Author: Editor's Desk, Tattva News

ప్ర‌ధాని నరేంద్ర మోదీ శనివారం అయోధ్యలో ఇటీవ‌ల అభివృద్ధి  చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేష‌న్‌ను, నూతనంగా నిర్మించిన వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లను ప్రారంభించారు. తొలుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ ఘనంగా స్వాగతం పలకగా, ప్రధాని రోడ్ షో జరిపారు.  సుమారు రూ. 240 కోట్ల ఖ‌ర్చుతో అయోధ్య రైల్వే స్టేష‌న్‌ను రీడెవ‌ల‌ప్ చేశారు. మూడు అంత‌స్థుల్లో నిర్మించిన ఈ స్టేష‌న్‌లో అన్ని ఆధునిక సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేశారు. లిఫ్ట్‌లు, ఎస్క‌లేట‌ర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజా సామాగ్రి షాపులు, క్లోక్ రూమ్‌లు, చైల్డ్ కేర్ రూమ్‌లు, వెయిటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. కొత్త‌గా నిర్మించిన అయోధ్య స్టేష‌న్‌కు ఐజీబీసీ గ్రీన్ స్టేష‌న్ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ కొత్త గా వ‌స్తున్న అమృత్ భార‌త్ రైలు ఎక్కారు. ఆ రైలులో ఉన్న విద్యార్థుల‌తో ఆయ‌న ముచ్చ‌టించారు. అమృత్ భార‌త్‌, వందేభార‌త్ రైళ్ల‌కు ప‌చ్చ‌జెండా…

Read More

అసోంలో శాంతియుత వాతావరణం నెలకొల్పే ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన సాయుధ వేర్పాటు వాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా)తో దీర్ఘకాలంగా ప్రభుత్వం జరుపుతున్న చర్చలు ఫలించాయి. ఈ క్రమంలో ఉల్ఫా, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక శాంతి ఒప్పందంపై శుక్రవారం సంతకాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో పాటుగా ఉల్ఫా ప్రతినిధులు పాల్గొన్నారు. అసోం ప్రజలకు ఇది గొప్ప రోజని ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఉల్ఫా హింసాకాండ కారణంగా అసోం దీర్ఘకాలంగా ఎంతో నష్టపోయిందని, 1979 నుంచి ఈ హింస కారణంగా 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. హింసను విడనాడడానికి, సంస్థను రద్దు చేయడానికి,ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలు పంచుకోవడానికి ఉల్ఫా అంగీకరించిందని షా చెప్పారు. ఒప్పందంలో భాంగా…

Read More

పైకప్పుపై గోపురం, శ్రీరామచంద్రుడికి చెందిన ధనుస్సు, బాణం ..శనివారం ప్రారంభం కానున్న అయోధ్యలోని కొత్త రైల్వే స్టేషన్ ఆలయ నిర్మాణ శైలిలో అద్భుతంగా రూపుదిద్దుకుంది. శనివారం అయోధ్యను సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేసిన అయోధ్య జంక్షన్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అయోధ్య రైల్వే జంక్షన్‌ను అయోధ్య ధామ్ జంక్షన్‌గా పేరు మార్చినట్లు స్థానిక ఎంపి లల్లూ సింగ్ వెల్లడించారు. పాత రైల్వే స్టేషన్ భవనాన్ని ఆనుకునే కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం జరుపుకుంది. అయోధ్య జిల్లాలో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి అయోధ్య నగరంలో ఉన్న అయోధ్య జంక్షన్ కాగా మరొకటి ఫైజాబాద్ నగరంలోని అయోధ్య కంటోన్మెంట్ (పూర్వ ఫైజాబాద్ జంక్షన్). గతంలో ఈ రెండు స్టేషన్ల మధ్య తేడా తెలియక ప్రజలు గందరగోళం చెందేవారు. ఇప్పుడు ఇక ఆ గందరగోళం అవసరం లేదు. పవిత్ర అయోధ్య నగరానికి సమీపంలో ఉన్న స్టేషన్‌ను అయోధ్య ధామ్‌గా వారు తెలుసుకుంటారు.…

Read More

దేశంలో త్వరలోనే పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ఎప్రిల్, లేదా మే నెలలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో కేంద్రం వినియోగారుల ప్రసన్న మంత్రానికి దిగనుంది. ఇంధన ధరలు ఓ మోస్తరు నుంచి భారీ స్థాయిలోనే తగ్గుతాయని భావిస్తున్నారు. పెట్రో ధరల తగ్గింపు విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వ్యయ గణాంకాల విశ్లేషణలో పడింది. కేంద్ర కేబినెట్ నుంచి ఆమోదందక్కితే ధరల తగ్గుదలకు మార్గం సుగమం అవుతుంది. జనవరి మధ్యలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుని ప్రకటనను భారీ ప్రచార ఆర్బాటంతో వెలువరించేందుకు వీలుంది. ఇటీవల వెలువడ్డ కేంద్ర ప్రభుత్వ కీలక అంతర్గత నివేదిక మేరకు ఇంధన ధరలకు కళ్లెం వేస్తారని వెల్లడైంది. అయితే దీని విషయంలో ఇప్పటికైతే అధికారికంగా ప్రభుత్వ వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రష్యా ఉక్రెయిన్ యద్ధం తరువాత…

Read More

ఇన్‌స్టాగ్రామ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫాలోవర్ల సంఖ్య కోటిని దాటిపోయింది. క్రిమినల్ కోడ్, చట్టాలను ప్రక్షాళన చేస్తూ తీసుకువచ్చిన మూడు బిల్లులతో పాటుగా కొన్ని చరిత్రాత్మక బిల్లులకు పార్లమెంటు ఇటీవల ఆమోదం తెలిపిన తర్వాత అమిత్ షా ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరైన అమిత్ షాకు ఎక్స్(గతంలో ట్విట్టర్)లో 34.1 మిలియన్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 10.7 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నారు. సోషల్ మీడియాలో అత్యధికంగా కనిపించే ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఫేస్‌బుక్‌లో 6.8 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 5.1 మిలియన్లు, ఎక్స్‌లో 24.7 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని కూడా వారు గుర్తు చేస్తున్నారు. 2014లో నరేంద్ర…

Read More

కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయని, వీటిపై న్యాయ విచారణ జరుపుతామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ స్పందించలేదని నిర్మించారు.  కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. శుక్రవారం మధ్యాహ్నం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతం నుంచి తాము చెబుతూ వచ్చిన విషయాలే నిజమయ్యాయని, త్వరలో ఇందులో అవకతవకలపై న్యాయ విచారణ చేపడతామని మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాజకీయ మతలబులతో ప్రాజెక్టుతో ఆదాయం ఎక్కువ చూపారని,…

Read More

`రెడ్‌ బుక్‌’ వ్యాఖ్యలపై టిడిపి నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. రెడ్‌ బుక్‌ పేరుతో నారా లోకేష్‌ బెదిరిస్తున్నారంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించిన సీఐడీ అధికారులు కోర్టు సూచనల మేరకు లోకేశ్ కు నోటీసులు పంపారు. వాట్సాప్ ద్వారా నోటీసులు పంపగా అందినట్లు లోకేశ్ సమాధానం ఇచ్చారు. లోకేష్ ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఇటీవలే ఏపీ సీఐడీ  విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇచ్చిన 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది. ఈ మేరకు ఇటీవలే లోకేశ్ చేసిన రెడ్ బుక్ వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది సీఐడీ.  చంద్రబాబు కేసుకు సంబంధించి రెడ్‌బుక్‌ పేరుతో దర్యాప్తు అధికారులను లోకేశ్ బెదిరించే విధంగా వ్యవహరించారని తెలిపిన సీఐడీ దర్యాప్తు అధికారులను జైలుకి పంపిస్తామని చేసిన ప్రకటనలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. రెడ్‌బుక్‌ పేరుతో…

Read More

గాజాలో అయిదు లక్షల మంది కంటే ఎక్కువ మంది అంటే జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ఆకలితో అలమటిస్తున్నారు. అక్టోబర్‌ 7 నుంచి గాజాపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న బాంబు దాడులు, ముట్టడి అక్కడ మానవతా సంక్షోభాన్ని ఎత్తి చూపుతోంది. పాలస్తీనియన్ల మరణాల సంఖ్య ఇప్పుడు 20,000కి చేరుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  నివేదికలోని గణాంకాల ప్రకారం, ఇటీవలి సంవత్సరాలలో ఆఫ్ఘనిస్తాన్‌, యెమెన్‌లలోని క్షామం కన్నా ఇది తీవ్రమైనది. కరువు ప్రమాదం ”ప్రతిరోజూ పెరుగుతోంది” అని నివేదిక హెచ్చరించింది, గాజాలోకి తగినంత సహాయం అందకపోవడంతో ఆకలి రక్కసి కోరలు చాస్తోంది. ఇది మరింత దిగజారే ప్రమాదముందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రధాన ఆర్థికవేత్త ఆరిఫ్‌ హుస్సేన్‌ హెచ్చరించారు. గాజాలో ఇంత దారుణమైన మానవీయ సంక్షోభాన్ని ఇదివరకెన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. యుద్ధం కారణంగా గూడు చెదిరిన పక్షుల్లా వలస బాట పట్టిన అయా బర్బఖ్‌, తాను ప్రతిరోజూ…

Read More

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లకు పైగా సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ శ్రేణులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ పర్యటనకు గురువారం వచ్చిన అమిత్ షా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కలార్లో ఉన్న శ్లోక కన్వెక్షన్లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో మండల అధ్యక్షుడి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తూ  ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేస్తే దేశంలో 400 పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ తెలంగాణాలో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని, అయితే ఈ ఎన్నికల్లో 8 సీట్లు సాధించామని హర్షం వ్యక్తం చేశారు.  వచ్చే ఎన్నికల్లో…

Read More

దేశంలో అనేక రంగాలలో ఓబిసిలు, దళితులు, గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారిలోకి వస్తే కుల గణన చేపడతామని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం మహారాష్ట్రలోని నాగపూర్‌లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హమ్ తయార్ హై పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన హుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. నాగపూర్‌లోనే ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న విషయాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ నాగపూర్‌లో రెండు సిద్ధాంతాలు ఉన్నయాని, ఒకటి బిఆర్ అంబేద్కర్‌కు చెందిన అభ్యుదయ సిద్ధాంతమైతే మరొకటి దేశాన్ని నాశనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమని విమర్శించారు. అంబేద్కర్ తన అనుచరులతో కలసి బౌద్ధమతాన్ని స్కీరించిన దీక్షాభూమి నాగపూర్ కావడం విశేషం. సామాన్యుడి చేతికి అధికారం ఇవ్వడమే కాంగ్రెస్ సిద్ధాంతమని ఆయన వెల్లడించారు. దేశంలో కొట్లాది మంది ప్రజలను…

Read More