Author: Editor's Desk, Tattva News

కోల్‌కతా ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలు చేస్తోన్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోకి విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. వైద్యులు విధుల్లో చేరేందుకు బెంగాల్ ప్రభుత్వం విధించిన గడువు సోమవారంతో ముగియనుంది.  ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గడువును పొడిగింది. మంగళవారం సాయంత్రంలోగా విధులకు హాజరుకావాలని. లేకుంటే క్రమశిక్షాణ చర్యలు తప్పవని సోమవారం స్పష్టం చేసింది. దేశాన్ని కుదిపేస్తోన్న వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో వైద్యుల భద్రత కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపింది. వీటిని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని వివరించింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు వైద్యులు విధులకు హాజరుకావాలన్న ధర్మాసనం… నిరంతరం విధులకు దూరంగా ఉంటే భవిష్యత్తులో చర్యలు తప్పవని విశ్వాసాన్ని కలిగించేందుకు ఈ ఆదేశాలు ఇస్తున్నామని…

Read More

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్ ముందుంచాలని చెప్పింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి నాలుగు వారాల గడువు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సరైన చర్యలు తీసుకోకపోతే.. సుమోటోగా తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది.  గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలను ముగించిన హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్‌, పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  పార్టీని ఫిరాయించినందుకు ఆ ముగ్గురు…

Read More

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్‌, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తెలిపారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించి శాంతి స్థాపన చేయడానికి భారత్, చైనా సహకరించాలని కోరారు. ఉత్తర ఇటలీ, సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్‌స్కీతో మెలోని భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించడంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలపై రష్యా అధినేత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేసిన రెండు రోజులు తర్వాత మెలోనీ నుంచి ఈ కామెంట్స్ రావడం గమనార్హం. వ్లాడివోస్టాక్‌లో జరిగిన 9వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగిస్తూ ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడంలో భారత్ తన వంతు సహకారం అందిస్తోందని తెలిపారు. “మేము మా స్నేహితులను, భాగస్వాములను గౌరవిస్తాం. వారు ఈ…

Read More

బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అయితే సెన్సార్ బోర్డు సినిమాలోని పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా సీన్స్‌ను తొలగించడమో లేదా వాటి స్థానంలో కొత్తవి యాడ్ చేయాలని మూవీయూనిట్​కు సెన్సార్ బోర్డు సూచించింది. అందులో బంగ్లాదేశ్‌ శరణార్థులపై పాకిస్థాన్‌ సైనికులు దాడి చేయడం, ఓ చిన్నారి, ముగ్గురు మహిళలను శిరచ్ఛేదం చేయడం వంటి సన్నివేశాలను మార్చాలని చెప్పింది. ఇక భారత మహిళలను కించపరిచేలా నిక్సన్‌ పాత్ర చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, బంగ్లాదేశ్‌ శరణార్థులు, కోర్టు తీర్పుల సమాచారం ఎక్కడిది? ‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’ ఫుటేజీ అనుమతికి సంబంధించి కొన్ని వివరాలు కోరింది. అయితే ఈ సినిమాలో తమను తప్పుగా చూపించారని ఓ వర్గం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే సెన్సార్…

Read More

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్ కేసు ఇప్పుడు భారత్ కూడా వచ్చేసింది. ఇటీవల మంకీపాక్స్ సోకిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. రోగిని ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది. ఆ వ్యక్తి నమూనాను సేకరించి మంకీపాక్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించేందుకు పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసు మూలాలను గుర్తించడానికి, దేశంలోని మరిన్ని ప్రాతాల్లో అంచనా వేయడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి విదేశాల నుంచి తిరిగి వచ్చిన క్రమంలో జ్వరం వంటి లక్ష ణాలు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. కానీ అనుమానిత రోగి వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేయలేదు. అనుమానిత రోగి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రిత్వ…

Read More

హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి ఇళ్లు, వాణిజ్య భవనాలు నిర్మించిన వారిపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వివరణ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని తెలిపారు. బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా నివాసం ఉంటే ఆ ఇళ్లను పడగొట్టబోమని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం కూల్చేస్తామని స్పష్టం చేశారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణదశలో ఉన్నాయని, బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్నిషెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని, గతంలో కూడా వాటిని కూల్చినట్లు గుర్తుచేశారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నట్లు వివరించారు. బిల్డర్‌ విజయలక్ష్మిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్న కమిషనర్, మాజీ…

Read More

ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా, బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా మాజీ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ సింగ్ మధ్య వివాదం నడుస్తూనే ఉంది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఇద్దరు రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ సింగ్ లక్ష్యంగా చేసుకొని విమర్శలు కురిపిస్తున్నారు.  హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫొగట్‌కు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. బ్రిజ్ భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా పెద్ద ఎత్తున ఉద్యమించడంతో బీజేపీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ నిరాకరించింది.  దీంతో వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వారిద్దరిపై నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారు.  హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలాంటి పొరపాట్లు చేయకూడదని, పార్టీ నాయకుల వ్యవహారశైలితో ప్రతిపక్ష పార్టీలు లబ్ధి పొందకుండా ఉండేందుకు…

Read More

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో షాక్‌ తగిలింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) రాజ్యసభ ఎంపి జవహర్‌ సిర్కార్‌ ఆదివారం రాజీనామా చేశారు. ఆర్‌జి కర్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం, ఆస్పత్రిలో జరిగిన అవినీతికి సంబంధించి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టిఎంసి పార్టీ చైర్‌పర్సన్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ”ఆర్‌జి కర్‌ ఆస్పత్రిలో ఘోరమైన ఘటనపై తీవ్రంగా బాధపడ్డాను, ఈ ఘటన జరిగిన తర్వాత ఓపిగ్గా నెలరోజులపాటు ఎదురు చూశాను. మీరు పాత స్టైల్‌లో జూనియర్‌ డాక్టర్ల సమస్యపై ప్రత్యక్షంగా.జోక్యంగా చేసుకుంటారని ఆశించాను. కానీ, అది జరగలేదు” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రభుత్వం ఇప్పుడు చాలా ఆలస్యంగా అరకొర చర్యలు తీసుకుంటుంది. పార్లమెంట్‌లో బెంగాల్‌ సమస్యలు ప్రస్తావించేందుకు మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఇక ఎంపీగా కొనసాగలేను. అవినీతి, మతతత్వం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో…

Read More

వివాదాస్పద మాజీ ఐఏఎస్‌ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌ కు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ నుంచి తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఐఏఎస్‌ (ప్రొబేషన్‌) నిబంధనలు, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.  మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన పూజా ఖేడ్కర్.. ప్రొబేషనరీ కలెక్టర్‌గా పుణేలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో దివ్యాంగుల కోటాలో సివిల్స్‌కు ఎంపికైనట్టు చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసు జారీచేసింది ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు డిబార్ చేసింద చేసింది.  ఈ నిర్ణయాన్ని…

Read More

ప్రకాశం బ్యారేజ్‌ గేట్లను ఢీకొన్ని నాలుగు బోట్లు వైసీపీ నాయకులవేనని మంత్రి కొల్లు  రవీంద్ర అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు సమాచారం ఉందని చెబుతూ ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారని తెలిపారు.  బ్యారేజీని ఢీ కొట్టిన పడవలకు ఎటువంటి అనుమతులు కూడా లేవని తెలుస్తుందని పేర్కొంటూ బ్యారేజీకి జరగరాని డామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేదని,  దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని, లోతయిన దర్యాప్తు జరిపించాలని స్పష్టం చేశారు. పడవల మీద వైసీపీ రంగులే ఉన్నాయి విమర్శించారు.  బుడమేరు వాగులో వైసీపీ నాయకులు ఇసుక, మట్టిని విచ్చలవిడిగా అమ్ముకున్నారని ఆరోపించారు. దానివల్లే గండ్లు తెగి విజయవాడ ముంపునకు గురైందని చెబుతూ మూడు గండ్లు వల్లే విజయవాడ నగరం ముంపునకు గురైందని తెలిపారు. గత నాలుగు రోజులుగా అహర్నిశలు పనిచేసి గండ్లను పూడ్చామని చెప్పారు.…

Read More