Author: Editor's Desk, Tattva News

2024 లోక్ సభ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వం పార్టీ ప్రధాన కార్యదర్శుల బాధ్యతలలో కీలక మార్పులు చేసింది. రాస్త్రాలకు ఇన్ ఛార్జ్ లను మార్చివేసింది. ప‌శ్చిమ బెంగాల్ సీనియ‌ర్ నేత దీపాదాస్ మున్షీని తెలంగాణకు నియ‌మిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేరళ, లక్షద్వీప్ ల ఇన్ ఛార్జ్ గా నియమించడంతో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన థాక్రేను… గోవా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్‌ పేరును ఖరారు చేసింది. తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన దీపాదాస్‌ మున్షీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు మ‌హారాష్ట్ర మాజీ పీసీసీ అధ్య‌క్షుడు మాణిక్ రావ్ ఠాక్రేను తెలంగాణ ఇన్‌చార్జీగా ఏఐసీసీ నియ‌మించింది. ఠాక్రేకు ముందు ఇన్‌చార్జిగా ప‌ని చేసిన మాణిక్ రావ్ ఠాకూర్‌.. అప్ప‌టి పీసీసీ…

Read More

ఎన్నికల నిర్వహణలో తప్పులు లేని ఓటర్ల జాబితా అత్యంత కీలకమని, ఆ దిశలో కృషి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నితీష్‌కుమార్‌ వ్యాస్‌లు అధికారులకు సూచించారు. మరో మూడు నెలల్లో జరగాల్సిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సన్నాహాలపై శుక్ర, శనివారాలలో ఏపీలో అధికారులతో వరుసగా సమీక్షలు జరిపారు. తొలి రోజున విజయవాడలోని ఒక హోటల్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలంటే ఓటర్ల జాబితాపై పూర్తిస్థాయి దృష్టి సారించాల్సి ఉంటుందని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించేలా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల సన్నద్ధత, నిర్వహణలో ప్రతి దశలోనూ అప్రమత్తత అవసరమని పేర్కొంటూ ఎన్నికల యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఎక్కడా మరణించిన వారి పేర్లు, ఒక వ్యక్తికి రెండుచోట్ల ఓట్లు నమోదు…

Read More

అరేబియా సముద్రంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఆ దాడితో నౌకలో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆ నౌకలోని సిబ్బందిలో 20 మంది భారతీయులు ఉన్నారు. భారతీయులు సహా నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.  డ్రోన్ దాడి అనంతరం ఆ నౌకకు రక్షణ కల్పించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన ఐసీజీఎస్ విక్రమ్ ఆ షిప్ వైపు బయలుదేరింది.  ఆ వాణిజ్య నౌకపై డ్రోన్ పై ఎవరు దాడి చేశారనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. ఆ దాడికి బాధ్యులమంటూ ఏ సంస్థ కానీ, వ్యక్తి కానీ ప్రకటించలేదు.  గత నెలలో హిందూ మహాసముద్రంలో ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జరిపిన డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ కు చెందిన సరుకు రవాణా నౌక ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎర్ర సముద్రంలో…

Read More

పూంచ్‌లోని ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో శుక్రవారం సాయంత్రం మూడు మృతదేహాలు లభించిన నేపథ్యంలో జమ్మూ కశ్మీరులోని పూంచ్, రాజౌరీ జిల్లాలలో శనివారం మొబైల్ ఇంటర్‌నెట్ సర్వీసులను పాలనా యంత్రాంగం నిలిపివేసింది. పూంచ్ జిల్లాలోని తోపా పీర్ సమీపంలో డిసెంబర్ 21న భద్రతా దళాలకు చెందిన రెండు వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి జరపడంతో ఐదుగురు జవాన్లు మరణించారు. ఇదే ప్రదేశం సమీపంలో శుక్రవారం సాయంత్రం ముగ్గురు స్థానికుల మృతదేహాలు లభించాయి. ఉగ్ర దాడికి సంబంధించి ప్రశ్నించే నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏడుగురు లేదా ఎనిమిది మంది స్థానికులలో ఈ ముగ్గురు ఉన్నట్లు వర్గలు వెల్లడించాయి. పూంచ్ డిసిపి, ఎస్‌పితోసహా సీనియర్ పోలీసు, ఆర్మీ అధికారులు శుక్రవారం రాత్రి వరకు బఫ్లియాజ్‌లోనే ఉండి పరిస్థితిని సమీక్షించినట్లు వర్గాఉలు తెలిపాయి. జమ్మూ దివిజనల్ కమిషనర్ కూడా పూంచ్‌కు బయల్దేరినట్లు వారు చెప్పారు. పూంచ్‌లో స్థానికులు నిరసనలు చేపట్టినట్లు వార్తలు వచ్చాయి. సురాన్‌కోట్‌లోని బఫ్లియాజ్ నుంచి…

Read More

ఎంఎల్‌ఎల కొనుగోలుకు సంబంధించిన కేసులో విచారణ కొనసాగుతోందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. త్వరలోనే ఈ కేసుపై అన్ని వివరాలు అందిస్తామని తెలిపారు. సైబరాబాద్ వార్షిక నేర నివేదికను విడుదల చేస్తూ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని తెలిపారు. అలాగే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యా యత్నం కేసులో సైతం దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. సైబరాబాద్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత పకడ్బందీగా పని చేస్తామని వెల్లడించారు. ఆర్థిక, స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్ సిబ్బంది రెండు నెలలు సమర్థంగా పనిచేశారని ప్రశంసించారు. ’గతేడాది సైబర్ క్రైమ్ కేసులు 4,850 ఉంటే, ఈసారి 5,342 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది రూ.232 కోట్ల మోసం జరిగింది. 2023లో 277 డ్రగ్స్ కేసులు నమోదవ్వగా…

Read More

వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు ఇటీవల జరిగిన `ఇండియా’ కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లిఖార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించడంతో పాటు వారణాసిలో మోదీని ఓడించేందుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేవరకు పలు సూచనలు చేసిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్కి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు గట్టి ఛాలెంజ్‌ విసిరారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్‌ బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పాల్ దీదీకి సవాల్‌ విసిరారు. ఇండియా కూటమి నాలుగో సమావేశం సందర్భంగా వారణాసిలో మోదీపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీ చేయాలని మమతా బెనర్జీ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే అగ్నిమిత్ర పాల్‌  దీదీకి ఛాలెంజ్‌ విసిరారు. ‘మమతా బెనర్జీ వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయరు? కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కాకుండా వారణాసి నుంచి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోదీపై పోటీ చేసే దమ్ము…

Read More

గతంలో సిబిఐ అధికారిగా అక్రమ ఆస్తుల కేసులలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా సంచలనం సృష్టించిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఆ ఇమేజ్ తో రాజకీయ ప్రవేశం కోసం గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు చెప్పుకోదగిన ఫలితాలు ఇవ్వక పోవడంతో తాజాగా తానే కొత్తగా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావటమే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీని స్థాపిస్తున్నట్టు శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆయన సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని తెలుగు దేశం పార్టీ, బీజేపీలలో చేరడం ద్వారా 2019 ఎన్నికలలో పోటీ చేసేందుకు విఫల ప్రయత్నాలు చేశారు. అయితే ఆ రెండు పార్టీలు ఆయన పట్ల ఆసక్తి చూపక పోవడంతో చివరి క్షణంలో జనసేన పార్టీలో చేరి, విశాఖపట్నం నుండి లోక్ సభకు…

Read More

కర్ణాటకలో ముస్లిం మహిళల ముఖం ముసుగు హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని తాము ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. మైసూరులో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా ఈ నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని చెప్పారు. మహిళలు తాము కోరుకున్న వస్త్రదారణకు దిగే స్వేచ్ఛ ఉందని, ఇది హిజాబ్‌కు కూడా వర్తిసుందని స్పష్టం చేశారు. ఇక అధికారికంగా కూడా హిజాబ్‌పై నిషేధం ఉండబోదని తెలిపారు. మహిళలు హిజాబ్ ధరించే ఎక్కడైనా తిరగవచ్చు. అది వారి ఇష్టానికి వదిలిపెడుతున్నామని చెప్పిన సిఎం ఈ మేరకు తాము అధికార యంత్రాంగానికి ఈ నిషేధ ఎత్తివేత ఆదేశాలు వెలువరించినట్లు వివరించారు. ఆహార్యం, ఆహారం వంటి వాటిలో ఎవరిష్టం వారిది. దీనిని కట్టడిచేసే ఆలోచన అనుచితం అవుతుంది. మీ ఇష్టానికి అనుగుణంగా ఉంటే సరిపోతుంది. దీనిపై ప్రభుత్వ అడ్డంకి ఎందుకు? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తాను ధోవతి ధరిస్తానని, మీరు…

Read More

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం మూడవ సారి సమన్లు జారీచేసింది. జనవరి 3న ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో హాజరుకావాలని కేజ్రీవాల్‌ను ఇడి ఆదేశించింది. ఈ నెల 21న హాజరుకావాలని ఇడి రెండవ సమన్లు జారీచేసినప్పటికీ 10 రోజుల పాటు విపాసన ధ్యానంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్ బుధవారమే వెళ్లిపోయారు. జనవరి 3న కూడా ఇడి ఎదుట హాజరుకాని పక్షంలో కేజ్రీవాల్‌పై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేసే అవకాశం ఉంది. రెండవ సమన్లకు లేఖ ద్వారా సమాధానమిచ్చిన కేజ్రీవాల్ ఇవి రాజకీయ దురుద్దేశంతో జారీచేసివవని, చట్టవిర్ధుమైనవని ఆరోపించారు. తన జీవితాన్ని నిజాయితీగా, పారదర్శకంగా జీవించానని, దాచడానికి తన వద్ద ఏమీ లేదని ఇడికి రాసిన ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. మొదట నవంబర్ 2న హాజరుకావాలని కేజ్రీవాల్‌కు ఇడి సమన్లు జారీ చేసింది. అయితే ఐదు రాష్ట్రాలలో అసెంబీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి…

Read More

తెలంగాణలో డిసెంబర్ 26 నుండి జనవరి 10, 2024 వరకు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లపై ట్రాఫిక్ పోలీసులు రాయితీ ప్రకటించారు. రూ. 2 కోట్ల‌కు పైగా పెండింగ్ చ‌లాన్లు ఉండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రాయితీ క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో వాహ‌న‌దారులు సంతోషం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా రాయితీ ఉన్నంత వరకు క్లియర్ చేయాలని సూచించారు. చలాన్లపై గతం కంటే పోలీసులు ఈసారి ఎక్కువ రాయితీ ప్రకటించారు. ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపులు వాహనం యొక్క వర్గం ప్రకారం విభజించారు. ఉదాహరణకు, ఒకరు 1000 రూపాయలు చెల్లించవలసి వస్తే, వారు మొత్తంలో 25% అంటే 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. చెల్లింపు పూర్తయిన తర్వాత, మిగిలిన మొత్తం స్వయంచాలకంగా మాఫీ చేయబడుతుంది. * ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 20 శాతం చలాన్‌ చెల్లిస్తే మిగిలిన 80…

Read More