పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఇస్లామాబాద్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటనపై భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. ఇస్లామాబాద్ లోని బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియంట్ ఈ నెల 10న బ్రిటన్ విదేశాంగ శాఖ అధికారితో కలిసి పీవోకేలో పర్యటించారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ ప్రకటన వెలువరించింది. “ఇది భారత్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమే అవుతుందని, ఇది ఆమోదయోగ్యం కాదని, ఎల్లవేళలా భారత్‌లో జమ్ముకశ్మీర్, లద్దాఖ్ సమగ్రభాగాలని ” అని భారత్ స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్‌మోహన్ క్వాత్రా భారత్ లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు తన అసమ్మతిని తెలియజేశారు. బ్రిటన్ హైకమిషనర్ జాన్ మారియట్ ఈనెల 10న పీవోకే లో కేంద్ర స్థానమైన మిర్‌పూర్‌ను సందర్శించారు. “బ్రిటన్, పాకిస్థాన్ పౌరుల మధ్య సంబంధాలకు గుండెకాయ వంటి మిర్పూర్‌కు సలాం. 70 శాతం బ్రిటన్ పాకిస్థానీయుల మూలాలు మిర్పూర్ నుంచే…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణాలో పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని, ఒక నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరుసార్లు హస్తిన వెళ్లారని బిజెపి నేత ఎన్‌విఎస్‌ఎస్. ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యవహారం మాజీ సిఎం కెసిఆర్ తరహాలోనే కనిపిస్తోందని, అధికారంలోకి వచ్చాక గత పాలనపై విచారణ చేపడతామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా ఎలాంటి విచారణకు ఆదేశించలేదని మండిపడ్డారు. గత సిఎం ఫామ్‌హౌస్ నుంచి పరిపాలన చేస్తే, రేవంత్ డిల్లీ నుంచి పాలన కొనసాగిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. లక్షల్లో రేషన్ కార్డులను తొలగించాలానే ప్రయత్నాలు ఈ ప్రభుత్వంలో కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో బస్సులు రాకపోవడం, బస్సులు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రేషన్ కార్డ్ తొలిగించినా ఊరుకునేది లేదని ప్రభాకర్ హెచ్చరించారు. ఉచిత ప్రయాణం హామీకి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. రాష్ట్రంలో…
బిజెపి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు అయిన `ఇండియా’ కూటమి అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఎన్నుకున్నారు. శనివారం జరిగిన ఇండియా వేదిక నేతల వర్చువల్ సమావేశంలో ఖర్గే పేరు ఖరారు చేశారు. కూటమికి సమన్వయకర్తగా బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. అయితే అందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. వర్చువల్ సమావేశంలో నితీశ్‌ను ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీశ్‌ను చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని, అయితే నితీశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతను ఈ పదవికి ఎంపిక చేస్తే బాగుంటుందని నితీశ్ సూచించారని జెడియు జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఝా పాట్నాలో చెప్పారు. నితీశ్ పేరుకు ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు కానీ తాను ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో చర్చిస్తానని ఖర్గే చెప్పారు. వీటితో పాటు…
మహారాష్ట్రలో నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. 21.8 కిలోమీటర్ల పొడవుండే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటీహెచ్‌ఎల్) ముంబైలోని సేవ్రి, రాయగఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతుంది. సుదీర్ఘ దూరం విస్తరించుకుంటూ సాగే ఈ వంతెన ఆద్యంతం రంగురంగుల విద్యద్దీపాల కాంతులతో కనులపండువగా ఉండగా ప్రధాని రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. ఈ సీ బ్రిడ్జిని అటల్ బిహారీ వాజ్‌పేయి సేవ్రీ న్యావా షేవా అటల్ సేతుగా వ్యవహరిస్తారు. దేశంలో అతి పొడవు బ్రిడ్జిగా , సీ బ్రిడ్జిగా దీనికి గుర్తింపు దక్కింది. ఈ బ్రిడ్జిపై ఆరు వరుసలలో ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ పేరుమీదుగా ‘అటల్ సేతు’ అని నామకరణం చేశారు. రెండు పాయింట్ల మధ్య ప్రస్తుతం ఉన్న గంటన్నరగా ఉన్న ప్రయాణ సమయం ఈ వంతెన ద్వారా 20…
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేంద్ర మంత్రులు, ఎంపీలు 21 మందిని అసెంబ్లీకి పోటీచేయించిన బిజెపి నాయకత్వం ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న మంత్రులు, ఇతర కీలక నాయకులను ప్రత్యేక్ష ఎన్నికలలో పోటీచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు తెలుస్తున్నది. తొమ్మిది మంత్రి రాజ్యసభ సభ్యులు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. వారంతా ఇప్పుడు పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లకు వారి సొంత రాష్ట్రమైన తమిళనాడు నుండి పోటీచేసే గెలుపొందే అవకాశాలు లేకపోవడంతో బిజెపికి బలం గల కర్ణాటకలో వారికి సురక్షితమైన సీట్లను బిజెపి అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది. కర్నాటక నుంచి నిర్మల, గుజరాత్ నుంచి జైశంకర్‌లు ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణ కన్నడ స్థానం నుంచి నిర్మలను పోటీలోకి దించాలని భావిస్తున్నారు. కర్నాటక మాజీ అధ్యక్షుడు నలిని కుమార్ కతీల్…
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురు చూస్తోంది.ఈ ప్రాణప్రతిష్ఠకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ రోజు నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని పాటిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక యూట్యూబ్ చానల్‌లో ప్రత్యేక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం లభించడం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘రామాలయ ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే మిగిలి ఉంది. ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండడం నా అదృష్టం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు నుంచి 11 రోజుల ప్రత్యేక ఆరాధన మొదలు పెడుతున్నాను. ప్రస్తుతం నేను ఎంతో ఉద్వేగంతో ఉన్నాను’ అని తెలిపారు. “నా మనసులో తొలిసారి ఇలాంటి భావాలు మెదులుతున్నాయి. దీన్ని వర్ణించడానికి మాటలు చాలవు.…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ ఫిరాయింపులు, రాజీనామాలు మొదలయ్యాయి. తాజాగా, సత్తెనపల్లి నుంచి టిడిపి సీటు ఆశించిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగబాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ స్థానంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు చంద్రబాబు నాయుడు టిక్కెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర నిరాశకు గురైన రంగబాబు టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. తాను సత్తెనపల్లి నుంచి సీటు ఆశించానని, కానీ అది వేరొకరికి కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ కన్నా లక్ష్మీనారాయణకు సీటు ఇస్తున్నట్లుగా కనీసం తమకు మాటమాత్రమైనా చెప్పలేదని వాపోయారు. ఈమేరకు ఆయన తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీలో ఇమడలేనని పేర్కొంటూ రాజీనమానా లేఖను ఆమెదించాలని ఆ లేఖలో కోరారు. ఈ సందర్భంగా టీడీపీ, పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆయన విరుచుకుపడ్డారు. టీడీపీ దిక్కుమాలిన పార్టీ అంటూ…
వికలాంగులు అందరికి సాధారణ ప్రజలలో కనిపించని ప్రత్యేక నైపుణ్యాలు అంతర్లీనంగా ఉంటాయని, వాటిని పెంపొందించుకొనేందుకు వారికి తగు అవకాశాలు కల్పించాలని పలువురు సూచించారు. వికలాంగులలో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా హైదరాబాద్ కొత్తపేటలోని మానస ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ డిజబిలిటీ స్టడీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో మాట్లాడుతూ వికలాంగుల పట్ల ఎటువంటి వివక్షతలు తగవని స్పష్టం చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సభ్యురాలు ఎస్. విజయభారతి మాట్లాడుతూ వికలాంగులు చాలా అమాయకులు, నిజాయితీపరులు, గొప్ప మానవీయ గుణాలు కలిగి ఉంటారని చెప్పారు. వారిలో ఎటువంటి కల్మషం, రాగద్వేషాలు ఉండబోవని స్పష్టం చేస్తూ ప్రభుత్వంతోపాటు వివిధ జాతీయ సంస్థలు వారి హక్కులను గుర్తిస్తున్నాయని చెలిపారు. అన్ని రంగాల్లో వారికి తగు అవకాశాలు…
దేశంలోనే అత్యంత్య పరిశుభ్ర నగరాలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, గుజరాత్‌లోని సూరత్ నిలిచాయి. ఏడేళ్లుగా క్లీన్ సిటీగా అవార్డు దక్కించుకుంటున్న ఇండోర్ ఈ ఏడాది కూడా సూరత్‌తో కలిసి సంయుక్తంగా ఆ బహుమతి అందుకుంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్- 2023 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను బహుకరించారు. నవీ ముంబై అత్యంత్య పరిశుభ్రత నగరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో సస్వాద్, పటాన్, లోనావాలా వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. పరిశుభ్రమైన గంగా పట్టణాల్లో వారణాసి, ప్రయాగ్ రాజ్ ప్రథమ, ద్వితీయ అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్ తర్వాతి స్థానాలలో నిలిచాయి. లక్ష జనాభా పైబడిన నగరాల కేటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ 9వ ర్యాంకును…
అఫ్గాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ విజయంతో ఆరంభించింది. మొహాలీ (పంజాబ్) వేదికగా జరిగిన తొలి టీ20లో అఫ్గాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (20 బంతుల్లో 31, 5 ఫోర్లు), తిలక్ వర్మ (22 బంతుల్లో 26, 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో భారత్ బోణీ చేసింది. 159 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు తొలి ఓవర్లో రెండో బంతికే భారీ షాక్ తాకింది. సమన్వయ లోపం కారణంగా రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు గిల్ స్టంపౌట్ అయ్యాడు. 28 పరుగులకే ఓపెనర్లు పెవివలియన్‌కు చేరడంతో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే.. తిలక్ వర్మలు ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. నబీ వేసిన…