Author: Editor's Desk, Tattva News

హమాస్ ను పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు అధికారికంగా 20 వేల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉండడం మరో విషాదం. అక్టోబర్ 7వ తేదీన హహాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ లోకి చొరబడి నరమేథం సృష్టించడంతో ఈ దాడులు ప్రారంభమయ్యాయి. ఇళ్లల్లోకి చొరబడి విచక్షణారహితంగా దాడులు చేస్తూ సుమారు 1200 మందిని చంపేశారు. 240 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. ఈ ఘటనతో ప్రపంచమంతా షాక్ కు గురైంది. ఈ దాడిని తీవ్రంగా తీసుకున్న ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. నాటి నుంచి నేటి వరకు హమాస్ లక్ష్యంగా వైమానిక దాడులు కొనసాగిస్తుంది.  గాజాలో చొరబడి గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. గాజాలో హమాస్ మిలటరీ స్థావరాల ధ్వంసం పేరుతో హాస్పిటల్స్ ను, ఇతర పౌర భవనాలను, నివాస ప్రాంతాలను ధ్వంసం చేస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 20,057…

Read More

వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ హాజరు ముఖ్యఅతిధిగా కానున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిని 2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను అంతకుముందు ఆహ్వానించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వెల్లడించారు. కానీ పలు కారణాల వల్ల ఈ గణతంత్ర దినోత్సవ వేడులకు హాజరు కాలేనని జో బైడెన్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మేక్రాన్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది జులైలో పారిస్‌ వేదికగా జరిగిన ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ బాస్టిల్‌ డే పరేడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌ వేదికగా ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో ఇమ్మాన్యూయేల్‌ మేక్రాన్‌ పాల్గొన్నారు.  భారత్‌ ఫ్రాన్స్‌ సంబంధాలను మరింత…

Read More

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా ఉన్న టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ కోసం సీఐడీ కోర్టు అనుమతి కోరింది. నారా లోకేష్ యువగళం సభలో, పలు ఇంటర్వ్యూ లలో చేసిన వ్యాఖ్యల పైన సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో లోకేష్ రెండు సార్లు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.  లోకేష్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని, అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ కోర్టులో సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. టీడీపీ నేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఐడీ కోర్టులో మొమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సీఐడీ అందచేసింది.  కాగా, యువగళం ముగింపు సందర్భంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబు స్కిల్ స్కాం కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని సీఐడీ ఆరోపిస్తోంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించటంతో…

Read More

గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖకు సంబంధించిన మూడు కీలక అంశాలపైన న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో టెండర్లు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం, కాలం చెల్లిన సాంకేతికతతో నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలపైన న్యాయవిచారణ జరిపించనున్నట్టు వెల్లడించారు. గురువారం శాసనసభలో ప్రభుత్వం విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ అంశంపై చర్చలో భాగంగా విద్యుత్‌శాఖ మాజీ మంత్రి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్‌రెడ్డి గత ప్రభుత్వంలో అవకతవలకు అక్రమాలు జరిగివుంటే సిట్టింగ్ జడ్జిచేత న్యాయవిచారణ చేసుకోవచ్చని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు.A R జ్యుడిషియరీ విచారణ మంచి సూచన అని ఇలాంటివి ఇవ్వమని కోరుతున్నామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంపై ఆనాడే తాము సభలో పోరాటం చేస్తే.. మార్షల్స్ తో తమ ను సభ…

Read More

గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సి వుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇజ్రాయిల్‌ బాంబు దాడులతో గాజాలో వేలాది మంది నిరాశ్రయులు కావడంతో పాటు ఆకలి, నీటి ఎద్దడి తీవ్రమైన సంగతి తెలిసిందే. దీంతో గాజాలో ”భారీ స్థాయిలో మానవతా సాయం కార్యకలాపాలు” అనుమతించేలా పరిస్థితులు మెరుగుపడాలని ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంధనం, సిబ్బంది, సామాగ్రి కొరతతో ఉత్తర గాజాలోని ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయని డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొంది. అల్‌-అహ్లీ ఆస్పత్రి చివరిదని, అది కూడా కనిష్టంగా సేవలను అందిస్తోందని గాజాలోని డబ్ల్యుహెచ్‌ఒ ప్రతినిధి రిచర్డ్‌ పీపర్‌సన్‌ వీడియో లింక్‌లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ గాజాపై దాడులను కొనసాగిస్తోంది. తాజాగా రఫాలోని ఆస్పత్రి సమీపంలో, ఉత్తర జాబాలియా శరణార్థి శిబిరంపై బాంబులతో విరుచుకుపడింది. దీంతో తమ అత్యవసర వైద్య బృందం రఫా సరిహద్దుకు చేరుకుంటోందని పాలస్తీనా రెడ్‌ క్రెసెంట్‌ ఇఎంఎస్‌ టీమ్స్‌ (పిఆర్‌సిఎస్‌) పేర్కొంది. ఉత్తర గాజాలోని జాబాలియా శరణార్థి…

Read More

జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌వాన్లు వెళ్తున్న ఆర్మీ ట్ర‌క్కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జ‌వాన్లు మృతి చెంద‌గా, మ‌రో ఇద్దరు  జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఫూంచ్ జిల్లాలోని బూఫ్లియాజ్ ఏరియాలో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో బుధవారం రాత్రి నుంచి బ‌ల‌గాలు ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నాయి.  ఈ క్ర‌మంలో సావ్నీ ఏరియాలోని రాజౌరీ – థ‌న‌మండి – సూర‌న్‌కోటే ర‌హ‌దారిపై గురువారం మ‌ధ్యాహ్నం 3:45 గంట‌ల‌కు ఆర్మీ ట్ర‌క్కుల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. బుధవారం రాత్రి నుంచి బూఫ్లియాజ్ ఏరియాలో ఉగ్ర‌వాదుల కోసం వేట కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డికి రెండు ఆర్మీ ట్ర‌క్కుల్లో బ‌ల‌గాల‌ను తీసుకెళ్తున్నారు.  దీంతో ఆర్మీ ట్ర‌క్కుల‌ను గ‌మ‌నించిన ఉగ్ర‌వాదులు మెరుపుదాడి చేశారు. ఇక ఇరు వ‌ర్గాల మ‌ధ్య భీక‌ర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల‌తో అద‌న‌పు బ‌ల‌గాల‌ను ఆ ప్రాంతానికి పోలీసులు చేర్చారు. ఫూంచ్ జిల్లాలోని ఆర్మ్‌డ్ పోలీసు యూనిట్‌లోని కంపౌండ్‌లో…

Read More

తెలంగాణ శాసన సభలో విద్యుత్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య వాగ్యుద్ధం నడిచింది. అక్బరుద్దీన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పాత బస్తీ అభివృద్ధి చెందిందని చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తాము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుందని, దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.ఈ ద‌శ‌లోనే సీఎం రేవంత్ రెడ్డి ఏబీవీపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఆరెస్సెస్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను మజ్లిస్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడుతానని పేర్కొంటూ నాదెండ్ల.. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, నిన్నటి వరకు…

Read More

తమ దేశంలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్1 వీసాతో యూఎస్ లో చదువుతున్న విదేశీ విద్యార్థులు ఉపాధి-ఆధారిత కేటగిరీలో ఇకపై ఇమిగ్రెంట్ వీసాకు నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇమిగ్రెంట్ వీసా పొందిన విద్యార్థులు యూఎస్ లోని స్టార్ట్ అప్ లలో ఉద్యోగాలు చేసుకోవచ్చు.  ఈ మేరకు వీసా పాలసీ గైడ్ లైన్స్ లో యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కీలక మార్పులు చేసింది.  యూఎస్సీఐఎస్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం కానుంది. “(ఎఫ్1 వీసా) విద్యార్థులు శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ అప్లికేషన్ లేదా ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్‌కు అప్లై చేసుకోవడానికి అర్హులు” అని యూఎస్సీఐఎస్ ప్రకటించింది.  ఎఫ్, ఎం కేటగిరీల స్టుడెంట్ వీసాలకు సంబంధించి పలు నూతన నియమ నిబంధనలను అమెరికా ప్రకటించింది. ఎఫ్ 1 వీసాతో యూఎస్ లో చదువుతున్న విద్యార్థులు, ముఖ్యంగా…

Read More

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత కె.పొన్ముడికికి మద్రాస్ హైకోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో శిక్షను తగ్గించాలని కోరుతూ పొన్ముడి, ఆయన భార్య కోర్టుకు మెడికల్ రికార్డు సమర్పించారు. మంత్రి వయసు 73 సంవత్సరాలు, ఆయన భార్య వయసు 60 ఏళ్లని, కాబట్టి శిక్షను తగ్గించాలని కోరారు. పొన్ముడికి సాధారణ జైలు శిక్ష, ఆయనకు, ఆయన భార్యకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కాగా, శిక్షను పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇచ్చింది. రూ.1.75 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడి, ఆయన భార్యను నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రెండు రోజుల క్రితం కొట్టేసిన హైకోర్టు వారిని దోషులుగా ప్రకటించి శిక్షపై తీర్పును వాయిదా వేసింది. తాజాగా,…

Read More

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యేందుకు కారణమయ్యారని, పోలీసుల ఆదేశాలు ధిక్కరించారనే ఆరోపణలతో నమోదైన కేసులో ప్రశాంత్‍ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని గజ్వేల్ మండలం కొలుగూర్ గ్రామానికి వెళ్లి అతడి ఇంట్లోనే పల్లవి ప్రశాంత్‍ను అరెస్ట్ చేశారు.  బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహావీరాన్ లను అరెస్టు చేసిన అనంతరం మెజిస్టేట్ ముందు హాజరుపర్చగా  14రోజులు రిమాండ్ విధించారు. దానితో, చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. బిగ్‍బాస్ విజేతగా నిలిచి ప్రశాంత్ బయటికి వచ్చిన సమయంలో హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో గొడవ జరిగింది. ఈ సందర్భంగా కొందరు కొన్ని ఆర్టీసీ బస్సులు, ప్రేవేటు వాహనాలను ధ్వంసం చేశారు.  ఆ చర్యకు పాల్పడింది పల్లవి ప్రశాంత్ అభిమానులే అని కేసులు నమోదయ్యాయి. అలాగే, ఆ సమయంలో అక్కడి రావొద్దని…

Read More