Author: Editor's Desk, Tattva News

ఆంధ్ర ప్రదేశ్ లో వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతోంది. పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తిస్తున్న అధికారులు గుర్తించారు. ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల కేసుల సంఖ్య గోప్యంగా ఉంటోంది.  వైరస్ లక్షణాలు కనిపించిన తర్వాత జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీంతో వాస్తవ కేసుల సంఖ్య తెలియడం లేదు.  రాష్ట్రంలో గత 24 గంటల్లోనే అనకాపల్లి జిల్లాలో మూడు కరోనా కేసులు, విశాఖ జిల్లాలో రెండు, శ్రీకాకుళం జిల్లాలో ఓ కేసు నమోదైంది. వీటితో కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం 29 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.  అయితే అనధికారికంగా కరోనా లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్న వారు, ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా వాస్తవ పరిస్ధితి అర్ధం…

Read More

త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న 2 వేల కొత్త బస్సుల్లో పురుషులకు ప్రత్యేకంగా సీట్లను రిజర్వ్ చేయించడంతో పాటు మహిళలకు మరిన్ని బస్సులను ఏర్పాటు చేయాలని టిఎస్ ఆర్టీసి భావిస్తున్నట్టుగా తెలిసింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఇటీవల మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.  దీంతో బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ కారణంగా పురుషులకు సీట్లు దొరక్కపోవడంతో నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. కనీసం నిలబడే జాగా ఉండడం లేదని పురుషులు ఆర్టీసి అధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆర్టీసిపై ఒత్తిడి పెరిగింది.  ఒకప్పుడు మహిళలకు ఆర్టీసి బస్సుల్లో రిజర్వ్ చేసిన సీట్లు ఇప్పుడు పురుషులకు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంనే ఆర్టీసి బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తున్నట్టుగా సమాచారం.  మహిళా ప్రయాణికులతో పాటు పురుషులు సైతం ముఖ్యమని, పురుషులు డబ్బులిచ్చి టికెట్ కొనడం…

Read More

కేరళలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం శబరిమలలో భక్తుల సందడి కొనసాగుతుంది. ఇసుకేస్తే రాలనంత మంది జనం కేరళ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు చేరుకుంటున్నారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శిచుకోవటానికి వచ్చిన భక్తులతో శబరి గిరులు కిటకిటలాడుతున్నాయి. ఇరుముడి సమర్పించేందుకు సమయం దగ్గర పడుతుండడంతో మరింత మంది భక్తులు వస్తున్నారు. దీంతో శబరిమల ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ నుంచి భక్తుల రాక భారీగా ఉన్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మాలధారులు శబరిమలకు చేరుకుంటున్నారు. రద్దీ దృష్ట్యా కొందరు భక్తులు, అయ్యప్ప మాలధారులు స్వామివారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. ఎరుమేలిలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు, స్వాములు కాలినడకనే శబరిమలకు వెళ్తున్నారు. ఆదివారం ఒక్కరోజే శబరిమలలో అయ్యప్ప స్వామిని ఒక లక్ష 969 మంది అయ్యప్ప భక్తులు దర్శించుకున్నారు. గత పది రోజులుగా చూసుకుంటే ఆదివారం రోజు…

Read More

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. నేటి ఉదయం నుంచి విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. భారీ పొగమంచుతో జగ్గయ్యపేట వద్ద వాహనాలు నిలిచిపోయాయి. చెన్నై-కలకత్తా హైవేపై కూడా పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం అవుతున్నా పలు ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది. ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. శనివారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అసిఫాబాద్‌లో 8 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 8.5, బేలలో 9.1, బజార్‌హత్నూర్‌లో 9.3, బోథ్‌, నిర్మల్‌లో 9.5, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఏపీలో కూడా చలి…

Read More

హిజాబ్ నిషేధం ఎత్తివేత‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని క‌ర్ణాట‌క హోం మంత్రి జీ ప‌ర‌మేశ్వ‌ర స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంపై లోతుగా అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత హిజాబ్ నిషేధం ఎత్తివేత‌పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు తమ ప్ర‌భుత్వం ఎలాంటి ఉత్త‌ర్వులు జారీ చేయ‌లేద‌ని పేర్కొంటూ ఒకవేళ ముఖ్యమంత్రి సిద్ధ‌రామయ్య చేసి ఉంటే, వాటిని ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. కాగా, హిజాబ్ నిషేధంపై ప్ర‌క‌ట‌న చేసిన 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే సిద్ధ‌రామ‌య్య యూట‌ర్న్ తీసుకున్న విష‌యం తెలిసిందే. తాను అలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని, అధికారుల‌తో చ‌ర్చించిన అనంత‌రం తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని శ‌నివారం పేర్కొన్నారు. శుక్ర‌వారం మైసూర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తేస్తారా? అని ఓ మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించ‌గా, హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను మేం ఇంకా ఉపసంహరించుకోలేదు. హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆలోచిస్తున్నామని, దానిపై చర్చలు జరిపి, ఆపై ఖరారు చేస్తామని తాను…

Read More

కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.  కొత్తగా ఎన్నికైన సంజయ్  సింగ్‌ నేతృత్వంలోని రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) పాలక కమిటీని కేంద్రం సస్పెండ్‌ చేసింది. కొత్తగా ఎన్నికైన సంఘం తొందరపాటు నిర్ణయాలను తీసుకుందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.  డబ్ల్యుఎఫ్‌ఐలో ఇప్పటికే ఉన్న నియమాలు, నిబంధనలను పూర్తిగా విస్మరించిందని తెలిపింది.  అండర్‌ 15, అండర్‌ 20 నేషనల్స్‌ యుపిలోని గోండా జిల్లా నందినీ నగర్‌లో ఈ ఏడాది చివరలో జరుగుతాయని డబ్ల్యుఎఫ్‌ఐ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సంజయ్  సింగ్‌ డిసెంబర్‌ 21న ప్రకటించిన సంగతి తెలిసిందే.   ఈ ప్రకటన నిబంధనలకు విరుద్ధమని క్రీడా శాఖ ప్రకటించింది.  జాతీయ పోటీల్లో పాల్గొనే  క్రీడాకారులకు 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇది తొందరపాటు చర్య అని మండిపడింది. ” కొత్త పాలకమండలి డబ్ల్యుఎఫ్‌ఐ…

Read More

తెలంగాణలోని జిల్లాలకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇంఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు, ప్రభుత్వ పథకాలు, పాలనను ప్రజలకు అందించేందుకు ఈ ఇంఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోనున్నారు. ఇక మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరింపచేసుకుంది. హైదరాబాద్‌ జిల్లాకు ఇంఛార్జ్‌ మంత్రిగా పొన్నం ప్రభాకర్‌‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లాకు ఇంఛార్జ్ మినిస్టర్‌గా దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అవకాశం కల్పించారు. ఇక వరంగల్ జిల్లా ఇంఛార్జ్‌ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ జిల్లాకు ఇంఛార్జ్ మినిస్టర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా దామోదర రాజనర్సింహను నియమించారు.  ఖమ్మం…

Read More

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్‌లు నడపడనున్నారు అలాగే అవసరమైతే సర్వీసులు పొడిగింపు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారు పండగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. పండగ సీజన్‌లో బస్సులు, రైళ్లు రద్దీగా ఉండటం సహజం. ప్రయాణంలో కనీసం నిల్చోవటానికి కూడా ఖాళీ స్థలం ఉండదు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్ లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. హైదరాబాద్-తిరుపతి (07489/07490) స్పెషల్ ట్రైన్ ఈ నెల 29వ తేదీ…

Read More

భారత్ అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. ఇటీవల ఇంగ్లాండ్‌పై రికార్డు విజయం సాధించిన భారత మహిళా జట్టు ఈ సారి ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. వాంఖడే వేదికగా జరిగిన ఏకైక టెస్టులో ఆసీస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. టెస్టు ఫార్మాట్‌లో కంగారూలపై భారత మహిళా జట్టుకు ఇదే తొలి విజయం. ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అలిస్సా హీలే నేతృత్వంలోని ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఘన విజయం నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో అవసరమైన 75 పరుగులను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా సాధించింది.  భారత్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో బంతికే ఓపెనర్ షెఫాలీ వర్మ ఔటయినప్పటికీ ఆ తర్వాత రిచా ఘోష్, స్మృతి మందాన జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి భారత్‌ను…

Read More

మరో మూడు నెలల్లో రానున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఎట్లాగైనా గెలుపొందాలని పావులు కదుపుతున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే జనసేన అధినేతతో మంతనాలు సాగిస్తూ, ఉమ్మడి వ్యూహాలు రూపొందిస్తున్నారు. మరోవంక ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో అయన శనివారం ఉండవల్లిలో తన నివాసంలో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది.  గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి గెలుపు కోసం ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని ఐపాక్‌ పని చేసింది. ఆ తర్వాత జగన్‌, కిశోర్‌ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.  ఆ తర్వాత ఏపీ వ్యవహారాలపై పీకే దృష్టి సారించలేదు. మరో వైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వాతావరణం వేడెక్కింది.   దానితో ప్రశాంత్‌ కిశోర్‌పై అధికార వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందరు పీకేలు వచ్చిన చేసేది ఏం లేదంటూ మండిపడుతున్నారు.  హైదరాబాద్‌…

Read More