వరద విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రెవెన్యూ శాఖకు 750 కోట్ల నష్టం, పశుసంవర్ధక శాఖకు 11.58 కోట్ల నష్టం, మత్స్య శాఖకు 157.86 కోట్ల నష్టం, వ్యవసాయ శాఖకు 301.34 కోట్లు నష్టం, ఉద్యాన శాఖకు 39.95 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొంది. విద్యుత్ శాఖకు 481.28 కోట్లు, ఆర్ అండ్ బీ 2164.5 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా 75.59 కోట్లు, పంచాయతీ రోడ్లు 167.55 కోట్లు, నీటి వనరులు 1568.55 కోట్లు, పురపాలక, అర్బన్ 1160 కోట్లు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్కు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది. మరోవైపు సోమవారం నుంచి మూడ్రోజులపాటు వరద నష్టం అంచనా వేయనున్నట్లు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన…
Author: Editor's Desk, Tattva News
జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొనేంత వరకూ పాకిస్థాన్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోం మంత్రి శనివారంనాడు జమ్మూలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలు చరిత్రాత్మకమని, ఎన్నికల ప్రచారాన్ని ‘వినాయకత చవితి’ రోజున బీజేపీ ప్రారంభించిందని పేర్కొన్నారు. తొలిసారి రెండు జెండాల నీడలో కాకుండా ఒకే జెండా త్రివర్ణ పతాకం కింద ఇక్కడి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పారు. ”ఇద్దరు ప్రధానులు ఉండరు, ఒకరే ప్రధాని. యావద్దేశం ఎన్నుకున్న ప్రధానమంత్రి మన మోదీ. చాలా స్పష్టంగా ఒకమాట చెప్పదలచుకున్నాను. బీజేపీ ఈ ఎన్నికల్లో పూర్తి శక్తిసామర్థ్యాలతో పోరాడుతుంది, గెలుపు సాధిస్తుంది” అని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు స్పష్టమైన సందేశం ఇస్తూ, ఈ ప్రాంతంలో దళితులు, ఇతర కమ్యూనిటీలకు ఇచ్చే రిజర్వేషన్లను కాంగ్రెస్…
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లకల్లోలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ.3,448 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్టు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు, కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది. తెలుగు రాష్ట్రాల్లో సహాయ చర్యలపై ఎక్స్ ద్వారా కేంద్రం వివరాలు వెల్లడించింది. ప్రధాని ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణకు పూర్తి సహకారం అందజేయనున్నట్లు తెలిపింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందం పంపామని, వరదలు, డ్యామ్‌లు, వాటి భద్రతను ఆ బృందం పరిశీలిస్తుందని వెల్లడించింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఏపీలో 26 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 8 వైమానికదళ హెలికాప్టర్లు ఉన్నాయని హోంశాఖ స్పష్టం చేసింది. ఏపీలో…
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 15వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది. ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 16వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి ఒక రోజు ) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 10వ తేదీన కోయిల్…
ఆర్టికల్ 370 ఇక చరిత్రలో ఓ భాగం అని, అది తిరిగి వచ్చే ప్రసక్తి లేదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేల బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణను తోసిపుచ్చారు. జమ్మూ & కాశ్మీర్‌లో తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని.. తీవ్రవాదానికి బాధ్యత వహించేందుకు శ్వేతపత్రం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. “ఒకప్పుడు వేర్పాటువాదం, ఆర్టికల్ 370 నీడలో హురియత్ వంటి సంస్థలు ఉండేవి. వివిధ రాష్ట్ర, జాతీయ నాయకులు దానిని అస్థిరపరిచేందుకు ప్రయత్నించాయి. గత ప్రభుత్వాలు బుజ్జగించే విధానాలను అవలంభిస్తూ వచ్చాయి. కానీ, 2014- 2024 మధ్య జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది” అని తెలిపారు. “స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ మా పార్టీకి చాలా ముఖ్యమైనదని మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతాన్ని భారత్‌తో…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. స్టార్ రెజ్లర్లకు కేసీ వేణుగోపాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పవర్ ఖేరా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్‌భాను పలువురు పాల్గొన్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరిన కొద్దీ సేపటికే పార్టీ విడుదల చేసిన హర్యానాకు సంబంధించి 31 మంది అభ్యర్థుల జాబితాలో ఆమెకు జులనా సీట్ ను కేటాయించారు.కాగా, భజరంగ్ పూనియాను కిసాన్ కాంగ్రెస్ అఖిల భారత వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అంతకు ముందు వినేశ్, బజరంగ్ పునియా ఇద్దరూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు మహేశ్ కుమార్ గౌడ్. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొనసాగుతున్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి మధుయాష్కీ గౌడ్, జీవన్ రెడ్డి, జగ్గా రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్ పోటీ పడ్డారు. కానీ చివరకు రేవంత్‌కు అత్యంత…
ఇండియన్ స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. అందుకు సంబంధించిన ఫొటోను ఆయన భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనతోపాటు తన భర్త రవీంద్ర జడేజా బీజేపీలో సభ్యత్వ నమోదు కార్డు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. 2019లో రివాబా బీజేపీ చేరారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2022లో గుజరాత్‌లోని జామ్ నగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలలో భార్య తరపున జడేజా ప్రచారం చేశారు. ఇక ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ -2024 దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. ఆ కొద్ది గంటకే తాను అంతర్జాతీయ టీ 20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవీంద్ర జడేజా ప్రకటించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని, బాధితులకు సహాయ చర్యలు వేగంగా అందుతున్నాయని చెబుతూ దేశంలోనే తొలిసారిగా విజయవాడలో వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణి చేశారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అభినందించారు. వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు వేగంగా అందిస్తున్నారని చెప్పారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో గురువారం పర్యటించిన ఆయన గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా వరద ప్రాంతాల్లో పర్యటించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ కష్ట సమయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. నష్టం అంచనావేయడం పూర్తయిన తరువాత వీలైనంత త్వరగా సాయం అందిస్తామని తెలిపారు. ఒక్కరోజులో 40 సెంటీమీటర్ల వర్షం కురవడం, బుడమేరు కట్ట తెగడంతో విజయవాడలో…
బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడలోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.. అయితే, ఇప్పుడు కొల్లేరు చేపల చెరువులకు బుడమేరు ముంపు గండం పొంచిఉంది. బుడమేరుకు వరద పెరగటంతో వేల ఎకరాల్లో ఉన్న చెరువులకు ముంపు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరో రెండు అడుగులు వరద పెరిగితే 10 వేల ఎకరాల్లో చెరువులు నీట మునుగుతాయనే భయంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.. ప్పటికే పెనుమాక లంక, నందిగామ లంక, ఇండ్లు పాడు లంక, మనుగులూరు లంకకి రవాణా సంబంధాలు తెగిపోయాయి. వరద ముంపు భయంతో చెరువుల చుట్టూ వలలు కట్టేందుకు నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు. కొల్లేరులో నీటి మట్టం పెరుగుతోంది. కొల్లేరు సరస్సు అంతర్భాగంలో మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉండగా, తమ్మిలేరు, రామిలేరు, బుడమేరు వాగులతోపాటు కఅష్ణ కాలువల్లో భారీ వరద కొల్లేరుకు చేరుతోంది. ఈ నీరంతా నేరుగా ఉప్పుటేరులో కలుస్తుంది. భారీ వరదలతో లంక…