పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ తదితర డిమాండ్లతో అన్నదాతలు మంగళవారం చేపట్టిన చలో ఢిల్లీ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. పంజాబ్, హర్యానా నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీ వైపు కదలగా, వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు బద్ధలు కొట్టి ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై బాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. దీంతో 65మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటుచేశారు. భారీగా బలగాలను మోహరించారు. సింఘు, టిక్రి సరిహద్దులను మూసివేశారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీ వైపు కదిలారు. వీరిని అడ్డుకునేందకు హర్యానా పోలీసులు…
Author: Editor's Desk, Tattva News
ప్రతిభ ప్రదర్శించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు, ఉత్తమ విలువలు కలిగిన చిత్రాలను ఎంపిక చేసి ప్రతి ఏటా ఇచ్చే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటి వరకూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద ఇచ్చే ‘ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు’ అవార్డ్‌ను ఇకపై ఆ పేరుతో కాకుండా ‘ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు’ పేరుతో ఇస్తారు. అంటే అందులో ఉన్న ‘ఇందిరాగాంధీ’ పేరు తొలిగించారన్న మాట. ఈ విభాగంలో దర్శకుడితో పాటు నిర్మాతకు కూడా ప్రైజ్ మనీ ఇచ్చేవారు. ఇకపై దర్శకుడికి మాత్రమే ప్రైజ్ మనీ ఇస్తారు. అలాగే బాలీవుడ్ నటి నర్గిస్ పేరు మీద జాతీయ సమైకత్యను పెంపొందించే చిత్రానికి ఓ అవార్డ్ ఇస్తున్నారు. ఇకపై ఆ అవార్డులో నర్గిస్ పేరు కూడా ఉండదు. ‘జాతీయ, సామాజిక, పర్యావణ విలువలు పెంపొందించే ఉత్తమ చిత్రం’ పేరుతో ఆ అవార్డ్ అందజేస్తారు. కేంద్ర సమాచార శాఖ…
ప్రపంచం భారత్‌ను ‘విశ్వ బంధు’గా చూస్తోందని, ఎక్కడ సంక్షోభం వచ్చినా అక్కడికి చేరుకునే మొదటి దేశాల్లో భారత్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం యూఏఈ చేరుకున్నారు. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంతో సహా ఎనిమిది ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ రోజు ప్రపంచంలోని ప్రతి ప్రధాన వేదికపై భారతదేశం గొంతుక వినిపిస్తోందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. నేటి బలమైన భారతదేశం అడుగడుగునా ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొంటూయుఎఇ భారతదేశానికి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మాత్రమే కాకుండా, ఏడవ అతిపెద్ద పెట్టుబడిదారు కూడా అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుదుర్చుకున్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఇరు దేశాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ ఇంటర్‌కనెక్షన్, వాణిజ్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం, రెండు…
సౌర విద్యుత్ శక్తికి, సుస్థిర ప్రగతిని ప్రోత్సహించేందుకు ‘పిఎంసూర్య ఘర్ : ముఫ్త్ బిజ్లీ యోజన’ను తన ప్రభుత్వం ప్రారంభించిందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ప్రతి నెల 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయడం ద్వారా ఒక కోటి ఇళ్లలో విద్యుత్ కాంతులు నింపడం ఈ పథకం లక్షమని ప్రధాని వెల్లడించారు. ఈ పథకానికి రూ. 75 వేల కోట్లకు పైగా పెట్టుబడి అవసరం అవుతుందని మోదీ తెలియజేశారు. ‘సుస్తిర అభివృద్ధిని కొనసాగించేందుకు, ప్రజల సంక్షేమార్థం ‘పిఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజ్లీ (ఉచిత విద్యుత్) యోజన’ ప్రారంభిస్తున్నాం. రూ. 75 వేల కోట్లకు పైగా పెట్టుబడితో చేపడుతున్న ఈ పథకం లక్షం ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఒక కోటి ఇళ్లలో విద్యుత్ కాంతులు నింపడం’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్ట్‌లో వివరించారు. గణనీయమైన సబ్సిడీల…
బాల్యం నుంచి తాను పెరిగి, ఎదిగిన కాంగ్రెస్ పార్టీకి సోమవారం రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు అశోక్ చవాన్ 24 గంటలు గడవక ముందే బిజెపి కండువా కప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మంగళవారం ఆయన బిజెపిలో చేరారు. చవాన్ వెంట ఆయన సహచరుడు, మాజీ ఎంఎల్‌సి అమర్‌నాథ్ రాజుర్కర్ కూడా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలతోసహా తన అనుచరులు బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎలో చేరనున్నట్లు చవాన్ తెలిపారు. చవాన్ గతంలో రెండు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా, పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేయాలన్న కోరికతోనే తాను బిజెపిలో చేరినట్లు చవాన్ తెలిపారు. చవాన్ రాకతో మహారాష్ట్ర, మరాఠ్వాడలో బిజెపి మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌ను వీడినందుకు కొందరు…
కృష్ణానదిపైనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కు అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి చర్చోపచర్చల అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ రెండు కీలకమైన ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, తమ ప్రభుత్వం బోర్డు ముందు, కేంద్ర ప్రభుత్వం ముందుంచి న సమస్యలన్నింటినీ పరిష్కరించిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకొంటామని, అప్పటి వరకు ప్రాజెక్టులను అప్పగించేది లేదని నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీకి సమర్పించిన తీర్మానంలో పేర్కొన్నారు. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే అంశాలపై గత పదేళ్ళల్లో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. దీనిపై సభలో వాడీవేడిగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి టి.హరీష్‌రావు తీర్మానంలో పొందుపరిచిన “గత ప్రభుత్వం” అనే పదాన్ని తొలగించాలని సూచించారు.…
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ ఛలో ఆందోళన తలపెట్టిన రైతులతో కేంద్ర ప్రభుత్వం సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రైతు సంఘాల నేతలతో ఆరు గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలు ఎటువంటి పరిష్కారం లేకుండా ముగిశాయి. దీనిపై రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చర్చల విషయంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ఆందోళన ఆగబోదని, ఢిల్లీ ఛలో నిర్వహించి తీరుతామని నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మార్చ్ ప్రారంభమవుతుందని ఉద్ఘాటించారు. ‘చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు.. మేము ఉదయం 10 గంటలకు ఢిల్లీకి మా మార్చ్ ప్రారంభిస్తాం… అయితే, మేము మా ఫోరమ్‌లో ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చిస్తాం.. కానీ, ఇక్కడ ప్రభుత్వ తప్పు స్పష్టంగా ఉంది’ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ఒక రైతు సంఘం నాయకుడు చెప్పారు. విద్యుత్ చట్టం- 2020ని రద్దు…
గాజా స్ట్రిప్‌లో భద్రత బలగాల భారీ బందోబస్తులో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ను సోమవారం తెల్లవారు జామున ముట్టడించిన ఇజ్రాయెల్ దళాలు ప్రత్యర్థి దళాల కాల్పుల మధ్య ఇద్దరు బందీలకు విముక్తి కలిగించగలిగాయి. కానీ ఇజ్రాయెల్ దళాల దాడిలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 67 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గాజా స్ట్రిప్‌కు దక్షిణ కొసన ఉన్న నగరం రఫాలో అపార్ట్‌మెంట్ సమీపాన రక్షక దళాలకు సాయంగా భారీ స్థాయిలో వైమానిక దాడులు సాగాయి. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం బారి నుంచి తప్పించుకోవడానికి 14 లక్షల మంది పాలస్తీనియన్లు పారిపోయి ఆ ప్రాంతంలో తలదాచుకున్నారు. బందీల విముక్తి కోసం జరిగిన ఆ దాడిపై ఇజ్రాయెల్‌లో విజయోత్సవాలు చోటు చేసుకున్నాయి. అయితే, హమాస్, ఇతర గాజా తీవ్రవాదుల చెరలో ఇప్పటికీ 100 మందికి పైగా బందీలు ఉన్నారు. హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధంలో 12300 మందికి…
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ బరి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆమె ఈసారి రాజ్యసభకు ఎన్నిక కానున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి సోనియా గాంధీ తప్పుకోనున్నారు. ఇక ఆ స్థానంలో సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి ఉంచాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 77 ఏళ్ల సోనియా గాంధీ వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీల్లో పాల్గొనే పరిస్థితి లేని కారణంగానే ఆమెను…
బీహార్ లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్), భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శాసనసభలో తన బలాన్ని సోమవారం నిరూపించుకో గలిగారు. కిందటి నెలలో జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎన్డీఏ కూటమిలో చేరి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ, దాని మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 122. జేడీయూకు 45 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామీ లీగ్-4 స్థానాలను కలుపుకొంటే ఈ…