Author: Editor's Desk, Tattva News

దేశంలో కరోనా వైరస్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌ కేసులు తాజాగా 600 మార్క్‌ను దాటాయి. జనవరి 4వ తేదీ వరకూ ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా 619కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో జేఎన్‌.1 వైరస్‌ కేసులు బయటపడ్డాయి.  అందులో కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు వెలుగుచూశాయి. ఇక కేరళ, మహారాష్ట్ర రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కేరళలో జేఎన్‌.1 కేసులు 148 నమోదు కాగా, మహారాష్ట్రలో 110 వెలుగుచూశాయి. ఢిల్లీలో 15, గోవాలో 47, గుజరాత్‌లో 36, ఆంధ్రప్రదేశ్‌లో 30, తమిళనాడులో 26, రాజస్థాన్‌లో నాలుగు, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 619 కేసులు నమోదయ్యాయి. మరోవైపు బిఎ2.86 రకానికి చెందిన ఈ జేఎన్‌.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు…

Read More

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విభ‌జ‌న‌ను పూర్తి చేయాల‌ని, ప‌దో షెడ్యూల్ ప‌రిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, ఢిల్లిలోని ఉమ్మడి రాష్ట్ర భ‌వ‌న్ విభ‌జ‌న‌ను సాఫీగా పూర్తి చేయాల‌ని, చ‌ట్టంలో ఎక్కడా పేర్కొన‌కుండా ఉన్న సంస్థలను ఏపీ క్లెయిమ్ చేసుకోవ‌డం విష‌యంపై దృష్టి సారించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ‌లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బ‌లోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో బ‌లోపేతానికి రూ.90 కోట్లు అద‌నంగా కేటాయించాల‌ని కోరారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా ఏపీ ప్రభుత్వం హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌, హైకోర్టు భ‌వ‌నం, లోకాయుక్తా, ఎస్‌హెచ్ఆర్సీ వంటి భ‌వ‌నాల‌ను వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వ‌డ్డీతో క‌లిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాల‌ని అమిత్ షాను సీఎం కోరారు. తెలంగాణకు అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించాల‌ని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి…

Read More

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటనలో పలు అద్భుత వినయాసాలు చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను మోదీ ఆస్వాదించారు. అంతేగాక, సముద్రంలో సాహసోపేతమైన స్నార్కెలింగ్ కూడా చేశారు. సముద్ర గర్భంలోకి వెళ్లి అక్కడి పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు ప్రధాని మోదీ. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో పంచుకున్నారు. మరోవైపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం తన బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి సముద్రం ఒడ్డున సరదాగా సమయాన్ని గడిపారు. అక్కడ బీచ్‌లో కుర్చీ వేసుకొని కాసేపు సేద తీరారు. ఈ సందర్భంగా సముద్రంలో సాహసోపేత డైవింగ్‌ చేశారు. ముఖానికి ట్యూబ్‌, డైవింగ్‌ మాస్క్‌ను ధరించి సముద్రంలోపల ఈత కొట్టారు. ఈ డైవింగ్‌ను ‘స్నోర్కెలింగ్‌’ అని అంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ప్రముఖ సామాజిక మాధ్యమం…

Read More

వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దిన్ ప్రముఖుడు జావెద్ అహ్మద్ మట్టూను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం గురువారం అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్‌లో పలు ఘటనలకు జావెద్ కారకుడు అనే అభియోగాలు ఉన్నాయి. మట్టూ ఢిల్లీలో సంచరిస్తున్నాడనే సమాచారం అందడంతో ప్రత్యేక బృందం కేంద్ర భద్రతా సంస్థల సమన్వయంతో ఈ టెర్రరిస్టును పట్టుకుంది. మట్టూ నుంచి ఓ పిస్టల్ , ఆరు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లో 11 ఉగ్రచర్యలు ఉదంతాలలో జావెద్‌పై వారంటు ఉంది. ఆయనను పట్టుకుంటే రూ పది లక్షల నజరానా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లో ఓ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడ్డ మట్టూ ఏదో విధంగా నేపాల్ తప్పించుకుని వెళ్లాడు. ఎప్పటికప్పుడు పాకిస్థాన్ ఐఎస్‌ఐ నుంచి ఆదేశాలు అందుకుంటూ వ్యవహరిస్తున్న మట్టూ తిరిగి ఢిల్లీకి వస్తున్నట్లు నిఘా సంస్థలకు తెలిసింది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మందుపాతరలు సేకరించుకునేందుకు మట్టూ వస్తున్నట్లు తెలియడంతో నిఘా సంస్థలు ముందుగా అప్రమత్తతో…

Read More

ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం జరగనున్న సందర్భంగా అంతకు ముందుగానే అయోధ్యలో అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని నిర్వహించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. జవనరి 19 నుంచి 21వ తేదీ మధ్యన జరిగే ఈ ఉత్సవం కోసం అయోధ్య అభివృద్ధి సంస్థ(ఎడిఎ) సన్నాహాలు ప్రారంభించింది. గాలిపటాలు ఎగురవేయడంలో నిష్ణాతులైన దేశ విదేశాలకు చెందిన ప్రముఖులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్న ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ ఉత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు దేశ విదేశాలల్లో జరిగిన వివిధ పతంగుల ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నట్లు ప్రకటనలో తెలిపారు. దీని నిర్వహణ కోసం ప్రైవేట్ ఏజెన్సీల నుంచి దరకాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎడిఎ తెలిపింది. జనవరి 8వ తేదీలోగా ఏజెన్సీ నియామక ప్రక్రియ పూర్తి కాగలదని తెలిపింది.  750 మంది సందర్శకులు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు రూపొందిస్తామని, అలాగే 5 మంది ప్రత్యేక ఆహ్వానితుల కోసం…

Read More

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది జనవరి 18. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.  తెలంగాణ శాసనమండలిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.  మరోవంక, త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే ఓటరు జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రులందరూ తమ ఓటు నమోదు…

Read More

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా బదులు తీర్చుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా రెండో టెస్టులో మాత్రం అదరగొట్టింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.  దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 7 వికెట్లు తీసి, విజయంతో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే కుప్ప కూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 153 పరుగులు చేసింది. 98 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఎయిడెన్ మార్‌క్రమ్ సెంచరీతో రాణించడంతో 176 పరుగులు చేసింది. భారత్‌ ముందు…

Read More

* 541కి పెరిగిన జేఎన్‌.1 కేసులు దేశంలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ తరహా కేసులు 12 రాష్ట్రాలకు పాకాయి. జనవరి 3వ తేదీ వరకూ దేశంలో జేఎన్‌.1 కేసులు 541కి పెరిగాయి. ఈ మేరకు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,423కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 775 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,78,047) చేరింది. నిన్న ఒక్కరోజే రెండు మరణాలు నమోదయ్యారు. కేరళలో ఒకరు, కర్ణాటకలో ఒకరు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల…

Read More

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీల సమక్షంలో గురువారం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్‌ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.  నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను న్యాయం చేసే పార్టీ అని వెల్లడించారు.  మల్లికార్జున ఖర్గే షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి  ఆమెను పార్టీలోని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.  అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా హాజరుకాకపోవడం సంచలనంగా మారింది. ఏపీ కాంగ్రెస్ నాయకులు మాత్రం షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉంటే షర్మిల భర్త కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఇష్టపడలేదు. అనంతరం మాట్లాడిన వైఎస్ షర్మిల…

Read More

తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదాని ఏరో స్పేస్ సిఈవో ఆశీష్ రాజ్ వన్షిలు సెక్రటేరియట్‌లో బుధవారం చర్చలు జరిపారు.  పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వనిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందని చెప్పారు.  రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపిందని చెప్పారు. వీటికి సంబంధించిన…

Read More