Author: Editor's Desk, Tattva News

శబరిమలలో సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాసి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేక ఇబ్బందులకు గురవుతున్న భక్తుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. గత కొద్ది రోజులుగా శబరిమల క్షేత్రంలో రద్దీని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో తొక్కిసలాట పరిస్థితులు తలెత్తుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాలు నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు..…

Read More

ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో మార్పు రాలేదని, తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ప్రజలంతా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని చెప్పారు. ప్రజా తీర్పును గౌరవించకపోతే బయటికే పంపుతారని స్పష్టం చేసారు. “ప్రగతి భవన్ లో ప్రజావాణి కార్యక్రమం తీసుకొచ్చాం. గతంలో ప్రగతి భవన్ లోకి రాకుండా హోంమంత్రిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పాలన కేవలం కుటుంబం వరకే పరిమితం. ప్రగతిభవన్‌ ముం.దు గద్దర్‌ గంటల తరబడి నిరీక్షించినా లోనికి అనుమతించలేదు ప్రజాతీర్పును చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. ప్రజా తీర్పును బీఆర్ఎస్ గౌరవించాలి” అంటూ హితవు చెప్పారు. తాము ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, అన్ని వివరాలను సభ ముందు ఉంచుతామని, ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇవాళ గడీలు బద్దలుకొట్టి ప్రజావాణికి…

Read More

దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కొద్దీ దిగ్భ్రాంతి కలిగించే పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్లమెంట్‌లో పసుపు రంగు గ్యాస్ డబ్బాలతో గందరగోళం సృష్టించి, ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు తొలుత అక్కడ ఆత్మాహుతి యత్నం చేయడం ద్వారా మరింతగా సంచలనం కలిగించాలని ప్రణాళిక వేసుకున్నట్లు వెల్లడైంది.  తొలుత ఆ నిందితులు తమని తాము నిప్పంటించుకోవాలని ప్రణాళికలు రచించినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు కరపత్రాలను విసిరేయాలని కూడా అనుకున్నారు.  అయితే ఎందుకనో చివరి నిమిషంలో ఆ ప్లాన్‌ని విరమించుకొని, పసుపు రంగు గ్యాస్ డబ్బాలతో రచ్చ చేసే ప్లాన్‌తో నిందితులు ముందుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.  ‘‘లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకే ప్రణాళికను ఖరారు చేయడానికి ముందు.. తమ సందేశాన్ని ప్రభుత్వానికి బలంగా పంపేందుకు గాను నిందితులు ఇతర వ్యూహాలను రచించారు. తమ శరీరాలను ఫైర్‌ప్రూఫ్ జెల్‌తో కప్పుకొని, తమని తాము నిప్పంటించుకోవాలని…

Read More

మూడు రాష్ట్రాల పోలీసులకు కొరకరాని కొయ్యగా మారి సవాల్ విసురుతున్న మడావి హిడ్మా అలియాస్ చైతు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో హతమయ్యాడు. అయితే, పోలీసులు కాల్పుల్లో హిడ్మా చనిపోయాడంటూ గతంలోనూ వార్తలు వచ్చినా.. కొద్ది రోజులకే తాను బతికే ఉన్నానంటూ ప్రకటించి పోలీసులకు షాకిచ్చాడు. తాజాగా, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడంటూ ప్రచారం జరుగుతోంది. పక్కా సమాచారంతో ఎంపీ పోలీసులకు చెందిన హాక్ ఫోర్స్ సిబ్బంది బాలాఘాట్ జిల్లా గాధి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో హిడ్మాను హతమార్చాయి. దట్టమైన ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలపై మావోయిస్టులు పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు హిడ్మా మోస్ట్ వాంటెండ్‌గా ఉన్నాడు. అతడిపై ఏకంగా రూ.14 లక్షల రివార్డు కూడా ఉంది. హిడ్మా స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని బిజపుర్ జిల్లా మిర్తూర్. గోండియా-రాజ్‌నంద్‌గావ్- బాలాఘాట్ డివిజన్‌లో చురుకుగా వ్యవహరించేప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు రాజేష్ అలియాస్ దామాకు హిడ్మా…

Read More

ప్రతిపక్షాలకు తరచూ ఏదో విధంగా పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవడమే పని అయిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. విపక్షాలు చివరికి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనను కూడా రాజకీయం చేస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని సభలకు అడ్డుతగులుతోందని ఆయన విమర్శించారు. శీతాకాల పార్లమెంట్ సెషన్‌లో ఇప్పటి పరిణామాలపై ఆయన స్పందించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి కూడా అయిన ఠాగూర్ ఢిల్లీ లోని నజాఫ్‌ఘర్‌లో ఓ స్కూల్‌లో జరిగిన గ్రామీణ క్రీడా పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో మాట్లాడుతూ ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో ఓటమి తరువాత కాంగ్రెస్‌కు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఏదో విధంగా సభలను అడ్డుకోవడం ద్వారా తమ పరాజయం గురించి పలువురికి తెలియకుండా చేసుకోవాలనుకుంటున్నారని, దీనితో పార్లమెంట్ పరిణామాలను సాకుగా తీసుకుని ఇప్పుడు రాద్ధాంతానికి దిగుతున్నారని విమర్శించారు. దేనిని రాజకీయం చేయకుండా వదిలిపెట్టరాదనేదే ప్రతిపక్షాల అరాచక పద్ధతి అయిందని ప్రధానంగా…

Read More

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శివసేన(యుబిటి), ఎన్‌సిపి దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం గడువును మరో 10 రోజుల పాటు పొడిగించింది.  తొలుత డిసెంబర్ 31 లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు తాజాగా వచ్చే ఏడాది జనవరి 10 వరకు గడువును పొడిగించింది.  పిటిషన్లకు సంబంధించిన వాదప్రతివాదనలు డిసెంబర్ 20వ తేదీకి ముగుస్తాయని, వీటిపై నిర్ణయం తీసుకునేందుకు తనకు మరికొంత వ్యవధి కావాలని స్పీకర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. దీంతో జనవరి 10వ తేదీ లోగా తీర్పు చెప్పాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. శివసేనకు ఉద్ధవ్ థాక్రే వర్గం, ఎన్‌సిపికి చెందిన శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి…

Read More

లోక్‌సభలో భద్రతా వైఫల్య ఘటనలో ఆరో వ్యక్తి, కీలక నిందితుడుగా భావిస్తున్న లలిత్‌  ఝాను పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారంనాడు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది. ఢిల్లీ పోలీసులు 15 రోజలు కస్టడీ కోరగా.. కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది. బీహార్‌కి చెందిన లలిత్‌ ఝా కోల్‌కతాలో టీచర్‌గా పనిచేస్తున్నారని, రెండేళ్ల క్రితం కోల్‌కతా నుండి వెళ్లిపోయినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం పోలీసులకు లొంగిపోవడంతో వెంటనే అతన్ని అరెస్టు చేశారు. భద్రతా ఉల్లంఘనల ఘటనకు తెరవెనుక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝూ పోలీసు విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. విప్లవ భావజాలం గల వీళ్లంతా దేశం దృష్టిని ఆకర్షించేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో ఒకవేళ ప్లాన్-ఎ విఫలమైతే, ప్లాన్-బీకి పాల్పడేందుకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా?  ఇందుకు సంబంధించి శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని, యినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో వ్యాఖ్యానించారు.  ”ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలి. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావొచ్చు” అని కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ చెప్పారు. సుమారు 15 రోజుల నుంచి 20 రోజుల ముందుగానే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ తమ మంత్రులతో చెప్పారు. కాగా 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా మే 23న ఫలితాలు వచ్చాయి. సీఎం జగన్ చెప్పిన ప్రకారం…

Read More

 గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయని చెబుతూ పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ డా. తమిళిసై సౌందరాజన్ తెలిపారు. ప్రజాకవి కాళోజీ కవితతో తెలంగాణ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందని ఆమె హామీ ఇచ్చారు. అణిచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందని ధ్వజమెత్తుతూ ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  రైతుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చామని చెబుతూ కార్యచరణ రూపొందిస్తామని ఆమె వెల్లడించాయిరు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.…

Read More

 ఆంధ్ర ప్రదేశ్ లో నకిలీ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వైసిపి, టిడిపి పరస్పర ఫిర్యాదులు చేసుకోగా తాజాగా గురువారం మళ్లీ వారితో పాటు బీజేపీ కూడా ఫిర్యాదు చేసింది.  కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వైసిపి ఎంపిలు వి విజయసాయిరెడ్డి, ఎ అయోధ్యరామిరెడ్డి, ఎస్‌ నిరంజన్‌రెడ్డి, భీశెట్టి సత్యవతి, మద్దిల గురుమూర్తి సమావేశమయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఐదు అంశాలు ఇసికి వివరించామని, చట్ట విరుద్ధంగా టిడిపి వ్యవహరిస్తుందని తెలిపామని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలు ఉల్లంఘించేలా ‘మై పార్టీ డాష్‌ బోర్డ్‌ డాట్‌ కామ్‌’ ద్వారా ఓటర్‌ వివరాలు టిడిపి నమోదు చేస్తుందని ఆయన ఆరోపించారు. అమెరికా సర్వర్‌లో ఓటర్‌ డేటా స్టోర్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. సేవామిత్ర అనే అప్లికేషన్‌పై గతంలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పురోగతి లేదని…

Read More