Author: Editor's Desk, Tattva News

అంతర్జాలంలో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. ఆయన యూట్యూబ్‌ ఛానల్‌లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య రెండు కోట్లు దాటింది. మంగళవారం ఈ అరుదైన రికార్డును నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు అత్యధిక సంఖ్యలో మోడీకి యూట్యూబ్‌ ఖాతాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రధాని తన వీడియోలను తరచూ పోస్టు చేస్తుంటారు. ఆ వీడియోలను సుమారు 450 కోట్ల మంది ఇప్పటికే వీక్షించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నరేంద్ర మోదీ రెండు కోట్ల మంది సబ్ స్క్రైబర్ లను పొంది ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి నేతగా చరిత్రలో నిలిచారు. నరేంద్ర మోదీ  యూట్యూబ్ ఛానల్ వ్యూస్ సబ్స్క్రైబర్ల విషయంలో భారతీయ భౌగోళిక సమకాలీన నేతలందరినీ అధిగమించి అత్యధికంగా సబ్స్క్రైబర్లు ఉన్న చానల్ గా ఘనత సాధించింది. వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబర్ల సంఖ్య రెండు కోట్లకు చేరుకున్న తొలి ప్రపంచ నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ …

Read More

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వంపై వలంటీర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని, తమను పొరుగు సేవల ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆందోళన బాట పట్టారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించారు. సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 28 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. తమ సర్వీసును క్రమబద్ధీకరణ చేయాలని, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాదిరి తమనూ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వలంటీర్లు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చడంలో తాము కీలకపాత్ర పోషిస్తున్నామన్నారు. కరోనా విపత్కర సమయంలో సైతం తాము ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుండి ప్రజలకు సేవలు అందించామని తెలిపారు. ఇన్ని సేవలు చేస్తోన్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా…

Read More

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా విభ‌జ‌న హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బ‌కాయిల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం కోసం.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. ఆ విభజన హామీలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రధానిని కోరినట్టు చెప్పుకొచ్చారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరినట్టు భట్టి వివరించారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు…

Read More

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతున్నామని చెబుతూ తెలంగాణలో ఈ సారి డబల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా ఓట్లు మాత్రం పెరిగాయని ఆయన తెలిపారు. దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ అధికారం సాధించిందని గుర్తుచేశారు.  ‘పార్లమెంటు ఎన్నికలపై జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. మంగళవారం రంగారెడ్డి, బుధవారం హైదరాబాద్‌ పార్లమెంటు స్థానాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. . మండల కమిటీల పటిష్టానికి జనవరిలో కార్యాచర్యణ ప్రణాళిక రూపొందిస్తాము’ అని చెప్పారు.  హైదరాబాద్‌లో ఈ నెల 28న జరిగే విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్…

Read More

2023లో ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 11 దేశాల్లో పర్యటించారు. ప్రపంచ దేశాల్లో ప్రబల ఆర్థిక శక్తులుగా ఉన్న దాదాపు అన్ని దేశాల్లో 2023 లో ఆయన పర్యటించారు. జపాన్ లోని హిరోషిమాలో 2023 మే లో జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు.  ఆ సమావేశం అనంతరం ప్రధాని మోదీ పపువా న్యూ గినియా కు వెళ్లారు. అక్కడ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపీఐసీ-3) 3వ సదస్సుకు అధ్యక్షత వహించారు. పపువా న్యూ గినియా నుంచి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించారు. సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో కలిసి ప్రధాని మోదీ స్థానిక భారతీయులతో సమావేశమయ్యారు. అంతేకాక, అక్కడి హారిస్ పార్క్ ప్రాంతాన్ని ‘లిటిల్ ఇండియా’గా గుర్తించనున్నట్లు ప్రకటించారు. ఈ మూడు దేశాల పర్యటనను ప్రధాని మోదీ మే 19 వ తేదీ…

Read More

పాకిస్థాన్ లో 2024లో జరగనున్న ఎన్నికల్లో జనరల్ స్థానానికి ఓ హిందూ మహిళ నామినేషన్ దాఖలు చేసింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునేర్ జిల్లాలోని పీకే-25 జనరల్ స్థానానికి డా. సవీరా ప్రకాశ్ 23న  అధికారికంగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జనరల్‌ ఎన్నికల్లో పోటీచేస్తున్న తొలి మహిళగా రికార్డుల్లో నిలిచారు. పాకిస్థాన్ లోని 16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.  ఎన్నికల సంఘం (ఈసీపీ) ఇటీవల చేసిన సవరణల ప్రకారం జనరల్ సీట్లలో ఐదు శాతం మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. పాకిస్థాన్ లోని హిందూ కమ్యూనిటీకి చెందిన సవీరా ప్రకాశ్ సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన తొలి మహిళా అభ్యర్థి. 35 ఏండ్ల డాక్టర్‌ సవీరా ప్రకాశ్‌ అబోట్టాబాద్‌ ఇంటర్నేషనల్‌ మెడికల్‌ కాలేజీ నుంచి 2022లో ఎంబీబీఎస్‌ పట్టా అందుకున్నారు. అమె తండ్రి…

Read More

గత రెండు వారాలుగా క్రమంగా మరోసారి కరోనా కేసులు దేశంలో పెరుగుతూ ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ఇతర అనారోగ్య సమస్యలతో ఇటీవల అతడు ఆసుపత్రిలో చేరగా.. డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో అతడికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.  అప్పటి నుంచి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తుండగా.. తాజాగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తెలంగాణలో ఈ ఏడాదిలోనే తొలి కరోనా మరణం నమోదైంది. అదే ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా సోకిన్నట్లు వైద్య పరీక్షలు వెల్లడించాయి.  అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో  ఈ ఏడాదిలో తొలి కరోనా మరణం మంగళవారం నమోదయ్యింది. కరోనాతో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)‌లో చికిత్స పొందుతూ ఓ మహిళ…

Read More

ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా కాలేజీ గ్రౌండ్ లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులతో కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. సీఎం జగన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ నేటి నుంచి 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుందని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా చరిత్రలో నిలబడిపోతుందని చెప్పారు.  రెండు ప్రధానమైన ఉద్దేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన్నట్లు వెల్లడించారు.  “ప్రతి ఊరిలో జరిగే ఈ కార్యక్రమం వ్యాయామం, స్పోర్ట్స్‌ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయంపై…

Read More

ప్రతీ ఏటా క్రిస్మస్‌ రోజున యావత్తు ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చే పోప్‌ ఫ్రాన్సిన్‌ ఈసారి యుద్ధాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. గాజాపై ఇజ్రాయిల్‌ పాల్పడుతున్న కనికరం లేని దాడులను ‘పవిత్రభూమిలో పనికిమాలిన యుద్ధంగా’ విమర్శించారు. యుద్ధాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.  వలస వచ్చిన ప్రజల హక్కులను సమర్థించారు.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌, సిరియా, యెమెన్‌, లెబనాన్‌, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ వంటి ప్రాంతాల్లో సాగుతున్న రాజకీయ, సామాజిక, సైనిక వివాదాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. గాజాతో సహా వివిధ యుద్ధాల్లో చనిపోతున్న చిన్నారులను ‘నేటి బాల యేసులు’గా పోప్‌ అభివర్ణించారు. క్రిస్మస్‌ రోజున వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా సెంట్రల్‌ బాల్కనీ నుంచి అక్కడ కింద వున్న స్క్వేర్‌లో గుమిగూడి ఉన్న వేలాది మంది ప్రజలను ఉద్దేశించి పోప్‌ ‘ఉర్బి ఎట్‌ ఓర్బి’ (నగరం, ప్రపంచానికి సందేశం) ప్రసంగం చేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.  సోమవారం ప్రసంగంలో ఆయుధ పరిశ్రమలపై…

Read More

తెలంగాణ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న డా. తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుట్లు తెలుస్తున్నది. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. మంగళవారం గవర్నర్ జరుపుతున్న ఢిల్లీ పర్యటన సహితం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకొనేందుకు అని ప్రచారం జరుగుతుంది.  ఈ పర్యటనలో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తన ఎంపీ అభ్యర్థిత్వంపై ఆమె అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి పోటీకి ఆమె సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన…

Read More