మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బీజేపీ సీనియర్ నేత మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. సోమవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అసెంబ్లీ స్పీకర్ గా మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఉపముఖ్యమంత్రులుగా జగదీశ్ దేవ్డా, రాజేశ్ శుక్లాల పేర్లను బిజెపి అధిష్టానం ఖరారు చేసింది. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2013లో ఎమ్మెల్యేగా మొదటి ఎన్నికతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆయన ఎన్నికయ్యారు.ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జులై 2, 2020న క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. నాటి నుంచి రాష్ట్ర రాజకీయ దృశ్యంలో యాదవ్ ప్రభావం మరింత పటిష్టమైంది. మూడుసార్లు ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి…
Author: Editor's Desk, Tattva News
తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజులకొత్తూరు వద్ద సోమవారం నాడు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తోపాటు ఆయన అర్ధాంగి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ, తొడల్లుడు భరత్, బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మజిలీకి గుర్తుగా తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో వైసీపీ సర్కారు మూసివేసిన పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించినట్టు పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే పైలాన్ ఆవిష్కరణ నేపథ్యంలో తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా…
పార్లమెంట్ నుండి బహిష్కరణకు గురైన తృణమూల్ పార్టీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను లోక్‌సభ నుంచి బహిష్కరించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ గురించి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు మహువా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, విలువైన బహుమతులు తీసుకుందంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై ఆయన లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ కేసులో హీరానందానీ అప్రూవర్‌గా మారారు. ప్రశ్నలు అడిగేందుకు తాను ఎంపీ మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఆరోపించారు. కృష్ణా నగర్ ఎంపీ అయిన మహువా మొయిత్రా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకొని ప్రధాని…
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందచేశారు. రాజీనామా అమోదించాల్సిందిగా కోరేందుకు వెళ్లానని, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీకి లేఖను అందచేసినట్టు చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత తన గన్‌మెన్‌లను తిప్పి పంపారు. గత కొంత కాలంగా ఆళ్ల రామకృష్ణా రెడ్డికి పార్టీతో దూరం పెరుగుతోందనే ప్రచారం వైసీపీలో జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో మంగళగిరి స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని ఆర్కే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం తనను సంప్రదించకుండా పలు నిర్ణయాలు తీసుకోవడంపై కూడా కినుక వహించారు. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం గురించి స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకపోవడం ఆళ్లను మనస్తాపానికి…
ఆర్టికల్ 370 రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టి పారేయలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎట్టకేలకు సంచలన తీర్పును వెలువరించింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పును సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ బద్దమేనని స్పష్టం చేసింది. ఈ ఆర్టికల్ 370 రద్దు కేసు విచారణలో భాగంగా రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న ఐదుగురు జడ్జిలు 3 రకాలు తీర్పులు వెల్లడించారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనంలోనే భిన్నమైన తీర్పులు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా…
కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి, దోపిడీకి గ్యారంటీ అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కే. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటే అభివృద్ధికి, పేదల సంక్షేమానికి గ్యారంటీ అని ఆయన తెలిపారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ నేత ధీరజ్ సాహు నివాసంలో బయటపడ్డ కోట్లాది రూపాయల నోట్ల కట్టల గురించి ప్రస్తావిస్తూ విచ్ఛిన్నకర రాజకీయాలకు కాంగ్రెస్ చిరునామాగా మారిందని విమర్శించారు. సాహు నివాసంలో దొరికిన నగదును లెక్కించే మెషీన్లు సైతం పాడైపోయాయని, 5 రోజులుగా లెక్కించే పని కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 300 కోట్లు లెక్కించగలిగారని, ఇంకా లెక్కించాల్సింది చాలా ఉందని తెలిపారు. సాహు కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఇలాంటి అవినీతిపరులకు కాంగ్రెస్ కొమ్ముకాస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ఎందుకంటే సాహు వంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారారని విమర్శించారు. ధీరజ్…
ఇండియా కూటమి తదుపరి సమావేశాన్ని ఈనెల 19న ఢిల్లీలో నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు కూటమి ముందున్న సవాళ్లలో ప్రధానమైనవి. పార్టీల నేతల అందుబాటు విషయాన్ని దృస్టిలో పెట్టుకుని ఇప్పటికైతే 19వ తేదీన ఈ సమావేశం ఖరారు అయిందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఇండియా భేటీ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రధాని మోదీకి కౌంటర్‌గా ‘నేను కాదు.. మేము’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మధ్యభారతంలోని మూడు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తాజా ఓటమి నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురుకానుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రచార దశలో , ప్రత్యేకించి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్…
తొలి నుండి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్న ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇప్పుడు సొంత కుటుంభ సభ్యుల నుండే చిక్కుల్లో పడుతున్నారు. భగవంత్ మాన్ గురించి మొదటి భార్య కూతురు చేసిన సంచలన ఆరోపణలు మరువకముందే మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవంత్ మాన్ నగ్నవీడియోలు బయటపెడతానంటూ ఆయన మాజీ భార్య ఇంద్రప్రీత్ కౌర్ గ్రేవాల్ హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను శిరోమణి అకాళీదల్ పార్టీ అధికార ప్రతినిధి పరంబన్స్ సింగ్ రోమానా షేర్ చేశారు. ఫేస్‌బుక్‌లో ఓ న్యాయవాది పోస్టుకు ప్రీత్ గ్రేవాల్ ఈ రిప్లై ఇచ్చినట్లు తెలిసింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మద్యం తాగుతూ నగ్నంగా ఉన్న వీడియోలను బయటపెడతానంటూ ఆమె కలకలం రేపారు. ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ట్విటర్‌లో పంచుకున్న శిరోమణి అకాళీదల్…
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. మొత్తం 176 డబ్బుల సంచులకుగాను అధికారులు ఇప్పటివరకు 140 లెక్కించారు. మరో 36 సంచులు లెక్కించాల్సి ఉంది. దీంతో ధీరజ్ సాహు అక్రమ సంపాదన డబ్బు మరింత పెరగనుంది. ఇప్పటివరకు ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన ఒక ఆపరేషన్‌లో ఏదైనా ఏజెన్సీ ద్వారా అత్యధికంగా పట్టుబడిన నల్లధనం ఇదే కావడం గమనార్హం. దాడుల సమయంలో స్వాధీనం చేసుకున్న నగదు లెక్కింపు సోమవారం నాటికి పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తమకు 176 సంచుల నగదు వచ్చిందని, వాటిలో 140 లెక్కింపు పూర్తైందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ భగత్ బెహెరా తెలిపారు. మూడు బ్యాంకులకు చెందిన 50 మంది అధికారులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు చెప్పారు. అలాగే డబ్బులను లెక్కించేందుకు 40 యంత్రాలను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. …
బిఎస్‌పి అగ్రనేత్రి మాయావతి తన రాజకీయ వారసునిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. ఆకాశ్ ఆనంద్ ఇంతకాలం వరకు బీఎస్పీ నేషనల్ కార్డినేటర్గా బాధ్యతలు నిర్వహించారు. 2017లో 22ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన్ని పార్టీ నేతలకు మాయావతి ఆయన్ని పరిచయం చేశారు. బిజినెస్ గ్యాడ్జ్యూయేట్ అయిన ఆకాశ్ ఆనంద్ మయావతి ఫొటోల్లో అనేకమార్లు కనిపించారు. 2019 లోక్సభ ఎన్నికల వేళ బీఎస్పీ ప్రచారాల్లో కీలకంగా వ్యవహించారు. ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో తొలి ర్యాలీని నిర్వహించారు. 2022 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సోషల్ మీడియా క్యాంపైన్ని రన్ చేశారు. ఈ ఏడాది తొలినాళ్లల్లో 14 రోజుల సర్వజన్ హిత్, సర్వజన్ సుఖ్ అనే పేరుతో సంకల్ప యాత్రను లాంచ్ చేశారు ఆకాశ్ ఆనంద్. వారసత్వ రాజకీయాలను నిత్యం విమర్శించే మాయావతి 2019లో బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా తన సోదరుడు ఆనంద్ కుమార్ని ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు ఏకంగా…