కొత్త సంవత్సరం ప్రారంభం వేళ షార్ మరో అరుదైన ఘనత సాధించింది. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ సీ-58 నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. దీని ద్వారా అంతరిక్ష రహస్యాల కోసం ఎక్స్‌ఫోశాట్ రూపకల్పన. టెలిస్కోప్‌లా పనిచేస్తూ ఖగోళంలో బ్లాక్ హోల్స్, పాలపుంతలు, ఎక్స్ రే కిరణాలపై పరిశోధనకి ఉపయోగపడుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున పీఎస్ఎల్వీ సిరీస్‌లో 60వ ప్రయోగం సక్సెస్ అయింది. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ ప్రయోగానికి ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంటడౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు పీఎస్ఎల్వీ సీ-58 నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. కౌంట్ డౌన్ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగనుంది. 418 కిలోలు బరువు ఉండే ఎక్స్‌ఫోశాట్, కేరళ యూనివర్శిటీ విద్యార్ధులు రూపొందించిన విఐవై నానాశాట్‌లని శాస్త్రవేత్తలు…
Author: Editor's Desk, Tattva News
ఉత్తరాఖండ్‌లో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి వెల్లడించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలియజేశారు. బృందావన్‌లో వాత్సల్య గ్రామంలో సాధ్వీరీతాంభర షష్టి పూర్తి మహోత్సవం నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ థామి ఈ ప్రకటన చేశారు. రామభక్తులపై కాల్పులకు బాధ్యులైన వారు అయోధ్యలో ఎప్పటికీ రామాలయాన్ని నిర్మించలేరని ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకుని ధ్వజమెత్తారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్గించే 370ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ రద్దు, ఇవన్నీ ప్రస్తావించారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న లక్షం జనవరి 22 న ప్రతిష్ఠాపన దినోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనబోవడం ద్వారా నెరవేరబోతోందని పేర్కొన్నారు. సాధ్వీ రీతాంభర గురించి ప్రస్తావిస్తూ రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా ఆమె ఉపన్యాసాల ద్వారా తాను స్ఫూర్తి పొందానని, ఆమె దీవెనలు, వాత్సల్యం ప్రజలకు సేవ చేయడం వైపు నడిపించాయని తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీహిల్స్ లో ఆదివారం డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ సీజ్ చేశారు. పంజాబ్ లోని ఓ ప్రముఖ యూనివర్శిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు నవీన్, సాయిలను అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ విక్రయించేందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ లో బ్రౌన్ షుగర్ బయటపడడం ఇదే తొలిసారి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అప్పులు చేసి వాటిని తీర్ ఎక్సైజ్ పోలీసులు 9కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీబీఎస్ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో బైక్ పై ఇద్దరు వచ్చారు. వారి కదలికలపై అనుమానం రావడంతో పోలీసులు వారిని ఆపి…
భారత్ వ్యతిరేక ప్రచారం చేపడుతున్నందుకు తెహ్రీక్-ఏ-హురియత్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిసేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం కింద టీఈహెచ్‌ను చట్ట వ్యతిరేక సంస్ధగా కేంద్రం ప్రకటించింది. ఈ సంస్ధ జమ్ము కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలన నడవాలని కోరుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ సంస్ధకు గతంలో దివంగత వేర్పాటువాద వేత సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించాడు. టీఈహెచ్ భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతూ జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించేందుకు ఉగ్ర కార్యకలాపాలను చేపట్టడం కొనసాగిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. ఉపాచట్టం కింద జమ్మూ కశ్మీర్‌లో తెహ్రీక్-ఎ-హురియత్‌ను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ వ్యక్తి, సంస్ధ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్, లఢక్‌లల్లో ఎలాంటి అశాంతియుత వాతావరణాన్ని తాము…
జనవరి 22న ప్రతి ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఐదు దీపాలు వెలిగించాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మన కి బాత్ 108వ ఎడిషన్ కార్యక్రమాంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 2024 మన దేశానికి ముఖ్యమైనటువంటి సంవత్సరం అని తెలిపారు. రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం జరగాలని 500 ఏండ్లుగా అనేక మంది పోరాటం చేసి.. చాలా మంది చనిపోయారని తెలిపారు. దేశ ప్రజలతోపాటు ప్రపంచంలోని హిందువులందరూ జనవరి 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆరోజు ప్రతి హిందువు ప్రతి ఇంట్లో, ప్రతి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వర్చువల్‌గా శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో ప్రతి హిందువు చూడాలని కోరారు. ప్రతి ఇంట్లో జనవరి 22న ఐదు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు.…
ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి నిలిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సరికొత్త ఆవిష్కరణలతో భారత్ ఇన్నోవేషన్ హబ్‌గా మారిందని పేర్కొంటూ 2015లో 81వ ర్యాంకులో ఉండగా ప్రస్తుతం 40వ స్థానానికి చేరామని సంతోషం వ్యక్తం చేశారు. `ఈ ఏడాది భారత్ నుంచి దరఖాస్తు చేసే పేటేంట్ల సంఖ్య పెరిగింది. దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు అందికీ ప్రేరణగా నిలుస్తాయి.’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఏడాది చివరి ఆదివారం కావడంతో మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశప్రజలందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారడంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తంచేశారు. జీ20 విజయవంతంపై ప్రజలు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘ప్రస్తుతం…
2023 సంవత్సరంలో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో మంచి ఊపు మీద ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో 2024 ఏడాదిని ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే జనవరి 1 వ తేదీనే కీలక ప్రయోగాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పీఎస్‌ఎల్‌వీ-సి58 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్)ను పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. దాంతోపాటు మరో 10 పేలోడ్‌లను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగించనుంది. రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలను ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం నిర్వహించారు. ఇందులో రాకెట్ అనుసంధానం, ఉపగ్రహ అమరిక, పరీక్షలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ పీఎస్ఎల్‌వీ – సీ58 రాకెట్ కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది.…
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని, దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. పేదలకు సొంతిల్లు పేరిట కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.35,141 కోట్ల నిధులను వెచ్చించిందని, ఇందులో భారీగా నిధులు పక్కదారి పట్టాయని ప్రధానికి వ్రాసిన లేఖలో ఆయన ఆరోపించారు. ‘వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29 లక్షల మంది మహిళల పేరుతో పట్టాలిచ్చేందుకు నిర్ణయించినా, 21 లక్షల మందినే లబ్ధిదారులగా గుర్తించింది. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు కాగా, ఈ ఐదేళ్లలో ప్రభుత్వం గృహనిర్మాణాలకు బడ్జెట్‌లో రూ.23,106 కోట్లే కేటాయించిందని పవన్ తెలిపారు. అయితే, అందులోనూ రూ.11,358 కోట్లే మాత్రమే ఖర్చు చేసి రూ.91,503 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతోందని వెల్లడించారు. ‘మొదట…
ప్రముఖ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు జయప్రద చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆమె కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రత్యేకంగా స్పెషల్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అదే సమయంలో మిస్సింగ్ కేసు సైతం ఆమెపై నమోదు కావడం కలకలం రేపుతోంది. జయప్రదపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2019 నాటి ఎన్నికల ప్రచార సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లు ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రామ్‌పూర్ లోక్‌సభ పరిధిలో రోడ్డును ప్రారంభించారు. అలాగే పిప్లియాలో నిర్వహించిన బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదివరకే ఆమెకు న్యాయస్థానం సమన్లనూ జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు రామ్‌పూర్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో ఆమె రెండుసార్లూ విచారణకు హాజరు కాకపోవడంతో జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.…
వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు వెళ్లేది నిజమైతే తానూ ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి తాను ఎంతో సేవ చేసానని, తాను సర్వస్వం పోగొట్టుకున్నానని చెప్పారు. తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానని పేర్కొంటూ తాను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని స్పష్టం చేశారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెబుతూ రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.120 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని విచారం వ్యక్తం చేశారు. అయినా, 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించానని తెలిపారు. మంగళగిరి అభివృద్ధికి కొన్ని పనులు జరిగినా నిధులు విడుదల కాలేదని, కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తేవడంతో తాను సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగానని, స్వయంగా తానే 8కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు…