయాలని సిఎం సూచించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్‌రామ్ గూడ హెచ్‌ఎండిఏ కార్యాలయంలో అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.  మూసీ సరిహద్దులు, ఇతర వివరాలతో కూడిన పటాలను అధికారులు సిఎంకు వివరించా రు. ఈ సమీక్షలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు దానకిశోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. నగరం మధ్యలోంచి వెళ్లే మూసీ నది సుందరీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే కన్సల్టెంట్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను సైతం ఆహ్వానించింది. …

Read More

సందేశ్‌ఖాలీ కేసు.. పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్నది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ రేఖాశర్మ డిమాండ్‌ చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలి గ్రామంలో ఎన్‌సీడబ్ల్యూ చీఫ్‌ రేఖాశర్మ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పర్యటించింది.  సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘బాధిత మహిళలతో మాట్లాడిన తర్వాత, అక్కడ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నది స్పష్టమైంది. అత్యంత భయానక అనుభవాలున్నాయని అనేకమంది మహిళలు చెబుతున్నారు. పార్టీ కార్యాలయంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి. బెంగాల్‌లో రాష్ట్రపతి విధించాలి’ అని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని, టిఎంసి నాయకుడైన కీలక బాధితుడిని అరెస్ట్ చేయనే లేదని, మహిళలు జరిగిన అన్యాయాల గురించి చెప్పేందుకు భయపడే పరిస్థితి నెలకొందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాను…

Read More

ఆదివారం రాత్రి పొద్దుపోయేంతవరకు రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు సంవత్సరాలకు, ఐదు పంటలకు మాత్రమే ఉద్ధేశించిన కాంట్రాక్టు ఎంఎస్‌పి ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌ మోర్ఛా *ఎస్‌కెఎం) తిరస్కరించింది. అన్ని పంటలకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర ప్రకటించాలన్న రైతాంగ డిమాండ్‌ను పక్కదోవ పట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిందని విమర్శించింది.  కేంద్రం ప్రతిపాదనలు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు, బుధవారం నుంచి తమ ఆందోళనలు మళ్లీ ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో మోదీ  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా  బుధవారం దేశవ్యాప్తంగా బిజెపి, ఎన్‌డిఎ ఎంపిల నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్ఛా పిలుపునిచ్చింది.  శాంతియుతంగా బహిరంగ సభలు, కాగాడాల ప్రదర్శనలతోపాటు ఇతర నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించాలని సూచించింది నాలుగో విడతగా ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఏమాత్రం…

Read More

అయోధ్యలో రామ మందిరం విగ్రహం ప్రాణప్రతిష్ఠ రోజు జనవరి 22 నుంచి కొత్త కాల చక్రం మొదలైందని తాను చెప్పినట్లు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. ‘శ్రీరాముడు పాలించినప్పుడు ఆయన ప్రభావం వేలాది సంవత్సరాలు కొనసాగింది. అదే విధంగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠతో భారత్‌కు రానున్న వెయ్యి సంవత్సరాలకు కొత్త ప్రస్థానం మొదలైంది’ అని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ సంభాల్‌లో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రఢాని మోదీ ప్రసంగిస్తూ, భారతదేశానికి కాల చక్రం మారిందని, దేశం ఎన్నో రికార్డులు నెలకొల్పుతున్నదని, ప్రపంచానికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాధువులు, మత పీఠాల అధిపతుల ఆశీస్సులను ప్రధాని కోరుతూ, “రాష్ట్రీయ రూపీ మందిర్’ (భారత్ అనే ఆలయం) పునర్నిర్మించే కర్తవ్యాన్ని భగవంతులు నాకు ఇచ్చాడు” అని తెలిపారు. ఒక వైపు యాత్రా స్థలాల అభివృద్ధి జరుగుతుండగా, మరొక వైపు నగరాలు హైటెక్…

Read More

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లోదరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది.  2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. పేపర్‌ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్‌ను రద్దయ్యాయి.  ఇటీవల మరో 60 గ్రూప్‌-1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణ – ఫిబ్రవరి 23 నుంచి…

Read More

పశ్చిమ బెంగాల్‌లో సంచనం సృష్టించిన సందేశ్‌ఖాలీ కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. లోక్‌సభ సెక్రటేరియట్‌తో పాటు కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సందేశ్‌ఖాలీలో కొద్దిరోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే, పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు సుకాంత మజుందార్‌తో పాటు బీజేపీ ఎంపీలు బాధితులను కలిసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు సందేశ్‌ఖాలీ వెళ్లకుండా ఎంపీలను అడ్డుకున్నారు. పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగిన సమయంలో సుకాంత మజుందార్‌కు గాలయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆయన లోక్‌సభ సెక్రటేరియట్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ప్రివిలేజెస్‌ కమిటీ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం కమిటీ ఎదుట విచారణకు కావాలని ఆదేశించింది. …

Read More

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ, గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం వనదేవతల మహా జాతరకు అంతా సిద్ధమయ్యింది. మేడారం జాతరకు భక్తులు ఇప్పటికే తండోపతండాలుగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతరకు ఈసంవత్సరం సుమారు కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అంచనావేస్తున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాంధవులుగా, కేవలం తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారు. ఈ జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1996 సంవత్సరంలో రాష్ట్ర పండగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర వస్తుందంటే చాలు ఆదివాసీ గ్రామం అయిన మేడారం జనారణ్యంగా మారిపోతుంది.  దేశవిదేశాల్లో భక్తులు ఎక్కడ ఉన్నా జాతర సమయంలో ఇక్కడకు వచ్చి ఎత్తు బంగారం, పూలు, చీర, సారలతో దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. గత రెండు నెలలముందునుండి మేడారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.…

Read More