Author: Editor's Desk, Tattva News

పాకిస్థాన్ లో మరో 9 రోజుల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా, ఈరోజు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార రహస్యాల వెల్లడి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది నయీం పంజుతా సోషల్ మీడియాలో స్పందించారు. ఈ తీర్పును తాము అంగీకరించబోమని, ఇది అక్రమం అని పేర్కొన్నారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న అభియోగాలపై ఇమ్రాన్ ఖాన్ చాన్నాళ్లుగా విచారణ ఎదుర్కొంటున్నారు.ఈ కేసు ‘సైఫర్ కేసు’గా ప్రసిద్ధికెక్కింది. గతేడాది అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఓ రహస్య కేబుల్ (సైఫర్)ను పాక్ ప్రభుత్వానికి పంపింది. ఈ కేబుల్ ను ఇమ్రాన్ ఖాన్ బహిర్గతం చేశారన్నది సైఫర్ కేసులో ప్రధాన అభియోగం. అధికార రహస్యాల చట్టం కింద ఈ కేసు విచారణ…

Read More

ప్రముఖ విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సత్నామ్ సింగ్ సంధూను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నామినేట్ చేశారు. ఈ మేరకు కేంద్రహోం శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సత్నామ్ సింగ్‌ను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ఆయన గొప్ప విద్యావేత్త అని, సామాజిక కార్యకర్తగా అట్టడుగు వర్గాలకు సేవ చేస్తున్నారని అభివర్ణించారు. దేశ సమైక్యత కోసం విస్తృతంగా పనిచేస్తున్నారని, ఆయన పార్లమెంటరీ ప్రయాణం ఉత్తమంగా సాగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆయన అభిప్రాయాలతో రాజ్యసభ కార్యకలాపాలు సుసంపన్నం అవుతాయని భావిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీష్ ధన్‌కర్ తన అభినందనలో సత్నామ్ సామాజిక సేవ, విద్యా సేవపై ఉన్న అభిరుచి రాజ్యసభ ఉన్నతికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు . పంజాబ్ లోని ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన సంధూ చిన్నతనంలో చదువు కోడానికి అనేక…

Read More

బీజేపీ నేత హత్య కేసులో కేరళ సెషన్స్ కోర్టు మంగళవారం ఉదయం సంచలన తీర్పు వెలువరించింది. రెండేళ్ల కిందట సంచలనం సృష్టించిన బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మందిని దోషులుగా నిర్దారించిన అలప్పుజ న్యాయస్థానం వీరికి ఉరిశిక్ష విధించింది. దోషులంతా నిషేధిత పీఎఫ్ఐ, ఎస్డీపీఐ సంస్థకు చెందిన కార్యకర్తలే కావడం గమనార్హం.  2021 డిసెంబరు 19న అలప్పుజలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ దారుణ హత్యకు గురయ్యారు. పీఎఫ్‌ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలు అతడి ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యుల ఎదుటే అత్యంత పాశవికంగా నరికి చంపేశారు.  ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన కేరళ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.  దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్  ఈ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించింది. రంజిత్ శ్రీనివాసన్ హత్యకు ముందురోజు అంటే డిసెంబరు 18న ఎస్డీపీఐ నేత కేఎస్‌ షాన్‌ను…

Read More

“నాకు జగనన్నపై ద్వేషం లేదు, ఆయన పాత జగనన్న కాదు, సీఎం అయినా తరువాత జగనన్న మారిపోయాడు, ఈ జగనన్న ఆ జగన్న కాదు” అంటూ ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్  షర్మిలా రెడ్డి ఉద్వేగంగా స్పష్టం చేశారు. కడప పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం కడప, అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొంటూ జగనన్న కోసం, వైసీపీ కోసం 3200 కిలోమీటర్లు కేవలం ఒక్క మహిళగా పాదయాత్ర చేశానని గుర్తు చేశారు.  కానీ ఈ వైసీపీ కేడర్ కు కనీసం కృతజ్ఞత లేదని, రోజుకో జోకర్ను వస్తున్నాడని, ఉచ్చం నీచం లేకుండా, సిగ్గు శరం లేకుండా వ్యక్తిగత ఆరోపణలతో ఈ జోకర్లు రెచ్చిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లని ఇంగితం లేకుండా తన  వ్యక్తిగత జీవితంపై  చెలరేగిపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తనకు భయపడనని షర్మిలారెడ్డి స్పష్టం చేశారు.  షర్మిలను సీఎం…

Read More

టాలీవుడ్‌ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కొరటాల శివ క్రిమినల్‌ కేసును ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసును ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది. దర్శకుడు కొరటాల శివన తన కథను కాపీ చేసి సినిమా తీశారని రచయిత శరత్‌ చంద్ర కోర్టుకెక్కారు. స్వాతి మ్యాగజైన్‌లో వచ్చిన తన కథ ‘శ్రీమంతుడు’ సినిమాగా తీశారంటూ శరత్‌ చంద్ర నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారించిన కోర్టు దర్శకుడిపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు. తన కథను కాపీ కొట్టారని ఆరోపించిన రచయిత ఆ మేరకు కోర్టుకు ఆధారాలను సమర్పించారు. చిత్ర నిర్మాత ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌లపై కాపీ రైట్‌‌యాక్ట్‌‌ కేసు నమోదు చేయాలని, ఫోర్జరీ, చీటింగ్‌‌ కేసులు నమోదు చేయాలన్న కథ రచయిత శరత్‌‌ చంద్ర అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. శరత్‌…

Read More

టీటీడీ వార్షిక బడ్జెట్ (2024-25) కు పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ పాలకమండలి నిర్ణయాలను ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలిపుతూ టీటీడీ వార్షిక బడ్జెట్ ను రూ.5,141.74 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టగా, రూ.5,122.80 కోట్ల బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించిందని చెప్పారు.  ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి పాదాల వద్ద ఉంచిన మంగళ సూత్రాలను (బంగారు డాల్లర్లు) భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి జీతం రూ.15 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దేవస్థానంలో ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలలో పనిచేస్తున్న 51 మంది ఉపాధ్యాయుల జీతాలు రూ.35 వేల నుంచి రూ.54 వేలకు పెంచుతున్నట్లు పాలకమండలి ప్రకటించింది. టీటీడీ ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతున్నట్లు పాలకమండలి పేర్కొంది. దీంతో పాటు 56 వేదపారాయణదారుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వేదపండితుల పింఛన్ రూ.10…

Read More

టాలీవుడ్ అగ్రహీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలతో పాటు సురేష్, అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ లోని ‘డెక్కన్‌ కిచెన్‌’ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి కుటుంబం డెక్కన్ కిచెన్ కూల్చివేసిందని ఆ హోటల్ యజమాని నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. హోటల్ కూల్చివేతతో తనకు రూ.20 కోట్లు నష్టం వాటిల్లిందని నందకుమార్ కోర్టుకు తెలిపారు. హోటల్ లీజు విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నా అక్రమంగా కూల్చివేశారని, విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని నందకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లతో తన హోటల్ ను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని…

Read More

స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ‘భారత్ సార్వభౌమాధికారం, భద్రత, సమగ్రతను బెదిరించేలా, శాంతి-మత సామరస్యానికి భంగం కలిగించడంలో సిమి నిమగ్నమైందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది కాగా, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై 2014 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం తొలిసారి నిషేధం విధించింది. 2019లో ఈ నిషేధాన్ని ఐదేళ్లపాటు పొడిగించింది. 1977 ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌లోని ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ మహ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ సిమిని స్థాపించారు. ప్రారంభంలో, విద్యార్థుల క్రియాశీలతపై ఈ సంస్థ దృష్టి సారించింది. దేశంలో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే కాలక్రమేణా రాడికల్ సిద్ధాంతాలను ప్రోత్సహించడంతోపాటు భారతదేశాన్ని ఇస్లామిక్‌గా మార్చే ఎజెండాలో సిమి…

Read More

భారత్‌తో సంబంధాలు దిగజారిన నేపథ్యంలో మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ప్రతిపక్షాల నుండి పదవీగండం సంకేతాలు వెలువడుతున్నాయి. పార్లమెంట్‌లో ముయిజ్జూ అభిశంసన కోసం విపక్షాలు సిద్ధపడుతున్నాయి. మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (ఎండీపీ) పార్లమెంటరీ గ్రూప్ ముయిజ్జూ అభిశంసన తీర్మానానికి అంగీకరించింది. చైనా అనుకూలుడైన ముయిజ్జూకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు డెమొక్రాట్లతోపాటు ఎండీపీ సభ్యులు సంతకాలు సేకరించారు. అధ్యక్షుడైన ముయిజ్జూ న్యూఢిల్లీతో సంబంధాలకు విఘాతం కలిగించిన నేపథ్యంలో తాము ఈ తీర్మానాన్ని తీసుకొచ్చామని మాల్దీవుల పార్లమెంటు సభ్యుడొకరు తెలిపారు. అంతకుముందు జనవరి 8న పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా అధ్యక్షుణ్ని గద్దె దించాలని కోరారు. మాల్దీవులు విదేశాంగ విధాన స్థిరత్వాన్ని నిలబెట్టడానికి, పొరుగు దేశాలకు దూరం కాకుండా ఉండేందుకు ఇదెంతో అవసరమని అజీమ్ స్పష్టం చేశారు. అభిశంసన తీర్మానం విషయమై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాదోపవాదనలతో మాల్దీవులు పార్లమెంట్ అట్టుడుకుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర…

Read More

జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారు ఇకపై అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ చికిత్స పొందొచ్చు. ఈ సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చినట్లు ‘ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ వెల్లడించింది. ఇన్సూరెన్స్ పాలసీ నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రుల్లోనూ ఈ సేవలు వినియోగించుకోవచ్చు. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలను సంప్రదించి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌పై కీలక ప్రకటన చేసింది. కేవలం నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనే కాకుండా ఇప్పుడు అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందుబాటులోకి తెచ్చేందుకు క్యాష్‌లెస్ ఎవ్‌రీవేర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆరోగ్య బీమా ఉన్న పాలసీదారుడు ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన నెట్ వర్క్ ఆస్పత్రులతో పాటు ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఇకపై నగదు రహిత చికిత్స చేయించుకునే వీలు కలుగుతుంది. ఈ కొత్త రూల్‌ జనవరి 24 నుంచే ప్రారంభమైనట్లు జీఐసీ స్పష్టం చేసింది. క్యాష్‌లెస్ ఎవరీ‌వేర్‌లో భాగంగా పాలసీదారుడు క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ ఫెసిలిటీ ద్వారా ఏ ఆస్పత్రిలోనైనా నగదు…

Read More