Author: Editor's Desk, Tattva News

గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో ఖతార్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారతీయులకు ఉపశమనం లభించింది. వారికి విధించిన మరణశిక్షలను ఖతార్ కోర్టు సవరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. అయితే వారికి ఎన్నేళ్ల శిక్ష విధించారనే దానిపై స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదని, దీనిపై ఖతర్ అధికారులతో సంప్రదిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఖతర్ కోర్టులో ఈ తీర్పు ఇస్తున్న సమయంలో నిందితుల కుటుంబ సభ్యులతో పాటుగా ఖతర్‌లో మన రాయబారి కూడా ఉన్నారని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయబృందంతోను చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. కాగా ఖతర్‌లోని ప్రైవేటు కంపెనీ దహ్రా గ్లోబల్ లో పని చేస్తున్న భారత నేవీ మాజీ కమాండర్లు పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్‌పాల్, సంజీవ్ గుప్తా, మాజీ నేవీ కెప్టెన్లు నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర…

Read More

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్‌ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.  అనంతరం క్రికెటర్‌ అంబటి రాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందని చెప్పారు.  మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ గతంలో చాలా ఆరోపణలు చేశారని, ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ…

Read More

ఎన్నారై వ్యాపారవేత్త సీసీ థంపీపై గతంలో నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేరును తాజాగా ఈడీ చేర్చింది. గతంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరును ఈ కేసులో చేర్చిన ఈడీ ఇప్పుడు ప్రియాంక పేరును కూడా కేసులో ప్రస్తావించింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమి కొనుగోలు చేశారని, వారు ఎన్నారై సీసీ థంపీకి భూమికి విక్రయించారని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రియాంకకూ, థంపీకి వ్యాపార బంధం ఉందని ఆరోపించింది.  ఈ కేసులో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో పాటు థంపీ, బ్రిటీష్ జాతీయుడు సుమిత్ చద్దా కూడా నిందితులుగా ఉన్నారు.ఈడీ గత నెలలో దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ లో ప్రియాంక, థంపీ ఇద్దరికీ ఆస్తులు విక్రయించిన ఎస్టేట్…

Read More

దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. గురువారం ఉదయం కూడా ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. రహదారులపై దృశ్యమానత దాదాపుగా సున్నాకి పడిపోయింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయాయి.  నగరంలో ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో ఢిల్లీలో తీవ్ర స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. దట్టమైన పొగమంచు, తక్కువ దృశ్యమానత కారణంగా కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉత్తర భారతదేశం మొత్తం చలి గాలులు వీస్తున్నాయి.  ఢిల్లీలో దట్టమైన పొగమంచు ఏర్పడడాన్ని స్థానిక వాతావరణ విభాగం ధృవీకరించింది. పొగమంచు ఏర్పడడానికి పరిస్థితులు ఇంకా అనుకూలంగా ఉన్నందును డిసెంబర్ 29 వరకు ఉపశమనం లభించే అవకాశాలు లేవని పేర్కొంది. డిసెంబర్ 31 లేదా 1 నుంచి ఉత్తర భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని దీంతో అప్పుడు పొగమంచు నుంచి…

Read More

డీఎండీకే వ్యవస్థాపక నేత, ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ (71) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. కెప్టెన్ విజయకాంత్ న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిన తర్వాత వెంటిలేటర్‌పై ఉన్నారని ఎంఐఓటీ ఆసుపత్రి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వైద్య సిబ్బంది ఎంతగా శ్రమించినా ఫలితం దక్కలేదని, ఈ ఉదయం కన్నుమూశారని పేర్కొంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గతంలో కూడా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం మళ్లీ ఆయన కరోనా సోకడంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో మళ్లీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. 2020 సెప్టెంబర్ లో విజయ్ కాంత్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్ఐఓటి ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇక తర్వాత 2018వ తేదీన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే ఆసుపత్రిలో చేరిన ఆయన అనంతరం ఆరోగ్యం మెరుగు పడడంతో 11వ తేదీన…

Read More

సింగరేణిలో ఎర్ర జెండా రెపరెపలాడింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి కార్మికులు పట్టం కట్టారు. ఏఐటీయూసీ అనుబంధ ‘సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌’ను కార్మికులు తమ గుర్తింపు సంఘంగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీపై వామపక్ష అనుబంధ ఏఐటీయూసీ కార్మిక సంఘం దాదాపు 3 వేల ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. సింగరేణిలో మొత్తం 11 ఏరియాలలో 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్‌ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ గెలుపొందాయి. ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి…

Read More

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, విశాఖపట్నం నాయకుడు చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్.. జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు.  పవన్ కళ్యాణ్ వారికి జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్‌తో తనకున్న అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు యువరాజ్యం విభాగం తరఫున వంశీకృష్ణ యాదవ్‌ తనతో కలిసి పనిచేశారని, కలిసి రాజకీయ ప్రయాణ చేశారని చెప్పారు.  అలాంటి వంశీకృష్ణ తిరిగి జనసేనలోకి రావడం సొంత ఇంటికి రావడం లాంటిదేనని చెబుతూ  ఇది ఆరంభం మాత్రమేనన్న పవన్ కళ్యాణ్.. భవిష్యత్తులో తమ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే జనసేన పార్టీ లక్ష్యం. ఉన్నతమైన దశలో రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రక్రియలో జనసేన పార్టీ కీలక…

Read More

అర్హులైన వారందరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏయే కార్యక్రమాలు చేస్తోంది? ఏయే పథకాలను అమలు చేస్తున్నారనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రచార రథాలు ఊరూరా తిరుగుతున్నాయని చెప్పారు. ఈ యాత్ర సందర్భంగా వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అర్హులైన వారంతా ఆయా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా చింతకుంటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన ఉందా? లేదా? లబ్దిదారులున్నారా? లేరా? ఏయే అభివ్రుద్ధి పనులు చేస్తున్నారనే అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్, జీరో అకౌంట్, సుకన్య సమ్రుద్ధి యోజన, ముద్ర రుణాలపై అధికారులు…

Read More

రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఎగ‌బాకుతుండ‌టంతో ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు సాగిస్తోంది. కిలో రూ. 25కే డిస్కౌంట్ ధ‌ర‌తో భార‌త్ రైస్‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. గోధుమ పిండి, ప‌ప్పుధాన్యాల‌ను భార‌త్ ఆటా, భార‌త్ దాల్ పేరిట డిస్కౌంట్ ధ‌ర‌ల‌కు ప్ర‌జ‌ల‌కు కేంద్రం ఇప్ప‌టికే అందిస్తోంది. ఈ క్ర‌మంలో భార‌త్ రైస్‌ను కూడా డిస్కౌంట్ ధ‌ర‌కు నాఫెడ్‌, ఎన్సీసీఎఫ్‌, కేంద్ర‌య భండార్ అవుట్‌లెట్స్‌, మొబైల్ వ్యాన్స్ వంటి ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారా అందుబాటులోకి తీసుకురావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. బియ్యం ధ‌ర‌లు స‌గ‌టున కిలోకు రూ. 44కు చేర‌డంతో ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డి దిశ‌గా కేంద్రం భార‌త్ రైస్ పంపిణీకి చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇక ఇప్ప‌టికే ప్ర‌భుత్వం భార‌త్ ఆటా పేరిట కిలో రూ. 27.50కి, శ‌న‌గ పప్పును రూ. 60కి అందిస్తోంది. ఈ ఉత్ప‌త్తుల‌ను ఏకంగా 2000కుపైగా రిటైల్ పాయింట్స్‌లో…

Read More

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ మరోయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో విడతలో ‘భారత్‌ న్యాయ యాత్ర’ పేరుతో 14 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముగియనుంది.  మణిపూర్‌ నుంచి ముంబై వరకూ సుమారు 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. భారత్‌ న్యాయ యాత్రను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు.  జోడో యాత్రకు కొనసాగింపుగా చేపడుతున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ బస్సులో చేస్తారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.  ఆయా ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారని కాంగ్రెస్ పేర్కొంది. తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేపట్టాలన్న ప్రతిపాదనలపై పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చించి ఈ యాత్రకు రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఈ యాత్రలో…

Read More