Author: Editor's Desk, Tattva News

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో టికెట్ల హామీ దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీపీలో చేరారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి, తన సోదరుడు గడికోట సురేంద్రనాథ్ రెడ్డి, పలువురు కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ చేరారు.  వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా టీడీపీలో చేరారు. చంద్రబాబు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కడప జిల్లా రాజంపేట నియోజవకర్గానికి చెందిన సి. రామచంద్రయ్య 1981లో టిడిపి ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. గతంలో రాజ్యసభ సభ్యునిగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశారు.  రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజ నేతగా, సీనియర్ నాయకుడిగా సి.రామచంద్రయ్య పేరుంది. ప్రస్తుతం వైసీపీలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవల వైసీపీ కార్యక్రమాలకు రామచంద్రయ్య దూరంగా ఉంటున్నారు. సి.రామచంద్రయ్య టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎంపీ…

Read More

ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ సమాధి సమీపంలో వరుసగా రెండు పేలుళ్లు జరగడంతో 100 మందికి పైగా మరణించారు. ఈమేరకు దక్షిణ ఇరాన్ లోని కెర్మాన్ లో సాహెబ్ అల్ జమాన్ మసీదు సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానిక మీడియాను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ పేర్కొంది. కెర్మన్ ప్రావిన్స్ రెడ్ క్రెసెంట్ రెస్క్యూ హెడ్ రెజా ఫల్లా స్పందిస్తూ “మా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు క్షతగాత్రులను తరలిస్తున్నాయి. కానీ గుంపులుగా ఉన్న జనం రోడ్లపై ఆటంకాలు ఎదురువుతున్నాయి..’ అని చెప్పారని రాయిటర్స్ వెల్లడించింది. ఖాసిం సులేమానీ సమాధి వద్ద శబ్దం వినిపించిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ నివేదించింది. అయితే పేలుడుకు కారణమేమిటనే దానిపై ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.  పేలుళ్ల అనంతరం జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారని, ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ వర్ధంతి నేపథ్యంలో వేలాది మంది సంతాపం తెలుపుతున్నట్లు ప్రత్యక్ష ప్రసారంలో కనిపించిందని, ఘటనా స్థలంలో అంబులెన్స్‌లు కూడా…

Read More

సంజయ్ సింగ్‌ లేకుండా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) నూతన పాలకవర్గంతో తనకు ఎలాంటి సమస్యలు లేవని రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్‌ 21న బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుడు సంజయ్ సింగ్‌ డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటన వెలువడిన వెంటనే అతనిని వ్యతిరేకిస్తూ సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ మద్దతుదారుల నుండి తన తల్లికి కూడా బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయని ఆమె ఆరోపించారు. తమ కుంటుంబ సభ్యుల్లో ఒకరిపై కేసు కూడా నమోదు చేస్తామని బ్రిజ్‌ భూషణ్‌ గూండాలు బెదిరిస్తున్నారని ఆమె వెల్లడించాయిరు. సోషల్‌మీడియాలోనూ తమను దుర్భాషలాడుతూ పోస్ట్‌లు పెడుతున్నారని చెబుతూఅయితే వారి ఇళ్లల్లోనూ సోదరి, కుమార్తె ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ సింగ్‌ను డబ్ల్యుఎఫ్‌ఐకి దూరంగా ఉంచినట్లైతే నూతన పాలకవర్గంతో తమకు ఎలాంటి సమస్యలు లేవని ఆమె స్పష్టం చేశారు.…

Read More

డబ్బులకు ప్రశ్నలకు సంబంధించిన కేసులో లోక్‌సభ నుంచి బహిష్కరించడంపు టీఎంసీ నేత మహువా మోయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రెండురోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.  ఈ కేసులో విచారణను సుప్రీంకోర్టు మార్చిలో విచారణ జరుపనున్నది. ఇదే సమయంలో, లోక్‌సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మెయిత్రాకు కోర్టు అనుమతి నిరాకరించింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో డబ్బులకు డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగిన కేసులో మహువా మోయిత్రాను లోక్‌సభలో బహిష్కరించిన విషయం తెలిసిందే.  అయితే, తనను తొలగించాలని సిఫారసు చేసిన లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ తగిన సాక్ష్యాలను లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె ఆరోపించారు. మహువా మోయిత్రా పిటిషన్‌లో అనర్హతను సవాల్‌ చేస్తూ ఎథిక్స్‌ కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా లోక్‌సభలో తనను సమర్థించుకునేందుకు అనుమతించలేదని ఆరోపించారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానికి తన పార్లమెంటరీ లాగిన్ వివారాలను షేర్…

Read More

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది. పెండింగ్‌లో ఉన్న రెండు కేసులపై దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని సెబీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.  దర్యాప్తును సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయాలన్న వాదనలకు అర్థం లేదని అభిప్రాయపడింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన 24 ఆరోపణల్లో 22 కేసుల్లో కేసు దర్యాప్తు పూర్తయ్యిందని ధర్మాసనం గుర్తు చేసింది.  ప్రస్తుతం రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై దర్యాప్తును మూడు నెల్లో పూర్తి చేయాలని సెబీకి ఆదేశాలు ఇచ్చింది.  సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్‌ వర్క్‌లో కల్పించుకునేందుకు అధికారం సుప్రీంకోర్టుకు పరిమితంగానే ఉంటుందని తెలిపారు. కోర్టు నియమించిన ప్యానెల్ సిఫారసుల ప్రకారం ప్రభుత్వం, సెబీ నడుచుకోవాలని తేల్చి చెప్పింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా…

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మరోసారి డుమ్మా కొట్టారు. ఈ మేరకు విచారణకు హాజరుకావడం లేదని ఈడీ అధికారులకు కేజ్రీవాల్‌ సమాచారం ఇచ్చారు.  మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికి మూడు సార్లు నోటీసులు ఇచ్చింది.  ఇందులో భాగంగా ఈ నెల 3న (బుధవారం) కేజ్రీవాల్‌ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, తాజాగా తాను విచారణకు హాజరు కావడం లేదని కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈ మేరకు ఈడీ అధికారులకు సమాచారం అందించారు.  దీంతో ఇప్పటికే విచారణకు రెండుసార్లు గైర్హాజరైన సీఎం.. ముచ్చటగా మూడోసారి కూడా డుమ్మా కొట్టారు. వరుసగా నవంబర్‌ 2, డిసెంబర్‌ 21 సమన్లకు ఆయన గైరజరయ్యారు. మరోవైపు ఈడీ సమన్లపై ఆప్‌ తీవ్రంగా స్పందించింది. ఈ నోటీసులు అక్రమమని, తమ సుప్రిమోను అరెస్ట్‌ చేసే ఉద్దేశంతోనే వాటిని ఇచ్చారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అయితే,…

Read More

కేరళలోని శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇటీవలె మండల పూజల ఉత్సవాలు ముగియగా.. మళ్లీ ఆలయాన్ని తెరిచి మకరవిళక్కు ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే శబరిమల అయ్యప్ప ఆలయ వ్యవహారాలు చూసే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.రోజు రోజుకూ శబరిమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు. ఇక మకరజ్యోతి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తారని.. అప్పుడు మరింత కష్టమవుతుందని అందుకే స్పాట్ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 14 వ తేదీన వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 50 వేలకు పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఈనెల 15 వ…

Read More

దేశంలో కరోనా సబ్ వేరియంట్ జెఎన్.1మెల్లమెల్లగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశం మొత్తం మీద 312 కేసులు నమోదయ్యాయి. వీటిలో 47 శాతం కేరళలో నమోదు అయినట్టు ఇన్‌సాకాగ్ డేటా మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. కేరళలో 147,గోవాలో 51,గుజరాత్‌లో 34,మహారాష్ట్రలో 26.తమిళనాడులో 22,ఢిల్లీలో 16. కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5,తెలంగాణలో 2,ఒడిశాలో1 జెఎన్.1 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌లో దేశంలో కరోనా కేసులు 279 నమోదవ్వగా, వాటిలో 33 జెఎన్.1 కేసులు ఉన్నాయని ఇన్‌సాకాగ్ డేటా పేర్కొంది. బీఎ 2.86 రకానికి చెందిన ఈ జెఎన్.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ ముప్పు తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. ఇటీవల జెఎన్.1 కేసులు అనేక దేశాల్లో వ్యాపిస్తున్నాయి. కొవిడ్ కేసులతో పాటు ఈ ఉపరకం కేసులను కూడా నిదానంగా నిరంతర…

Read More

హిట్‌అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన కొత్త చట్టంపై రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డైవర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం కేంద్రంతో కీలక చర్చలు జరిపిన అనంతరం అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని అలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్( ఎఐఎంటిసి) ప్రకటించింది. కొత్త చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను త్వరలోనే ఉపసంహరించుకుంటామని దేశవ్యాప్తంగా ట్రక్కర్ల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అసోసియేషన్ ప్రకటించింది. ‘భారతీయ న్యాయసంహితలోని నిబంధనలపై మేము ప్రభుత్వంతో సమావేశమై చర్చించాం. కొత్త చట్టాలు ఇంకా అమలు కాలేదు. ఎఐఎంయుసితో చర్చించిన తర్వాతే దాన్ని అమలు చేయడం జరుగుతుంది’ అని అసోసియేషన్ కోర్ కమిటీ చైర్మన్ మల్కిత్ సింగ్ చెప్పారు. త్వరలోనే సమ్మె ముగుస్తుందని, డ్రైవర్లందరినీ విధుల్లో చేరాలని కోరినట్లు కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా దీనిపై ఒక ప్రకటన చేశారు. ‘హిట్ అండ్…

Read More

జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మంగళవారం మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. తోంగనోవ్‌పల్ జిల్లా మోరేహ్ జిల్లాలో గాలింపు చర్యలు జరుపుతున్న ఏడుగురు భద్రతా సిబ్బంది ఈ ఘటనలో గాయపడ్డారు. దౌబల్ జిల్లాలో సోమవారం నలుగురు వ్యక్తులు హతులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి కర్ఫూను అమలు చేస్తుండగా తాజా సంఘటన చోటు చేసుకుంది. ఛంవాగ్‌పాయ్ నుంచి నిరాయుధులైన పౌరులను కమెండోలు కిడ్నాప్ చేశారన్న సమాచారంతో గుర్తు తెలియని సాయుధులకు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం రెండు గంటలకు పైగా కాల్పులు చోటు చేసుకున్నాయని కుకీస్ అంబ్రెల్లా గ్రూప్‌కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ వార్తలను తోంగనోప్‌పల్ పోలీస్ సూపరింటెండెంట్ లుయికం లాన్మియో తోసిపుచ్చారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు చోటు చేసుకున్నాయని, గాయపడిన భద్రతా సిబ్బందిలో ఐదుగురిని ఇంఫాల్ లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోనూ , మరో ఇద్దరిని మోరేహ్ లోనూ చేర్చినట్టు…

Read More