Author: Editor's Desk, Tattva News

మరోసారి కేరళలో కరోనా వైరస్‌ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ వారం రోజుల్లోనే అక్కడ కొవిడ్‌-19 కేసులు 277 శాతం పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కేరళలో గత వారం 111 యాక్టివ్‌ కేసులు ఉండగా, వాటి సంఖ్య ఒక్కసారిగా 1,634కు చేరింది. వీటిలో జేఎన్‌.1 అనే కొత్త వేరియంట్‌ బయటపడటం మరింత బెంబేలెత్తిస్తోంది.  దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.  జేఎన్‌.1 వేరియంట్ తొలి కేసు అమెరికాలో వెలుగుచూసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది బయటపడింది.  ఒమిక్రాన్‌ రకంలోని పిరోలా వేరియంట్‌ (బీఏ.2.86) నుంచి ఇది రూపాంతరం చెందింది. బీఏ.2.86లోని స్పైక్‌ ప్రోటీన్‌తో పోలిస్తే ఈ వేరియంట్‌లో ఒక్క మ్యుటేషన్‌ అదనంగా కనిపించింది.. బీఏ.2.86 ప్రోటీన్‌లో 20 మ్యుటేషన్‌లు ఉండగా.. ఈ కొత్త వేరియంట్‌లో 21 మ్యుటేషన్‌లు ఉన్నాయి. అందువల్ల దీని…

Read More

జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ దాఖలు చేసిన అన్ని పిటిషన్‌లను అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ కేసుపై విచారణను ఆరు నెలల్లోగా ముగించాలని వారణాసి కోర్టును ఆదేశించింది. ఈ కేసు దేశంలోని రెండు ప్రధాన కమ్యూనిటీలను ప్రభావితం చేస్తుందని, ఆరు నెలల్లోగా తీర్పు ఇవ్వాలని జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ట్రయల్‌ కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. జ్ఞాన‌వాపి మ‌సీదులో పూజ‌లు నిర్వ‌హించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాలంటూ హిందువులు పిటీష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. ఆ పిటీష‌న్ ఆధారంగానే ఆ మ‌సీదులో సైంటిఫిక్ స‌ర్వే చేప‌ట్టారు. ఆ నివేదిక‌ను కూడా ఇటీవ‌ల కోర్టుకు స‌మ‌ర్పించారు. అయితే హిందువుల పిటీష‌న్ల‌ను స‌వాల్ చేస్తూ ముస్లింలు దాఖ‌లు చేసిన పిటీష‌న్ల‌ను అల‌హాబాద్ హైకోర్టు ఇవాళ కొట్టిపారేసింది. ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్‌ వ్యాజ్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఐదు పిటిషన్లపై డిసెంబర్‌ 8న వాదనలు విన్న…

Read More

కొంత కాలంగా మోసాలకు పాల్పడుతున్న లోన్(రుణ) యాప్‌లపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. దాదాపు 2500 మోసపూరిత యాప్‌లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిందని ఈ మేరకు పార్లమెంట్‌లో ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్య కాలంలో గూగుల్ తన ప్లే స్టోర్ నుండి 2,500 కి పైగా మోసపూరిత రుణ యాప్‌లను తొలగించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు తెలిపారు. సుమారు 3,500 నుండి 4,000 లెండింగ్ యాప్‌లను సమీక్షించిన తర్వాత గూగుల్ ఈ చర్య తీసుకుందని ఆమె తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆర్థికమంత్రి ఈ విధంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే మోసం రుణ యాప్‌లపై తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఇలాంటి నకిలీ రుణ యాప్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఇతర రెగ్యులేటర్‌లతో కలిసి నిరంతరం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. ఆర్థిక స్థిరత్వం,…

Read More

బయోఫ్యూయల్స్ (జీవ ఇంధనాలు) వినియోగం, అభివృద్ధిని వేగవంతం చేసే ప్రక్రియలో ప్రపంచ దేశాల సహకారాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ చొరవతో ఏర్పడ్డ “గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమి”లో చేరిన దేశాల సంఖ్య 22కు పెరిగిందని కేంద్రం తెలిపింది. అలాగే 12 అంతర్జాతీయ సంస్థలు ఈ కూటమిలో సభ్యత్వం పొందినట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ పేర్కొన్నారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన జీ 20 సమ్మిట్లో 19 దేశాలు, 12 అంతర్జాతీయ సంస్థల సహకారంతో గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిని ప్రారంభించినట్లు తెలిపారు. కూటమి ప్రారంభించినప్పటి నుంచి సభ్యత్వ దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వెల్లడించారు.  స్టేక్‌హోల్డర్స్ విస్తృత భాగస్వామ్యంతో బయోఫ్యూయల్స్‌కు సంబంధించి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సన్నాహాలను సులభతరం చేయడం,  జాతీయ కార్యక్రమాలు, పాలసీ-పాఠాలు పంచుకోవడానికి సాంకేతిక సహాయం అందించడం, సాంకేతికత పురోగతి, స్థిరమైన జీవ ఇంధనాల…

Read More

దేశంలోని డ్రైవర్‌ల ఉద్యోగాల భద్రత దృష్ట్యా డ్రైవర్‌ లెన్‌ కార్లను భారత్‌లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అదేవిధంగా కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటు, రోడ్లపై బ్లాక్ స్పాట్‌లను తొలగింపు లాంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామని తెలిపారు.  ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇక  హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా నితిన్‌ గడ్కరీ అభివర్ణించారు.  ఇటీవల పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో గడ్కరీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై మూలధన వ్యయం 2013-14లో రూ.51 వేల కోట్లు ఉండగా.. 2022-23లో రూ.2.40 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 2013-14లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు రూ.31,130 కోట్లు కాగా, 2023-24 నాటికి ఇది రూ.2,70,435…

Read More

పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తంగా 78 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సోమవారం లోక్‌సభలో 33 మంది ఎంపీలు, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన వారి సంఖ్య 92కి చేరింది. పార్లమెంట్‌ లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో సోమవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు, లోక్‌సభ లో ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలపై స్పీకర్‌ మరోసారి సస్పెన్షన్‌ వేటు వేశారు. కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరి సహా 33 మందిని సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. వారిలో 30 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయగా, మరో ముగ్గురి సస్పెన్షన్‌ అంశం పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఎంపీలు కె. జయకుమార్‌, విజయ్‌ వసంత్‌, అబ్దుల్‌…

Read More

హిందువులు హలాల్‌ మాంసం తినడం ఆపేయాలని, జట్కా మాంసం మాత్రమే తినాలని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ హితవు చెప్పారు. బీహార్‌ రాష్ట్రంలోని బెగూసరాయ్‌లో మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉన్నదని కేంద్రమంత్రి చెప్పారు. ముస్లింలను తాను గౌరవిస్తానని, వాళ్లు వారి మత ఆచారం ప్రకారం హలాల్‌ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారని చెప్పారు. హిందువులు వెంటనే హలాల్‌ మాంసాన్ని తినడం ఆపేయాలని, జట్కా మాంసాన్ని మాత్రమే తినాలని కోరారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన వెనుక ఉన్నదెవరో త్వరలో బయటపడుతుందని గిరిరాజ్‌ సింగ్‌ చెప్పారు. పార్లమెంట్‌పై దాడి కూడా రైతుల ఉద్యమం లాంటిదేనని, ఇందులో కూడా టూల్‌కిట్‌ గ్యాంగ్‌ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, కారకులెవరో త్వరలో తేలుతుందని స్పష్టం చేశారు. రైతుల ఉద్యమ సమయంలో టూల్‌కిట్‌ గ్యాంగ్‌ ఎలా బయటపడిందో అలాగే పార్లమెంట్‌ ఘటన వెనుక ఉన్నదెవరో కూడా…

Read More

ఈనెల 23 నుంచి 2024 జనవరి ఒకటో తేదీ వరకు వైంకుఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డిసెంబరు 19న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా డిసెంబరు 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించరని తెలిపారు. జనవరి 14వతేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేసారన్నారు. నెల రోజులు పాటు సుప్రభాతంకు బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇక, వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల్లో ఏ రోజు దర్శనం…

Read More

ప్రజల భద్రతా ప్రయోజనాల కోసం, అత్యవసర పరిస్థితుల్లో ఏ టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌నైనా కేంద్రం తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు. ఈమేరకు కేంద్రం సోమవారం లోక్‌సభలో టెలికమ్యూనికేషన్‌ బిల్లు 2023 ముసాయిదాను ప్రవేశపెట్టింది. గతవారం పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్ర కమ్యూనికేషన్స్‌ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. విపత్తు నిర్వహణతో పాటు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు ప్రజల భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక అధికారి నోటిఫికేషన్‌ ద్వారా అధీకృత సంస్థ నుండి ఏదైనా టెలీకమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చని ముసాయిదా పేర్కొంటోంది. ప్రజల భద్రత పేరుతో ఇంటర్నెట్‌ను నిలిపివేయవచ్చని తెలిపింది. చట్టవిరుద్ధంగా మెసేజ్‌లను అడ్డుకుంటే మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ. 2 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు లేదా ఏకకాలంలో రెండూ విధించే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పిలేట్‌ ట్రిబ్యునల్స్‌…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని సోమవారం ప్రారంభించారు. వారణాసిలో ‘స్వరవేద్ మహా మందిర్ ధామ్’ పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు. వారణాసికి 12 కిలోమీటర్ల దూరంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మహా మందిరాన్ని నిర్మించారు. ఈ మహామందిరింలో 125 తామర పూవు రేకుల గోపురాలు ఉన్నాయి. ఈ మందిరంలో మొత్తం 20 వేల మంది కూర్చోవచ్చు. ఆ ఆలయవంలో వేసిన మకరానా పాలరాతిపై మొత్తం 3,137 స్వర్వ్ శ్లోకాలను చెక్కారు. ఈ మందిర ప్రాంగణంలో ఔషధ మూలికలతో కూడిన అద్భుతమైన తోట కూడా ఉంది. ఈ మందిరంలో మొత్తం 101 ఫౌంటెన్‌లను ఏర్పాటు చేశారు. 2004లో ప్రారంభమైన ఈ మందిరం నిర్మాణంలో 15 మంది ఇంజనీర్లు, 600 మంది కార్మికులు పాల్గొన్నారు. “స్వర్‌వేద్ మహా మందిరం భారతదేశం సామాజిక, ఆధ్యాత్మిక…

Read More