Author: Editor's Desk, Tattva News

అయోధ్యలోని రామమందిరాన్ని ఉత్తర్ ప్రదేశ్‌‌కు చెందిన 325 మందికిపైగా ఎమ్మెల్యేలు ఆదివారం దర్శించుకుని, పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక విమానంలో ఆయన క్యాబినెట్ మంత్రులతో పాటు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 10 బస్సుల్లో అయోధ్యకు చేరుకున్నారు. ఆలయానికి వెళ్లి బాలక్ రామ్‌ను దర్శించుకున్నారు.  మందిరం అంతా ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో మార్మోగింది. ఆలయంలో పూజలు నిర్వహించామంటూ మందిరం మెట్ల వద్ద దిగిన ఫోటోలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ట్విట్టర్‌లో షేర్ చేశారు.  కొందరు ఎమ్యెల్యేల కుటుంభం సభ్యులతో కలిపి 400 మందికి పైగా దర్శించుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం సమాజావాది పార్టీ ఎమ్యెల్యేలు మినహా అన్ని పార్టీల ఎమ్యెల్యేలు రావడం గమనార్హం. యూపీ స్పీకర్ సతీశ్ మహానా సైతం ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇక్కడ ఒక నిర్మాణం నిలబడి ఉంది.. అది డిసెంబర్ 6…

Read More

గూఢచర్యం కేసులో ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులు అరెస్ట‌య్యారు. వీరికి విధించిన మరణశిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చగా, తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సోమవారం తెల్లవారుజామున ఓ ప్రకటన విడుదల చేసింది. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిలో ఏడుగురు ఖతార్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. ఖతార్‌ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. వీరు 18 నెలలపాటు శిక్ష అనుభవించారు ‘ఖతార్‌లో నిర్బంధించబడిన అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. వారిలో ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఖతార్ ప్రభుత్వ ఎమిర్ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము’ అని ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది.…

Read More

గతేడాది భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలను దూరం చేసిన (సీనియర్‌ స్థాయిలో) ఆస్ట్రేలియా తాజాగా జూనియర్‌ లెవల్‌లో కూడా దెబ్బకొట్టింది. 2023 జూన్‌లో పాట్‌ కమిన్స్‌ నేతృత్వంలోని ఆసీస్‌.. ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో రోహిత్‌ సేనను చిత్తు చేసింది.  మళ్లీ నవంబర్‌లో భారత్‌లోనే జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో కూడా అసలు ఓటమన్నదే లేకుండా ఫైనల్‌ చేరిన భారత జట్టును ఓడించి ప్రపంచకప్‌ ఎగురేసుకుపోయింది. తాజాగా పెద్దలు (రోహిత్‌ సేన) చూపిన బాటలోనే ఉదయ్‌ సహరన్‌ సారథ్యంలోని యువ భారత్‌ పయనించింది.  ఫైనల్‌ దాకా ఓ రేంజ్‌ ఆట ఆడిన టీమిండియా.. తుదిపోరులో యావరేజ్‌ ఆట కూడా ఆడలేక చతికిలపడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌ – 19 మెన్స్‌ వరల్డ్‌ కప్‌లో కంగారూలు.. భారత్‌ను ఓడించి విశ్వవిజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్‌కు వచ్చిన మన కుర్రాళ్లు.. తుది పోరులో బౌలింగ్‌లో…

Read More

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కు మించి స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోని విపక్ష నేతలు కూడా అధికార పార్టీకి 400 మించి స్థానాలు వస్తాయని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లోని ఝబువా జిల్లాలో గిరిజన ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. లోక్‌సభ మొత్తం 543 స్థానాల్లో 370 స్థానాలను బీజేపీ సాధించాలంటే ప్రతి పోలింగ్ కేంద్రంలో గత ఎన్నికల కన్నా అదనంగా 370ఓట్లు పడేలా చూడాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. బీజేపీ కమలం గుర్తు స్వంతంగా 370 మార్కును అధిగమిస్తుందని తాను కచ్చితంగా చెప్పగలనని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఇప్పుడు తానిక్కడకు రాలేదని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యదికంగా మద్దతు ఇచ్చి తమ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెల్పడానికి ప్రజాసేవకునిగా తాను వచ్చానని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్…

Read More

తిరుపతిలోని నలుగురు పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. తిరుపతి లోక్‌సభ ఎన్నికల సమయంలో తిరుపతిలో దొంగ ఓట్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎవరూ లేని ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్ల నమోదైనట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చనిపోయిన వాళ్లకు సైతం ఓటు హక్కు కల్పించారని సైతం విమర్శలు వచ్చాయి.  దీనిపై విపక్షాలు పోలీసులు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు నమోదు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుకు జతగా ఆధారాలు కూడా సమర్పించారు. అయితే ఈ కేసులో తిరుపతి పోలీసులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం తిరుపతి తూర్పు, పశ్చిమ పోలీసులపై కొరడా ఝుళిపించింది తిరుపతి ఉప ఎన్నికల సమయంలో తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు పనిచేసిన శివప్రసాద్ రెడ్డి, శివ ప్రసాద్ మీద ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.…

Read More

ప్రఖ్యాత ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజి (ఐఐటి) మూడవ విదేశీ క్యాంపస్ శ్రీలంకలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అధికారవర్గాలు ధృవీకరించాయి. గత నవంబర్‌లో శ్రీలంకలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఐఐటి ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. ఈ కీలక ఐటి విద్యాసంస్థ ఏర్పాటు విషయంలో శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే ఐఐటి మద్రాస్ అధికారవర్గాలతో సంప్రదింపులకు దిగింది. ఉన్నత స్థాయి అధికార బృందం చెన్నై క్యాంపస్‌ను సందర్శించింది. శ్రీలంకలో ఐఐటి ఏర్పాటు విషయంలో ప్రాధమిక చర్చలు జరిపింది. ఇప్పుడు ఇక ముందు జరిగే చర్చల నేపథ్యంలో ఇకపై శ్రీలంకలోని కాండిలో ఐఐటి ఏర్పాటుకు వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే వెంటనే దీనిని పూర్తి స్థాయి అధికారిక ప్రకటనగా భావించరాదని స్పష్టం చేశారు. టాంజానియా, యుఎఇలలో కూడా ఐఐటి ఏర్పాటుదిశలో ఒప్పందాలు కుదిరాయి. తమ దేశంలోనూ ఐఐటి క్యాంపస్‌ల ఏర్పాటుకు బ్రిటన్ కూడా ముందుకు వచ్చింది. మిడిలిస్టుదేశాల నుంచి కూడా…

Read More

కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్రమత్తమైన హర్యానా పోలీసులు అత్యవసరమైతే తప్ప రహదారులపైకి ప్రజలు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు.  శాంతిభద్రతలను కాపాడటానికి పంచకులలో 144 సెక్షన్‌ని అమలు చేశారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ పోలీసులూ అప్రమత్తం అయ్యారు. అన్ని సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హరియాణా, పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుకు రాకుండా ఆయా ప్రాంతాల్లో క్రేన్లు, కంటైనర్లను మోహరించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించే చట్టం తేవడంతో పాటు రైతాంగాన్ని వేధిస్తున్న పలు సమస్యలను పరిష్కరించాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల నుంచి వివిధ అభివృద్ధి పనుల కోసం తీసుకున్న భూములను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలోపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హామీల అమలు జరిగేలా ప్రయత్నించాలని చూస్తున్నారు.…

Read More

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, మాటల గారడీ మాదిరిగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారని, రైతుబంధు, రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంట రుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితేంటని ప్రశ్నించారు. వ్యవసాయరంగ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా ఇస్తామన్న హామీ నీటిమీద రాతలేనా? అని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీ ఇక అమలు కాలేదని చెబుతూ రైతుల కోసం వరంగల్ లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ చిత్తు కాగితమేనని కాంగ్రెస్ బడ్జెట్ చెబుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాల్లో మొదటి సమావేశంలో బిసి…

Read More

ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. “ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. సీఏఏ పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో హింసను ఎదుర్కొని భారత దేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి భారత పౌరసత్వానిన లాక్కోవడానికి కాదు” అని అమిత్ షా వివరించారు. సీఎఎ అమలుకు ముందు దానికి సంబంధించిన నిబంధనలను జారీ చేస్తామని తెలిపారు. ఢిల్లీలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024 లో అమిత్ షా మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు మొత్తం 400 స్థానాలు వస్తాయని నిర్ధారిస్తూ ఈ ఎన్నికల ఫలితాలపై…

Read More

రఫాలోని పౌరుల నివాసాలపై శనివారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ మూడుసార్లు వైమానిక దాడులు జరపడంతో 28 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మూడు కుటుంబాలకు చెందిన వారు ఈ దాడులకు బలైపోయారు. వీరిలో పది మంది పిల్లలుండగా, అందులో మూడు నెలల పసికందు ఉండడం అత్యంత శోచనీయం. అనేక మంది గాయపడ్డారు. నేలపై పోరు ప్రారంభించే ముందు దక్షిణ గాజా సిటీ నుంచి వేలాది మంది ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఇప్పటికే చాలా మందిని గాజా నుంచి తరలించినప్పటికీ, మొత్తం 2.3 మిలియన్ మందిలో సగం కన్నా ఎక్కువ మందే గాజా భూభాగంలో రెండింట మూడొంతుల భూభాగాన్ని ఆక్రమించి ఉన్నారు. గాజాలో పాలస్తీనియన్లపై దాడులు పెరుగుతుండడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. పౌరుల నివాసాల నుంచి హమాస్ దాడులు చేస్తుండడమే ప్రజలు బలికావడానికి కారణమౌతోందని ఇజ్రాయెల్ చెబుతోంది.…

Read More