Author: Editor's Desk, Tattva News

ఆర్టెమిస్2 ప్రయోగం ద్వారా ఈ ఏడాది చివర్లో మరోసారి చంద్రుని ఉపరితలం పైకి నలుగురు వ్యోమగాములను పంపడానికి అమెరికాకు చెందిన నాసా సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే . ఇందులో భాగంగా సోమవారం తెల్లవారు జామున లూనార్ ల్యాండర్‌ను నాసా విజయవంతంగా ప్రయోగించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే జాబిల్లి పైకి అమెరికా పెరిగ్రీన్ ల్యాండర్‌ను పంపించడం విశేషం. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ కంపెనీ ఈ పెరిగ్రీన్ ల్యాండర్‌ను రూపొందించింది. ఫ్లోరిడా లోని ప్రయోగ కేంద్రం నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్‌కు చెందిన ‘పల్కన్ ’ రాకెట్ ఈ ల్యాండర్‌ను నింగి లోకి తీసుకెళ్లింది. ఫిబ్రవరి 23న ఇది జాబిల్లి ఉపరితలంపై దిగనుంది. ఈ పెరిగ్రీన్ ల్యాండర్ అనేక సైంటిఫిక్ పరికరాలను మోసుకెళ్లింది. పెరిగ్రీన్‌లో నాసాకు చెందిన మొత్తం 5 పేలోడ్స్ ఉండగా, మిగతా దేశాలకు చెందిన మరో 15 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి జాబిల్లి ఉపరితలంపై…

Read More

ప్రధాని నరేంద్రమోడీపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశ రాయబారికి భారత్‌ సమన్లు జారీచేసింది. సోమవారం ఉదయం ఢిల్లీలోని మాల్దీవుల హై కమిషనర్‌ ఇబ్రహిం శహీద్‌ సౌత్‌బ్లాక్‌లోని విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్‌ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు సామాజిక మాధ్యమాల్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారత్‌, ప్రధాని మోడీపై తమ మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నది. సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు మాల్షా షరీఫ్‌, మరియం షువానా, అబ్దుల్లా మాజిద్‌, ప్రభుత్వ అధికారుల్ని సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ ఎంపీలు భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం…

Read More

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులగా తేలిన 11 మంది ఖైదీలకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. 11 మంది ఖైదీలను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. బిల్కిస్‌ బానోపై 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. వారికి రెమిషన్ మంజూరు చేసిన గుజరాత్ సర్కార్.. వారిని జైలు నుంచి బయటకు విడుదల చేసింది.  అయితే ఈ నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు బిల్కిస్ బానో ఈ కేసులో దోషులుగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని…

Read More

బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న షేక్ హసీనా పార్టీ మరోసారి ఘన విజయం సాధించి మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధం అయింది. వరుసగా నాలుగోసారి షేక్ హసీనా పార్టీ ఎన్నికల్లో విజయం సాధించగా మొత్తంగా ఐదోసారి గెలుపొందింది. ఇక ప్రధాన ప్రతిపక్షంతోపాటు దాని మిత్ర పక్షాలు కూడా ఈ ఎన్నికలను బహిష్కరించి పోటీలో దూరంగా ఉండగా అధికార పార్టీ మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని దక్కించుకుంది. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ మూడింట రెండొంతుల స్థానాలను దక్కించుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం అయిన బీఎన్‌పీ సహా దాని మిత్రపక్షాలు ఈ సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో ఆ పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నాయి.  దీంతో మొత్తం 300 స్థానాలకు గానూ 299 సీట్లకు జరిగిన ఎన్నికల్లో  అవామీ లీగ్‌ 223 సీట్లను సాధించి ఘన…

Read More

భారత వాయుసేన మరో విజయం సాధించింది. అత్యంత కటుతరమైన ప్రాంతాలుండే కార్గిల్ పర్వత ప్రాంతాల వైమానిక మార్గం ఎయిర్‌స్ట్రిప్‌పై తొలిసారి సి 130 జె విమానాన్ని దింపింది. ఈ ల్యాండింగ్ రాత్రివేళ నిర్వహించడం, అందులోనూ భారతీయ వాయుదళ రవాణా యుద్ధ నౌక బాహుబలి సి 130 జె ని రాత్రివేళ ఇక్కడ అత్యంత సురక్షితంగా కిందికి దింపడం దేశ సరిహద్దుల రక్షణ భద్రతా క్రమంలో మైలురాయి అయింది. వాయుసేనకు చెందిన గరుడో కమాండోలు జరిపిన విన్యాసాలలో భాగంగా ఇటీవల జరిగిన ప్రక్రియ విజయవంతం అయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సైనిక విమానానికి నాలుగు టర్బోప్రాప్ ఇంజిన్లు ఉన్నాయి. ఇప్పుడు రాత్రిపూట క్లిష్టమైన ప్రాంతంలో ఈ ల్యాండింగ్‌ను నిర్వహించినట్లు సామాజిక మాధ్యమాలలో వాయుసేన తెలిపింది. మంచు కురిసే సమయం, కన్నుపొడుచుకున్నా కానరాని ప్రాంతంలో టెర్రైన్ మాస్కింగ్‌ను వినియోగించుకుని ఈ విన్యాసం జరిపి విజయం సాధించారు. వాయుసేనకు చెందిన సి 130 జె…

Read More

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై అధ్యయనం చేసేందుకు ఓసారి కేంద్ర ఎన్నికల అధికారుల బృందం పర్యటించగా, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంలో కీలకమైన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)తో పాటు ఇతర కమిషనర్లు కూడా రానున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వారు పర్యటిస్తారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పర్యటించే ఈసీ బృందంలో ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్లుఅనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్, మరికొందరు అధికారులు ఉన్నారు. వీరు ఇవాళ రాష్ట్రానికి చేరుకుని మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేస్తారు. ఇవాళ సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో భేటీ అయి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనున్న ఈసీ బృందం, రేపు రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాల తయారీలో…

Read More

* ట్రెండ్ అవుతున్న `బాయ్‌కాట్ మాల్దీవ్స్’ హ్యాష్‌ట్యాగ్గతేడాది నవంబర్ దాకా భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. అక్కడి అందాల్ని వీక్షించడం కోసం మన భారత్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు వెళ్లేవాళ్లు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలెబ్రిటీల దాకా ఈ మాల్దీవులను సందర్శనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.  కానీ.. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ఎవరైతే నిన్నటిదాకా మాల్దీవుల్ని నెత్తిమీద పెట్టుకున్నారో ఇప్పుడు వాళ్లే దీనిని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమ మాల్దీవుల ట్రిప్‌ని రద్దు చేసుకున్నారు.  సెలెబ్రిటీలు సైతం ఈ ట్రెండ్‌లోకి చేరిపోయి భారత్‌కి మద్దతు ఇస్తున్నారు. దీంతో.. #BoycottMaldives అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అసలు ఎందుకు ఇది ట్రెండింగ్‌గా మారింది.  దానితో నష్టనివారణ చర్యగా మాలీద్వీప్ ప్రభుత్వం ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌‌లో పర్యటించారు. అక్కడ సముద్రం…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తిచేసుకున్న ఎ రేవంత్ రెడ్డి తన తొలి నెలరోజుల పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా డిసెంబర్ 7న తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పాలనకు నేటితో నెల రోజులు పూర్తయ్యాయి.  ఈ నేపథ్యంలో తన నెల రోజుల పాలనను గుర్తు చేస్తూ రేవంత్ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ 30 రోజుల పాలన తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు.  ‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని తెలిపారు. “సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ.. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక వింటూ..…

Read More

గాజా ప్రాంతంపై బాంబు దాడులను ముగించిన తర్వాత ఆ ప్రాంతంలో ఏం చేయాలనే ప్రణాళికలను ఇజ్రాయిల్‌ వెల్లడించింది. ‘విజన్‌ ఫర్‌ ఫేజ్‌ త్రీ’ పేరుతో రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ పంచుకున్న పత్రంలో ఈ వివరాలు వున్నాయి. ఈ ప్రణాళికల వివరాలను ఈ వారంలో ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు యుద్ధ కేబినెట్‌కు అందజేశారు. గాజా స్ట్రిప్‌ పౌర పాలనా యంత్రాంగాన్ని ఇజ్రాయిల్‌ మార్గనిర్దేశకత్వంలో పనిచేసే పాలస్తీనా సంస్థకు అందజేయనున్నట్లు ఆ ప్రణాళిక పేర్కొంది. రోజువారీ పాలనా వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. భద్రతా నియంత్రణ ఇజ్రాయిల్‌ అదుపులో వుంటుంది.  అవసరమైనంత కాలమూ గాజా దక్షిణ ప్రాంతంలో హమాస్‌తో పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉత్తర గాజాలో స్థాయి తగ్గించిన ‘కొత్త పోరాట విధానానికి’ ఇజ్రాయిల్‌ బలగాలు ఏ విధంగా మారతాయో గాలంట్‌ ఆ ప్రణాళికలో వివరించారు.  గాజాలో చర్యలు తీసుకునే హక్కును ఇజ్రాయిల్‌ అట్టిపెట్టుకుంటుంది. అంటే తమకు ఇష్టమైనపుడల్లా బలగాలు వచ్చి వెళ్లే వీలు…

Read More

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’ ను మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో జనవరి 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో కొనసాగి ముంబైలో ముగుస్తుంది. ఈ సందర్భంగా ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’ లోగోను, ట్యాగ్ లైన్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే శనివారం ఆవిష్కరించారు. ఈ యాత్ర ట్యాగ్ లైన్ ను ‘‘న్యాయం అనే హక్కు లభించేవరకు (న్యాయ్ కా హక్ మిల్నే తక్)’’ గా నిర్ణయించారు. ఈ యాత్రలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై దృష్టి సారించనున్నట్లు మల్లికార్జున ఖర్గే తెలిపారు. తన ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’ దేశ ప్రజలందరికీ న్యాయం అనే హక్కు లభించేవరకు కొనసాగుతుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. న్యాయ హక్కు లక్ష్యంగా అన్యాయం, అహంకారాలకు వ్యతిరేకంగా ఈ యాత్ర జరుపుతున్నామని తెలిపారు. న్యాయ హక్కు అనే నినాదంతో…

Read More