తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్ సభలో భద్రతా ఉల్లంఘనపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు వాకౌట్ చేయగా వారి గైర్హాజరీలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు-2023ను ఎగువ సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2023కు లోక్ సభ గత వారం ఆమోదం తెలిపింది. దీనిపై చర్చకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తప్పనిసరి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి క్యాంపస్‌ను ప్రారంభించామని, తెలంగాణ ప్రభుత్వం సరైన సమయంలో సహకరించి ఉంటే ఈపాటికి ఈ విశ్వవిద్యాలయం వచ్చి ఉండేదని తెలిపారు. భూమి ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని, అందువల్ల అమలులో జాప్యం జరిగిందని…
Author: Editor's Desk, Tattva News
పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. ఈ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి ముందుకు దూసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు యువకులు లోక్ సభలోకి చొరబడి ఎంపీలపై టియర్ గ్యాస్ వదలడం వీడియోలో కనిపిస్తోంది. దుండగుల వద్ద ఆయుధాలు కూడా ఉండి ఉండొచ్చని అనుమానాలు…
జార్ఖండ్‌కు చెందిన ఒక కాంగ్రెస్ ఎంపీ కుటుంబానికి చెందిన ఒడిశాలోని డిస్టిలరీలపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరిపి దాదాపు రూ. 350 కోట్ల నగదు, మూడు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అవినీతికి సంబంధించి కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వ్యంగ్యాస్త్రాలను సంధించారు. స్పానిష్‌కు చెందిన హిట్ సిరీస్ మనీ హీస్ట్ (ధన దోపిడీ) ఆధారంగా బిజెపి మార్ఫింగ్ చేసిన వీడియోను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు. ఆదాయం పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టల ఫోటోతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫోటోను జతచేస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటోను ఆయన షేర్ చేశారు. కాంగ్రెస్ పారీ ఉండగా భారత్‌లో మనీ హీస్ట్ కల్పిత సిరీస్ ఎవరికి కావాలి..గత 70 ఏళ్లుగా..ఇప్పటికీ ధన దోపిడీలలో వారు ప్రసిద్ధులు..అంటూ ఎక్స్‌లో ప్రధాని మోదీరాసుకొచ్చారు. అంతకుముందు బిజెపి ఒక కాంగ్రెస్‌ను విమర్శిస్తూ…
విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్)కు చేయూతనివ్వాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ సంస్థ నష్టాలబాట పట్టడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని నిందించారు. 2004 నుంచి 2014 వరకు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని, స్టీల్ ప్లాంటుకు ఇనుప ఖనిజం గనులను కేటాయించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశాయని నిందించారు. సొంత గనులు (క్యాప్టివ్ మైన్స్) కేటాయించాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చాలా కాలంగా కోరుతోందని తెలిపారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న సోనియా గాంధీని సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో రాయ్‌బరేలీలో రూ. 2,000 కోట్ల పెట్టుబడితో ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంట్ ఏర్పాటు చేయించిందని, ఈ కారణంగా…
వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించే లక్షంతో దుబాయిలో జరుగుతున్న కాప్ 28 సదస్సులో మంగళవారం కలకలం చెలరేగింది. మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాన్‌గుజమ్ అనే 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా వేదికపైకి చేరి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసింది. ఈ క్రమంలో వేదికపై ప్లకార్డు పట్టుకుని నిరసన తెలియజేసింది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా శిలాజ ఇంధనాల వాడకాన్ని వెంటనే తగ్గించాలంటూ లిసిప్రియ నినదించారు. చర్చలకు సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న వ్యక్తి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా లిసిప్రియ వినలేదు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని విస్పష్టంగా అందరికీ వివరించింది. చివరకు ఇద్దరు భద్రత సిబ్బంది లిసిప్రియను వేదిక నుంచి పక్కకు తీసుకెళ్లారు. అయితే చర్చల్లో పాల్గొన్న వివిధ దేశాల సభ్యులు మాత్రం లిసిప్రియ చర్యను సమర్ధిస్తూ చప్పట్లతో అభినందించారు. నిర్వాహకులు కూడా లిసిప్రియ చర్యను తప్పుపట్టక పోగా .. ఈ కాలపు యువత ఆశయాలకు లిసిప్రియ నిదర్శనమని ,…
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్షంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మందికి పైగా గాయపడ్డారు.. ఈ దాడిని పాకిస్తాన్ తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు జరిపినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని ఓ పాఠశాల భవనాన్ని పాక్ సైన్యం తాత్కాలిక సైనిక స్థావరంగా ఏర్పాటు చేసుకుంది. ఈ ఆర్మీ బేస్‌పై మంగళవారం తెల్లవారు జామున పేలుడు పదార్థాలు నిండిన కారుతో ఉగ్రవాదులు పాఠశాలభవనాన్ని ఢీకొట్టారు. ఆత్మాహుతి బాంబర్లు సెక్యూరిటీ కాంపౌండ్ లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. భవనం లోని మూడు గదులు కూలిపోయాయి. అయితే దాడి జరిగిన సమయంలో సైనికులతో పాటు ఇతరులు నిద్రలో ఉన్నారు.. మరణించిన వారిలో చాలా మంది సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారు. అఫ్గానిస్థాన్ సరిహద్దు లోని గిరిజన ప్రాంతాలకు సమీపంలో జరిగిన ఈ దాడికి…
తనను పరామర్శించేందుకు ఆస్పత్రికి రావొద్దంటూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించేందుకు నిత్యం వేలాది మంది ఆస్పత్రికి వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అగ్ర హీరో చిరంజీవి, నటుడు ప్రకాష్ రాజ్ సహా పలువురు మంత్రులు, పలు రంగాల ప్రముఖులు కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు. తాను త్వరలోనే కోలుకొని వస్తానని, తనను కలిసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దంటూ కేసీఆర్ మంగళవారం ఒక ప్రత్యేక వీడియోలో విజ్ఞప్తి చేశారు. ‘ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు నన్ను బయటకు పంపించడంలేదు. కోలుకొని త్వరలోనే మీ ముందుకు వస్తా. నాతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకింత భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. అయితే, కేసీఆర్ వీడియో విడుదల చేసినప్పటికీ…
రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరును బిజెపి అధిష్టానం ఖరారు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును ఫైనల్ చేసింది. బిజెపి శాసనసభ పక్ష సమావేశంలో భజన్‌లాల్ శర్మను సీఎంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురుచూసిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బిజెపి అధిష్టానం పక్కన పెట్టింది. భజన్ లాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కొత్తవారికే సీఎంగా అవకాశం ఇచ్చింది బిజెపి అధిష్టానం. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ నియోజకవర్గం నుంచి శర్మ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే సీఎం రేసులో వసుంధర రాజే, గజేంద్ర షెకావత్, మహంత్ బాలాకాంత్, దియా కుమారి, అనిత భదేల్, మంజు బఘ్‌మర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఉన్నారు. కానీ చివరికి తొలిసారి ఎమ్మెల్యేగా…
ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకశ్మీర్‌లో ప్రశాంతత నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలకు అక్కడి సమాజం నుంచి సానుకూల స్పందన కనిపిస్తోందని, అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌పై సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాలతో పాటు జమ్ముకశ్మీర్‌కు సమానంగా హక్కులు, అధికారాలు కలిగి ఉండాలని, భారత రాజ్యాంగం అమలు జరగాలని కోరుకున్నామని తెలిపారు. ఆ రాష్ట్రంలో పర్యాటకం బాగా పెరిగిందని, ఈ ఏడాది 2 కోట్లు దాటి పర్యాటకులు సందర్శించారని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో మొదటిసారి జీ-20 అంతర్జాతీయ సదస్సు నిర్వహించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ సహా విపక్షాల నేతలు జమ్ము కశ్మీర్‌పై అంతర్జాతీయ సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లేలా మాట్లాడారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పుపై వ్యాఖ్యలు చేస్తున్న వారికి కశ్మీర్‌లో మార్పు…
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర ప్రధాని నరేంద్ర మోదీ గురించిన ఓ పద్యం పాడారు. మోదీని కీర్తిస్తూ బండారు విజయలక్ష్మి కూతురు ఆలపించిన పద్యాన్ని దత్తాత్రేయ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ చిన్నారి పాడిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, దత్తన్న మనవరాలి వీడియోను ప్రధాని మోదీ కూడా చూశారు. ఆ చిట్టితల్లిని ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఆ చిన్నారి పాడిన పాట ఎంతో సృజనాత్మకంగా, మనసుకు హత్తుకునేలా ఉందని మెచ్చుకున్నారు. ఆమె మాటలు గొప్ప శక్తినిచ్చేలా ఉన్నాయని కొనియాడుతూ ప్రధాని స్పెషల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బండారు దత్తాత్రేయ కూతురు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆమెకు ఇటీవల ఈ బాధ్యతలు అప్పగించారు. విజయలక్ష్మి ప్రస్తుతం అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని విజయలక్ష్మి భావించినప్పటికీ ఆ తర్వాత…