Author: Editor's Desk, Tattva News

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న బైడెన్ దంపతులు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అధ్యక్షుడు బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ ఆదివారం రాత్రి 8.09 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఉన్న తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు.  అక్కడ డిన్నర్‌ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్‌ వద్దకు వస్తున్నారు. ఇంతలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్‌లోని యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మరో వాహనంపైకి దూసుకెళ్లింది.  ఈ ఘటన జరిగినప్పుడు జిల్‌ బైడెన్‌ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండటా.. ప్రెసిడెంట్‌ బైడెన్‌ 130 అడుగుల దూరంలో ఉన్నారు.  వెంటనే రంగంలోకి దిగిన సెక్యూరిటీ అధికారులు అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌ను ఢీకొట్టిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారును చుట్టు ముట్టి..…

Read More

అండర్‌ వరల్డ్‌ డాన్‌, 1993 ముంబై దాడుల సూత్రధారి అయిన దావూద్‌ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంటున్న దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరగడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో వెంటనే దావూద్‌ను తన అనుచరులు ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి.  ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దావూద్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ అధికారులెవరూ ఇప్పటివరకు ధృవీకరించలేదు. అతని ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది. ఇక దావూద్‌ ఇబ్రహీంపై విష ప్రయోగం చేశారన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు మాత్రమే స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. దావూద్‌పై విష ప్రయోగం జరిగిందనే వార్త ఏ…

Read More

తెలంగాణ ఎన్నికల అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాజకీయ పక్షాలు ఎన్నికల సన్నాహాలలో తలమునకలవుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండున్న గంటల పాటు ఆదివారం సాయంత్రం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సుదీర్ఘంగా సాగిన కీలక భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరు పార్టీల అధినేతలు చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.  ‘‘ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగిందని, అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయని నాదెండ్ల చెప్పారు.  వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా, ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి…

Read More

ఇటీవల పార్లమెంటు‌లో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటన పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కొద్ది రోజుల తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. డిసెంబర్ 13 న లోక్‌సభలో జరిగినది “తీవ్రమైన సమస్య” అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో చర్చ లేదా ప్రతిఘటనకు బదులు, పరిష్కారాన్ని కనుగొనడానికి సంఘటనను లోతుగా విచారించాల్సిన అవసరముందని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయరాదని స్పష్టం చేశారు. అందువల్ల, అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు.  దర్యాప్తు సంస్థలు ఈ విషయంపై విచారణ జరుపుతున్నాయని, చొరబాటుదారుల దాడి వెనుక ఉన్న ఉద్దేశాలను త్వరలో కనుగొంటామని ఆయన తెలిపారు.   ‘‘పార్లమెంటులో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. స్పీకర్ సార్ పూర్తి సీరియస్‌గా అవసరమైన చర్యలు…

Read More

సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. మహిళలు, చిన్నారులు సహా మొత్తం 86 మందితో వెళ్తున్న పడవ బలమైన అలల తాకిడికి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 61 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వారు బతికి ఉండే అవకాశం లేదని, మరణించి ఉంటారని లిబియా అధికారులు చెబుతున్నారు.  పడవలోని మరో 25 మందిని రెస్క్యూ టీమ్స్‌ సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి. ఆదివారం ఉదయం లిబియా తీరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నైజీరియా, గాంబియా తదితర ఆఫ్రికా దేశాలకు చెందిన 86 మంది ఐరోపా దేశాలకు వలస వెళ్లేందుకు లిబియా నుంచి పడవలో బయలుదేరారు.  లిబియా తీరానికి సమీపంలో పడవ బోల్తా పడినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటరుేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఒఎం) తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ సమీపంలో బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు…

Read More

అంతర్జాతీయ వజ్రాలు, అభరణాల వ్యాపారానికి ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రంగా సూరత్‌లోని రూ 3,500 కోట్ల వ్యయంతో నిర్మించిన డైమండ్ బోర్స్ ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇదో అత్యంత ఆధునిక నిర్మాణం. 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు.  ఒకేసారి 67వేల మంది సౌకర్యవంతంగా కార్యకలాపాలు చేసుకునేలా ఈ భవన నిర్మాణం జరిగింది. 4500పైగా వివిధ కార్యాలయాలున్న ఈ భవనంలో 131 హైస్పీడ్‌ లిఫ్ట్‌లు ఉన్నాయ్‌. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టెడ్‌ భవనంగా రికార్డ్‌ సృష్టించింది. డైమండ్‌ బోర్స్‌ సెంటర్‌తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపు వస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. గత 80 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటగాన్‌ను సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ అధిగమించిందని చెప్పారు. సూరత్ డైమండ్ బోర్స్ భవనం ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ సముదాయంగా నిర్మించబడింది. దీనిని దాదాపు 67 లక్షల చదరపు అడుగుల…

Read More

ఐరోపా ద్వీపదేశమైన మాల్టాకు చెందినఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురయింది. సోమాలియాకు వెళ్తున్న ఎంవి రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు.ఆ నౌకనుంచి అత్యవసర పరిస్థితుల కాల్( మేడే కాల్) రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. దాన్ని కాపాడేందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌ను, యుద్ధ నౌకను రంగంలోకి దించింది. ఈ మేరకు భారత నౌకాదళం శనివారం ఓ అధికార ప్రకటనలో తెలిపింది.‘ డిసెంబర్ 14వ తేదీ రాత్రి సమయంలో ఎంవి రుయెన్ నౌక యుకె మెరైన్ ట్రేడ్ ఆపరేషన్ పోర్టల్‌లో మేడే(అత్యవసర పరిస్థితిని తెలియజేసే) కాల్‌ను పంపించింది. నౌకలోకి ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారనేది ఆ సందేశం సారాంశం. దాంతో భారత నేవీ అప్రమత్తమైంది. అరేబియా సముద్రంపై గస్తీ కాస్తున్న మారిటైం పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో విధుల్లో ఉన్న యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను అప్రమత్త చేసింది’ అని నేవీ తెలిపింది. హైజాక్‌కు గురయిన…

Read More

ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్ 347 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. కేవలం ఒకే ఒక్క సెషన్‌లో ప్రత్యర్థికి చెందిన పది వికెట్లను పడగొట్టి టీమిండియా పెను ప్రకంపనలు సృష్టించింది. ఇదే క్రమంలో మహిళల క్రికెట్ చరిత్రలోనే భారీ విజయం సాధించిన జట్టుగా భారత్ నయా రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు శ్రీలంక పేరిట ఈ రికార్డు ఉండేది. గతంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక మహిళా జట్టు 309 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా టీమిండియా ఈ రికార్డును తిరగరాసింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లను పడగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత్ శనివారం మూడో రోజు 186/6 ఓవర్‌నైట్ స్కోరు వద్దనే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 479 పరుగుల క్లిష్టమైన…

Read More

తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని పేర్కొంటూ వాటిపై చర్యలు తీసుకోవాంటూ చైనా, పాక్‌ పేర్లను ప్రస్తావించకుండానే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాదం, హింస కారణంగా భారతీయులం ఎంతో నష్టపోయామని చెప్పారు. ఉగ్రవాద గ్రూప్‌లు సరిహద్దుల గుండా అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్నాయని, ఇందులో డ్రోన్లు సైతం ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాద గ్రూప్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను బట్టి వారికి ఎవరు సహాయం అందిస్తున్నారనే విషయం స్పష్టమవుతోందని ఆమె తెలిపారు. ఏ దేశం సహాయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలను సేకరించలేరని ఆమె స్పష్టం చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉన్నాయని చెబుతూ నేరాలకు పాల్పడడమే కాకుండా, కరెన్సీని నకిలీ చేయడం, చెలామణి చేయడం, ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరాకు కూడా పాల్పడుతున్నట్లు రుచిరా కాంబోజ్‌ వెల్లడించారు. సరిహద్దు…

Read More

కేరళలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో కోవిడ్‌ సబ్‌వేరియంట్‌ జెఎన్‌.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌ వేరియంట్‌.. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బిఎ.2.86కి వంశానికి చెందినది అని ద ఇండియా సార్స్‌ -కోవ్‌-2 జెనోమిక్స్‌ కన్సార్టియం (ఐఎన్‌ఎస్‌ఎసిఓజి) ఏజెన్సీ వెల్లడించింది. దేశంలో నమోదయ్యే మొత్తం రోజువారీ కరోనా కేసుల్లో కేరళలో అత్యధికంగా ఉంటున్నాయి. కేరళలో నవంబర్‌ నెల మొత్తం 470 కరోనా కేసులు నమోదు కాగా.. డిసెంబర్‌ నెల తొలి పది రోజుల్లోనే 825 మంది కరోనా బారినపడ్డారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1104కు పెరిగింది. కొత్త వేరియంట్‌ కారణంగా కేరళలో కరోనా కేసులు పెరగడం దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణం అవుతున్నది. దాంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 312 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది…

Read More