గవర్నర్ కోటా ఎంఎల్‌సిల ఎన్నిక వివాదంపై హైకోర్టులో గురువారం మరోమారు విచారణ జరిగింది. గురు వారం ఉదయం నుంచి పిటిషన్‌పై కోర్టులో సుదీర్ఘంగా ఇరుపక్షాల వారు తమ వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పు వచ్చే వరకూ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎంఎల్‌సి ఎన్నికపై స్టేటస్ కో కొనసాగనుంది. ఎంఎల్‌సిలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను నియమించడాన్ని సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. కొద్ది నెలల క్రితం బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎంఎల్‌సిలుగా నామినేట్ చేసింది. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారి పేర్లను తిరస్కరించారు. గవర్నర్ తమ నియామకాలకు ఆమోదం తెలుపకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎంఎల్‌సిలుగా నామినేట్ చేసిం దని, దాన్ని తిరస్కరించే…
Author: Editor's Desk, Tattva News
ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ నేత మిమి చక్రవర్తి ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. రాజీనామా లేఖను టిఎంసి అధ్యక్షురాలు మమతా బెనర్జీకి పంపినట్లు తెలిపారు. అయితే మమతా బెనర్జీ ఈ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. జాదవ్‌పూర్ అభివృద్ధి కోసం కలలు కన్నానని, అయితే స్థానిక నేతల నుండి ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. సినీ పరిశ్రమ నుండి వచ్చిన వ్యక్తి దేనికీ పనికి రాడు అంటూ అపఖ్యాతిపాలు చేయడం చాలా సులభమని అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఈరోజు నేను మా పార్టీ సుప్రీంను కలుసుకున్నాను. ఈనెల 13నే నా రాజీనామాను ఆమెకు సమర్పించాను. ఇన్ని సంవత్సరాలు నాకు అర్థమైనదేమంటే రాజకీయాలు నా కప్పు టీకాదు” అని విలేఖరులకు ఆమె చెప్పారు. నిబంధనల ప్రకారం స్పీకర్‌కు ఇవ్వకుండా ముఖ్యమంత్రికి ఎందుకు సమర్పించారు ?…
కర్ణాటక అసెంబ్లీ గురువారం కన్నడ భాషా సమగ్రాభివృద్ధి (సవరణ) బిల్లు-2024ను ఆమోదించింది. దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల సైన్‌బోర్డులను 60శాతం కన్నడ భాషను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం రెండేళ్ల నాటి చట్టాన్ని సవరించింది. వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార సంస్థలు, ట్రస్టులు, కౌన్సెలింగ్ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రయోగ శాలలు, హోటల్స్ ఇలాంటి అన్నింటికి చెందిన సైన్‌బోర్డుల్లో తప్పనిసరిగా 60శాతం కన్నడ భాషలోనే రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోందన్నారు. కొత్త లైసెన్సులు, ప్రస్తుతం ఉన్న వాటిని పునరుద్ధరించే సమయంలో సైన్‌బోర్డుల్లో కన్నడ భాష వినియోగానికి సంబంధించిన నిబంధనలు పాటించారా? లేదా ? చూస్తామని.. లేకపోతే జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు సిబ్బందితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నేమ్ బోర్డుల్లో కన్నడ వాడని సమస్య…
కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాగ్ వెల్లడించింది. మార్పుల వల్ల గతంలో చేసిన కొన్ని పనులు నిరర్థకంగా మారాయని తెలిపింది. దీంతో రూ.765 కోట్లు నష్టం వాటిల్లిందని తన రిపోర్టులో వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను అనవసరంగా చేపట్టినట్లు అయిందని, దీనికి అదనంగా రూ.25 వేల కోట్లు ఖర్చయిందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులను నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లకు అప్పగించిందని కాగ్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగునీటిపై మూలధన వ్యయం ఎకరా ఒక్కింటికి రూ.6.42 లక్షలు ఖర్చవుతోందని తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు ప్రయోజనాలు, ప్రాజెక్టుకు అయిన వ్యయం నిష్పత్తి 1:51 గా అంచనా వేశారు. కానీ ఈ నిష్పత్తి 0:75 శాతంగా ఉంది.…
రాజకీయ పార్టీలు అధికారికంగా విరాళాల సేకరణకు ఉద్దేశించిన ‘ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఈ స్కీమ్‌ని నిలిపివేయాలని సీజేఐ చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. రాజకీయ విరాళాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు 2018లో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. నల్లధనాన్ని రూపుమాపడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్లు విక్రయించరాదని కోర్టు తీర్పునిచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకున్న ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అనామక ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కు (ఆర్టీఐ), ఆర్టికల్ 19(1)(ఎ)లను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ఈ…
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టం, తదితర సమస్యల పరిష్కారం కోసం ‘చలో ఢిల్లీ’ చేపట్టిన రైతులపై రైతుల మార్చ్ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులపై భద్రతా సిబ్బంది మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మధ్య గురువారం కేంద్ర ప్రభుత్వం మూడోసారి రైతు సంఘాల నేతలతో చర్చలు జరపనుంది. వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోం వ్యవహారాల సహాయక మంత్రి నిత్యానంద రాయ్ గురువారం సాయంత్రం 5 గంటలకు రైతు నేతలతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 8, 12 తేదీల్లో రైతులతో జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. కాగా, పంజాబ్‌లో భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్), బికెయు దకౌండా (ధనేర్) గురువారం రైల్ రోకో ప్రకటించాయి. శంబు, ఖనౌరీ సరిహద్దుల్లో హర్యానా భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్ షెల్స్ మరియు…
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లకు విధుల అప్పగింతకు సంబంధించి కీలక సూచనలు చేసింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడానికి అనుమతి ఇవ్వవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖరాసింది. ఇదే సమయంలో ఎన్నికల్లో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపైనా ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల విధుల్లోకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఈవోకు ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేసింది. ప్రతీ పోలింగ్ బూత్‌లో రెగ్యులర్ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవచ్చని ఈసీ సూచించింది. అయితే ఓటర్ల వేలుకు ఇంకుపూసే విధులు వంటివి మాత్రమే అప్పగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అంతకంటే ముఖ్యమైన పనులేవీ వారికి అప్పగించవద్దంటూ ఏపీ సీఈవోకు లేఖలో…
సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కీలక పదవులలో ఉన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బీజేపీలో చేరిన రెండు రోజులకే రాజ్యసభ సీటు దక్కింది. తాజాగా రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్ పోటీ చేయనున్నట్లు బిజెపి ప్రకటించింది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మరోసారి రాజ్యసభ సీటును దక్కించుకున్నారు. ఈసారి జేపీ నడ్డాను గుజరాత్ నుంచి బీజేపీ ఎంపిక చేసింది. తాజాగా బీజేపీ విడుదల చేసిన జాబితాలో మహారాష్ట్ర నుంచి అశోక్‌చవాన్, గుజరాత్ నుంచి జేపీ నడ్డా పేర్లను ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే వారికి నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు తమ పార్టీ తరఫున రాజ్యసభకు బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి డాక్టర్ ఎల్.మురుగన్, ఉమేష్ నాథ్ మహరాజ్, మాయా నరోలియా, బన్సీలాల్ గుర్జర్‌ల పేర్లను అభ్యర్థులుగా…
బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డితెలంగాణ బీజేపీ ఎట్టకేలకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌ను ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ప్రకటించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కే వెంకటరమణా రెడ్డిలను శాసనసభాపక్ష ఉపనేతలుగా నియమించింది. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ను బీజేఎల్పీ కార్యదర్శిగా నియమించింది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబును ప్రధాన విప్‌గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాను పార్టీ విప్‌గా నియమించినట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పీ రాకేశ్‌ను పార్టీ కోశాధికారిగా తెలంగాణ బీజేపీ నియమించింది. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి బీజేపీ నియమించింది. ఈ కొత్త నియామకాలను తెలుపుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి శాసన సభ, శాసన మండలి కార్యదర్శులకు లేఖ రాశారు.
చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఒంగోలు రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. చెక్ బౌన్స్ కేసు మీద విచారణ అనంతరం ఒంగోలు కోర్టు బండ్ల గణేష్‌కు సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే రూ. 95 లక్షల జరిమానా విధించింది 2019లో ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద బండ్ల గణేష్ రూ. 95 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ మొత్తానికి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో చెక్కు ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ కావటంతో వెంకటేశ్వర్లు కేసు పెట్టారు. ఈ చెక్ బౌన్స్ కేసుపై ఒంగోలు రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరగ్గా విచారణకు బండ్ల గణేష్ సైతం హాజరయ్యారు. అయితే ఈ కేసులో…